వాచ్ బ్యాటరీల్లో ఎంత వెండి ఉంటుంది.
కొన్ని వాచ్ బ్యాటరీలలో వెండిని పెడతారు. అలాగని అన్ని వాచ్ బ్యాటరీలలో ఇది ఉండాలని లేదు. సిల్వర్ ఆక్సైడ్ (Silver Oxide) టెక్నాలజీతో తయారైన 'SR' సిరీస్ బటన్ బ్యాటరీలలో వెండి ఉంటుంది. SR626SW, SR920SW, SR927SW వంటి మోడళ్లలో క్యాథోడ్‌గా సిల్వర్ ఆక్సైడ్ (Ag₂O) వాడతారు. అదే 'LR' సిరీస్ బ్యాటరీలలో జింక్, మాంగనీస్ డయాక్సైడ్ ఉంటాయి, వాటిలో ఎలాంటి వెండి ఉండదు.
'జర్నల్ ఆఫ్ పవర్ సోర్సెస్' మ్యాగజైన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం సుమారు 0.4 గ్రాముల బరువున్న ఒక చిన్న బ్యాటరీలో దాదాపు 0.12 గ్రాముల వెండి ఉండే అవకాశం ఉంది. అంటే అలాంటి 10 బ్యాటరీలను సేకరిస్తే, 1 నుంచి 3 గ్రాముల వరకు వెండి లభించే అవకాశం ఉంది. అయితే ఇది బ్యాటరీ సైజుపై ఆధారపడి ఉంటుంది.