నేరస్థులను మార్చడానికి.. సమాజానికి దూరంగా ఉంచడానికి జైళ్లను నిర్మిస్తారు. అయితే, ప్రపంచంలో కొన్ని అత్యంత ప్రమాదకరమైన నేరస్థులు, ఉగ్రవాదులు , సీరియల్ కిల్లర్ల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కొన్ని జైళ్లు ఉన్నాయి. ఇక్కడి భద్రతా ఏర్పాట్లు ఎంత కఠినంగా ఉంటాయంటే, ఇక్కడి నుంచి ఏ ఒక్క ఖైదీ కూడా తప్పించుకోవడం అసాధ్యం. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే టాప్ 5 జైళ్ల గురించి తెలుసుకుందాం.
ఫూచూ జైలు, జపాన్
ఈ లిస్ట్ లో ఐదవ స్థానంలో జపాన్‌లోని ఫూచూ జైలు ఉంది. ఈ జైలులో ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క ఖైదీ కూడా తప్పించుకోలేకపోయారు. ఇక్కడ వెయ్యి మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది 24 గంటలు పహారా కాస్తుంటారు . ఈ జైలులో అత్యాధునిక బయోమెట్రిక్ స్కానింగ్, కంటి కదలికలను కూడా కనిపెట్టే ఏఐ కెమెరాలు ఉన్నాయి. అలాగే, నేల మీద ఎవరైనా సొరంగాల ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే క్షణాల్లో పసిగట్టే సున్నితమైన సౌండ్ వైబ్రేషన్ సెన్సార్లు కూడా అమర్చబడి ఉన్నాయి.