Trains: మనదేశంలో మొత్తం ఎన్ని రైళ్లు ఉన్నాయి? ప్రతిరోజూ ఎన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణం చేస్తారు?

Published : Nov 11, 2026, 12:53 PM IST

Trains: మనదేశంలో ప్రధాన రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతిరోజూ కోట్లమంది రైళ్లలో ప్రయాణం చేస్తారు. అసలు మనదేశంలో ఎన్ని రైళ్లు ఉన్నాయి? వాటిలో గూడ్స్ రైళ్లు ఎన్ని? ప్రయాణికుల రైళ్లు ఎన్ని? ఈ వివరాలు తెలుసుకోండి.

PREV
13
మొదటి రైలు ప్రయాణం

భారతదేశ రవాణా వ్యవస్థలో రైల్వే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 68,584 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. 1853 ఏప్రిల్ 16న ముంబైలోని బోరిబందర్ నుంచి ఠాణే మధ్య కేవలం 34 కిలోమీటర్ల దూరం సాగిన మొదటి ప్రయాణం నేడు దేశ నలుమూలలనూ కలిపే అతిపెద్ద ప్రజా రవాణాగా అవతరించింది. చౌకైన చార్జీలు, సురక్షిత ప్రయాణం కారణంగా సామాన్యులు రోడ్డు లేదా విమాన మార్గాల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.

23
మనదేశంలో ఎన్ని రైళ్లు ఉన్నాయి?

దేశంలో ప్రస్తుతం రోజుకు 23,000 కంటే ఎక్కువ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. ఇందులో సాధారణ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్యాసింజర్ రైళ్లు 13,000 పైగా ఉంటే, మిగిలినవి వివిధ ప్రాంతాలకు నిత్యావసర సరుకులు తరలించే గూడ్స్ రైళ్లు. సాధారణ రోజుల్లోనే ప్రతిరోజూ సుమారు 2.40 కోట్ల నుంచి 2.50 కోట్ల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. ఈ సంఖ్య ప్రపంచంలోని ఎన్నో దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా రైల్వే శాఖ నిరంతరం కొత్త మార్గాలు వేస్తూ, పాత ట్రాకులను ఆధునీకరిస్తోంది.

33
పండుగల సమయంలో ఎన్ని ప్రత్యేక రైళ్లు?

దీపావళి, ఛట్ పూజ, సంక్రాంతి, హోలీ వంటి పెద్ద పండుగల సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఊహించని రీతిలో పెరుగుతుంది. పండుగల సీజన్లలో కుటుంబాలను కలుసుకోవడానికి సుమారు 2 కోట్లకు పైగా జనం అదనంగా ప్రయాణాలు చేస్తుంటారు. ఈ విపరీతమైన రద్దీని తట్టుకోవడానికి రైల్వే శాఖ ప్రతి ఏటా దాదాపు 18,000 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ముఖ్యమైన స్టేషన్లలో తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక వెయిటింగ్ షెడ్లు, అదనపు టికెట్ కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లు చేస్తూ ప్రజలు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories