Watch: మీరు ఎప్పుడైనా గడియారాల ప్రకటనలను జాగ్రత్తగా గమనించారా? దాదాపు ప్రతి గడియారంలోనూ సమయం 10:10గా ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దాదాపు వందేళ్లుగా గడియారాల పరిశ్రమలో కొనసాగుతున్న ఒక ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహం. దీనికి అసలు కారణం ఏంటంటే.?
చాలా గడియారాల్లో కంపెనీ పేరు లేదా లోగో డయల్‌లో 12 అంకె కింద భాగంలో ఉంటుంది. గడియారం ముళ్లులు 10:10 వద్ద ఉన్నప్పుడు అవి ఇంగ్లీష్ అక్షరం "V" ఆకారంలో కనిపిస్తాయి. ఈ ఆకారం బ్రాండ్ పేరును చక్కగా ఫ్రేమ్ చేసినట్లు కనిపించేలా చేస్తుంది. దీంతో వినియోగదారుల దృష్టి నేరుగా కంపెనీ పేరుపై పడుతుంది. అంతేకాకుండా గడియారం డిజైన్ కూడా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
25
గడియారం ఫీచర్లు స్పష్టంగా కనిపిస్తాయి
10:10 సమయానికి గంట, నిమిషాల సూళ్లు ఒకదానికొకటి అడ్డంగా ఉండవు. రెండూ వేర్వేరు వైపులా ఉండటం వల్ల డయల్ మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో తేదీ చూపించే విండో కనిపిస్తుంది. డయల్ డిజైన్ పూర్తిగా స్పష్టంగా ఉంటుంది. బ్రాండ్ లోగో స్పష్టంగా ఉంటుంది. గడియారం అందం మరింత బాగా కనిపిస్తుంది. అందుకే ప్రకటనల కోసం ఇది అత్యుత్తమ సమయంగా దీనిని భావిస్తారు.
35
10:10 సమయం ఒక చిరునవ్వులా కనిపిస్తుంది
మనస్తత్వ శాస్త్రం ప్రకారం 10:10 వద్ద ఉన్న గడియారం ఒక నవ్వుతున్న ముఖంలా కనిపిస్తుంది. 10 గంటల వైపు ఉన్న ముళ్లు ఒక కన్నులా, 2 గంటల వైపు ఉన్న ముళ్లు మరో కన్నులా, కింద భాగం చిరునవ్వులా కనిపిస్తుంది. మన మెదడు నవ్వుతున్న ముఖాలను సహజంగానే సానుకూలంగా స్వీకరిస్తుంది. అందువల్ల 10:10లో కనిపించే గడియారం చూసినప్పుడు వినియోగదారుల్లో మంచి భావన కలుగుతుంది. ఇది కొనుగోలు నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2017లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 10:10 సమయాన్ని చూపించే గడియారాలను చూసినవారిలో ఎక్కువ సానుకూల భావోద్వేగాలు కనిపించాయని వెల్లడైంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మనుషులు వస్తువుల్లో కూడా ముఖ ఆకారాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా చిరునవ్వులాంటి ఆకారాలు ఎక్కువ ఆకర్షణ కలిగిస్తాయి. అందుకే 10:10 సమయం మార్కెటింగ్ పరంగా ప్రభావవంతంగా మారింది.
55
ఈ సంప్రదాయాన్ని మొదట ప్రారంభించింది ఎవరు?
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రారంభ రోజుల్లో గడియారాల ప్రకటనల్లో 10:10 సమయాన్ని ఉపయోగించేవారు కాదు. అప్పట్లో చాలా కంపెనీలు 8:20 సమయాన్ని చూపించేవి. కానీ 8:20లో ముళ్లు కిందికి వంగి ఉండటం వల్ల అది ఒక బాధగా ఉన్న ముఖంలా కనిపించేది. దీంతో ఆ ప్రతికూల భావనను మార్చేందుకు గడియార తయారీ సంస్థలు కొత్త మార్గం అన్వేషించాయి.
1926లో అమెరికాకు చెందిన ప్రముఖ గడియార తయారీ సంస్థ హమిల్టన్ వాచ్ కంపెనీ మొదటిసారిగా 10:10 సమయాన్ని ప్రకటనల్లో ఉపయోగించినట్లు చెబుతారు. ఆ ఆలోచన విజయవంతం కావడంతో ఇతర కంపెనీలు కూడా అదే పద్ధతిని అనుసరించాయి. 1950ల నాటికి 10:10 సమయం ప్రపంచవ్యాప్తంగా గడియారాల ప్రకటనలలో ప్రామాణిక రూపంగా మారిపోయింది. నేటికీ ప్రముఖ బ్రాండ్లు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే ఇకపై మీరు ఏ గడియారం ప్రకటన చూసినా అందులో 10:10 సమయం కనిపిస్తే, అది కేవలం సమయం కాదు.. వినియోగదారులను ఆకర్షించేందుకు రూపొందించిన తెలివైన మార్కెటింగ్ వ్యూహమని గుర్తుంచుకోండి.