Train Lower Berth: రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు లోయర్ బెర్త్ దొరకట్లేదా? అయితే, ఈ వివరాలు మీకోసమే.. రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ పొందే టాప్ 5 సింపుల్ టిప్స్ మీకోసం.
రైలు ప్రయాణం అంటేనే ఒక విభిన్నమైన అనుభూతి. అయితే ఈ ప్రయాణంలో అందరికీ నచ్చేది, కావాలనుకునేది లోయర్ బెర్త్ మాత్రమే. ముఖ్యంగా వయస్సు పైబడిన వారు, సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్ దొరికితే ప్రయాణం హాయిగా సాగిపోతుందని భావిస్తారు. కానీ చాలా సార్లు మనం టికెట్ బుక్ చేసినప్పుడు అనుకున్న లోయర్ బెర్త్ రాదు. సీనియర్ సిటిజన్లకు కూడా ఆటోమేటిక్‌గా మిడిల్ లేదా అప్పర్ బెర్త్‌లు కేటాయించడం చూస్తుంటాం.
ఈ వయసులో పై బెర్త్ ఎక్కడం చాలా కష్టం. దీంతో చాలామంది ప్రయాణికులు రైల్వే వ్యవస్థపై అసహనం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీకు లేదా మీ ఇంట్లోని పెద్దలకు సులభంగా లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంటుంది. ఆ 5 ముఖ్యమైన టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
26
బెర్త్ ఛాయిస్ ఆప్షన్ సరిగ్గా ఎంచుకోండి
చాలామంది ప్రయాణికులు కౌంటర్‌లో టికెట్ తీసుకుంటారు, మరికొందరు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసేటప్పుడు అభ్యర్థి వివరాలు ఇచ్చే సమయంలో చాయిస్ ఆఫ్ బెర్త్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో తప్పనిసరిగా లోయర్ బెర్త్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఈ ఆప్షన్ ద్వారా 60 ఏళ్లు పైబడిన పురుషులకు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్త్ లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. టికెట్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభంలోనే ఈ వివరాలను సరిగ్గా నమోదు చేయడం చాలా ముఖ్యం.
36
ఈ ఒక్క కండిషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సమయంలో మరో ముఖ్యమైన ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అదే 'Book only if at least one lower berth is allotted' అనేది. టికెట్ బుకింగ్ చివరి దశలో ఈ బాక్స్‌ను క్లిక్ చేయాలి.
ఈ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల ఒకవేళ రైలులో లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటేనే మీ టికెట్ బుక్ అవుతుంది. ఒకవేళ లోయర్ బెర్త్ అందుబాటులో లేకపోతే మీ టికెట్ బుక్ కాకుండా ఆగిపోతుంది. దీనివల్ల మీకు ఇష్టం లేని మిడిల్ లేదా అప్పర్ బెర్త్‌లు రాకుండా చూసుకోవచ్చు.
మీకు ప్రయాణంలో కచ్చితంగా లోయర్ బెర్త్ కావాలనుకుంటే చివరి నిమిషం వరకు వేచి చూడకండి. ఎంత త్వరగా టికెట్ బుక్ చేసుకుంటే లోయర్ బెర్త్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీకి 120 రోజుల ముందే టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రయాణ తేదీకి చాలా రోజుల ముందే బుక్ చేయడం వల్ల లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉండి త్వరగా కన్ఫర్మ్ అవుతాయి. ఆలస్యంగా బుక్ చేస్తే బెర్త్‌లు నిండిపోయి మిడిల్ లేదా అప్పర్ బెర్త్‌లు మాత్రమే మిగులుతాయి.
56
సీనియర్ సిటిజన్ కోటాను ఉపయోగించుకోండి
మీతో పాటు వయోధికులు లేదా సీనియర్ సిటిజన్లు ప్రయాణిస్తుంటే బుకింగ్ సమయంలో తప్పనిసరిగా 'Senior Citizen Quota' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
రైల్వే వ్యవస్థ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా కొన్ని లోయర్ బెర్త్‌లను కేటాయిస్తుంది. మీరు ఈ కోటాను ఎంచుకోవడం వల్ల వారికి లోయర్ బెర్త్ దొరికే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. కాబట్టి ప్రయాణికుల వయస్సు నమోదు చేసేటప్పుడు ఈ కోటాను ఎంచుకోవడం మర్చిపోవద్దు.
66
టీటీఈ ని కలసి మాట్లాడండి
ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయ్యి కూడా మీకు లోయర్ బెర్త్ రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రయాణం రోజు రైలు ఎక్కిన తర్వాత సంబంధిత కోచ్ టీటీఈ ని నేరుగా కలవండి.
మీ సమస్యను టీటీఈకి వివరిస్తే, రైలులో ఏవైనా లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయో లేదో చూస్తారు. లేదా వేరే ప్రయాణికులతో మాట్లాడి సీటు మార్పిడి చేయడానికి సహాయం చేస్తారు. కాబట్టి ఆందోళన చెందకుండా టీటీఈ సాయం కోరడం మంచిది.