Most Expensive Cafes: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్ 5 కెఫేలు ఇవే.. ఒక్క కాఫీ ధర వింటే మైండ్ బ్లాకే

Published : Oct 14, 2026, 04:05 PM IST

Top 5 Most Expensive Cafes in the World: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెఫేలు చాలానే ఉన్నాయి. ఇవి అందించే రాయల్ అనుభూతి, బంగారు కప్‌కేక్ నుండి సెంచరీల నాటి హిస్టార్రిక్ కాఫీ ధరలు చూస్తే షాక్ అవుతారు. వాటిలో అత్యంత ఖరీదైన టాప్ 5 కెఫేల వివరాలు మీకోసం.

PREV
16
కాఫీకి ఉండే క్రేజ్ అలాంటిది

చాలా మందికి ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ తాగడం ఒక అలవాటు. చాలామందికి ఇది రోజూ చేసుకునే ఒక సింపుల్, పాకెట్ ఫ్రెండ్లీ రొటీన్. కానీ కొందరికి మాత్రం కాఫీ అంటే కేవలం ఒక పానీయం కాదు.. అది ఒక లగ్జరీ లైఫ్‌స్టైల్, రాయల్ ఎక్స్‌పీరియన్స్, ఒక గొప్ప హిస్టరీ. అద్భుతమైన ఆర్కిటెక్చర్, బంగారం మెరుపులు, ప్రఖ్యాత చెఫ్‌ల వంటకాల మధ్య కాఫీ తాగడం అంటే అక్కడ మీరు కప్పు కాఫీకి మాత్రమే కాదు, ఆ రాయల్ వాతావరణానికి కూడా డబ్బులు చెల్లిస్తున్నట్లే. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 5 కెఫేలు ఏవో మీకు తెలుసా?

26
బ్లూమ్స్‌బెరీస్ – దుబాయ్, యూఏఈ

దుబాయ్ అంటేనే లగ్జరీకి కేరాఫ్ అడ్రస్. దుబాయ్‌లోని బ్లూమ్స్‌బెరీస్' కెఫేలో లభించే గోల్డెన్ ఫినిక్స్ కప్‌కేక్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. ఈ ఒక్క కప్‌కేక్ ధర సుమారు $1,000 అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు ₹88,000. తినదగిన 24 క్యారెట్ల నిజమైన బంగారు రేకులు, ప్రీమియం ఇటాలియన్ చాక్లెట్, ఆర్గానిక్ ఉగాండన్ వానిల్లాతో దీన్ని తయారు చేస్తారు. అంతేకాదు, దీనిని 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటెడ్ ట్రేలో వేసి సెర్వ్ చేస్తారు.

36
బ్లూ బాక్స్ కెఫే బై డేనియల్ బౌలుడ్ – న్యూయార్క్, యూఎస్ఏ

న్యూయార్క్ సిటీలోని టిఫ్ఫనీ అండ్ కో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో ఈ బ్లూ బాక్స్ కెఫే ఉంది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ లేదా టీ సర్వీస్ పొందాలంటే కనీసం $50 అంటే భారత కరెన్సీలో దాదాపు ₹4,400 ఖర్చు చేయాల్సిందే. ఫేమస్ రాబిన్-ఎగ్ బ్లూ కలర్ థీమ్, మిచెలిన్ స్టార్ చెఫ్ డేనియల్ బౌలుడ్ క్యూరేట్ చేసిన స్పెషల్ మెనూ ఇక్కడి హైలైట్. ఇక్కడ ఖర్చు చేసే ప్రతి రూపాయి కేవలం ఫుడ్ కోసం మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్ ఫోటోలు, టిఫ్ఫనీ రాయల్ బ్రాండింగ్ కోసం కూడా అని మీరు నమ్ముతారా !

46
కెఫే ఫ్లోరియన్ – వెనిస్, ఇటలీ

వెనిస్‌లోని సెయింట్ మార్క్స్ స్క్వేర్‌లో 1720లో ప్రారంభమైన 'కెఫే ఫ్లోరియన్' ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కెఫేలలో ఒకటి. ఇక్కడ బయట కూర్చుని ఒక సింపుల్ కాఫీ లేదా ఒక గ్లాస్ వాటర్ తాగాలన్నా సరే €10 నుండి €15 వరకు అంటే భారత కరెన్సీలో దాదాపు ₹950 నుండి ₹1,425 అవుతుంది. ఈ ప్రైస్ వెనుక ఒక కారణం ఉంది. అక్కడ తరతరాలుగా కస్టమర్ల కోసం ప్లే చేసే లైవ్ ఆర్కెస్ట్రా బ్యాండ్ మ్యూజిక్ ఉంటుంది.

56
యాంటికో కెఫే గ్రెకో – రోమ్, ఇటలీ

రోమ్‌లో 1760 నుండి నడుస్తున్న 'యాంటికో కెఫే గ్రెకో'కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. గోథే, కీట్స్, కాసనోవా వంటి గొప్ప గొప్ప చారిత్రక వ్యక్తులు ఈ కెఫేను సందర్శించారు. ఇక్కడ ఒక సింపుల్ ఎక్స్‌ప్రెస్సో కాఫీ తాగడానికి భారత కరెన్సీలో దాదాపు ₹1,140 నుండి ₹1,900 ఖర్చు అవుతుంది. 18వ శతాబ్దపు ఒరిజినల్ ఆర్ట్, బంగారు వెలుగుల అద్దాలు, రాయల్ వెల్వెట్ సీటింగ్‌ల మధ్య కూర్చుని కాఫీ తాగడం ఒక ఆర్ట్ మ్యూజియం విజిట్ చేసిన అనుభూతిని ఇస్తుంది.

66
కెఫే డి లా పైక్స్ – పారిస్, ఫ్రాన్స్

పారిస్ ఒపెరా హౌస్‌కు ఎదురుగా ఉన్న ఈ 19వ శతాబ్దపు ప్రసిద్ధ కెఫేలో ఒక్క కప్పు కాఫీ ధర దాదాపు ₹1,050 నుండి ₹1,580 కంటే ఎక్కువగా ఉంటుంది. నెపోలియన్ III స్టైల్ డిజైన్, అద్భుతమైన లొకేషన్, పారిస్ నగరపు సంపన్నులను చూస్తూ కాఫీ తాగే బెస్ట్ టెర్రస్ వ్యూ ఇక్కడి స్పెషాలిటీ.

నిజం చెప్పాలంటే, దుబాయ్ గోల్డ్ కప్‌కేక్ నుండి వెనిస్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ వరకు... ఈ టాప్ 5 కెఫేలలో లగ్జరీ అనేది కేవలం కాఫీ కప్పులో మాత్రమే లేదు, మీరు కూర్చునే రాయల్ వాతావరణంలో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories