Top 3 Wealthy Countries: ప్రపంచంలో పేదరికం లేని 3 దేశాలు.. ఇక్కడ ప్రతీ మూడో వ్యక్తి కోటీశ్వరుడే ! అసలు సీక్రెట్ ఇదే

Published : Oct 25, 2026, 02:14 PM IST

Top 3 Wealthy Countries: ప్రపంచంలో సంపన్నమైన దేశాల లిస్టులో మోనాకో, లక్సెంబర్గ్, లీచ్టెన్‌స్టెయిన్ దేశాల పేర్లు తప్పకుండా ఉంటాయి. ఈ దేశాల్లో అసలు పేదరికమే ఉండదా? వీటి ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
జీరో టాక్స్.. ఫ్రీ బస్సులు.. ఈ 3 దేశాల్లో పేదవాళ్లే ఉండరా? అసలు సీక్రెట్ ఇదే

మన ప్రపంచంలో సంపద సృష్టి, మెరుగైన లైఫ్‌స్టైల్, ఆర్థిక భద్రత విషయంలో కొన్ని చిన్న దేశాలు సృష్టించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. సాధారణంగా పెద్ద దేశాల జీడీపీ గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ, అసలు పేదరికం అనేదే లేకుండా, అందరూ లగ్జరీగా బతికేసే దేశాలు కొన్ని ఉన్నాయని తెలుసా? అవే మోనాకో, లక్సెంబర్గ్, లీచ్టెన్‌స్టెయిన్.

ఈ బుల్లి దేశాలు తమ వైవిధ్యమైన ట్యాక్స్ పాలసీలు, హై సాలరీలు, సూపర్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్‌తో వరల్డ్ లీడర్స్‌గా నిలుస్తున్నాయి. అక్కడ జనాలు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు, అసలు అక్కడ నిరుపేదలు ఎందుకు ఉండరో ఇప్పుడు తెలుసుకుందాం.

25
మోనాకో: అసలు పన్నులే లేని బిలియనీర్ల అడ్డా

ఫ్రాన్స్ సమీపంలో సముద్ర తీరాన ఉండే చిన్న పారడైజ్ మోనాకో. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ పేదరికం శాతం సున్నా. ఈ దేశపు ప్రత్యేకతలు గమనిస్తే..

• ట్యాక్స్ హేవెన్: ఇక్కడ నివసించే పౌరులకు డైరెక్ట్ ఇన్‌కమ్ ట్యాక్స్ లేదా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అసలే ఉండవు. మనం కష్టపడి సంపాదించే ప్రతీ పైసా మన జేబులోనే ఉంటుంది.

• ప్రతీ ముగ్గురిలో ఒకరు మిలియనీరే: వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ చిన్న తీరప్రాంత దేశంలో ఉండే ప్రతీ ముగ్గురిలో ఒకరు కచ్చితంగా మిలియనీర్ లేదా బిలియనీరే అయి ఉంటారు.

• స్కై-హై రియల్ ఎస్టేట్: ఇక్కడ భూమి, ఇళ్ల ధరలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. సాధారణ లేదా తక్కువ ఆదాయం ఉన్నవారు నివసించడం మాట దేవుడెరుగు, కనీసం అద్దెకు ఉండే ఆలోచన కూడా చేయలేరు.

35
లక్సెంబర్గ్: ఉచిత ప్రజారవాణా.. అపరిమిత జీతాలు

యూరోప్‌లోని లక్సెంబర్గ్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి జీడీపీ ఉన్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది.

• పవర్‌ఫుల్ బ్యాంకింగ్ రంగం: ఇది గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, భారీ ఇన్వెస్ట్‌మెంట్లకు కేరాఫ్ అడ్రస్. అందుకే ఇక్కడి కంపెనీలు వర్కర్లకు ఆఫర్ చేసే జీతాలు చాలా భారీగా ఉంటాయి.

• 100% ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్: ప్రపంచంలోనే దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, ట్రామ్‌ల వంటి ప్రజారవాణాను ప్రజలందరికీ ఉచితంగా మార్చిన మొదటి దేశం ఇది.

• పక్కా సామాజిక భద్రత: ప్రజలకు కష్టాలు రాకుండా ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం ఆఫర్ చేస్తుంది. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భత్యాం ఇస్తూ అండగా నిలుస్తుంది.

45
లీచ్టెన్‌స్టెయిన్: రూపాయి అప్పు లేని బుల్లి దేశం ఇది

స్విట్జర్లాండ్, ఆస్ట్రియా సరిహద్దుల మధ్య ఉండే పర్వత దేశం లీచ్టెన్‌స్టెయిన్. విస్తీర్ణంలో చాలా చిన్నది అయినప్పటికీ తీవ్రమైన పేదరికం ఇక్కడ దాదాపు కనిపించదు.

• హై-టెక్ పరిశ్రమలు: విస్తీర్ణం చిన్నదే అయినా పళ్లు/వైద్య పరికరాల తయారీ, మెషినరీ మేకింగ్ లాంటి హైటెక్ ఇండస్ట్రీస్‌లో ఇది తిరుగులేని రేంజ్‌లో ఉంది.

• కార్పొరేట్ ఫ్రెండ్లీ ట్యాక్స్: ఇక్కడ పన్నుల శాతం తక్కువగా ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో విదేశీ మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను ఇక్కడే రిజిస్టర్ చేసుకుంటాయి.

• జీరో అప్పులు: విదేశీ అప్పులు దాదాపు సున్నాగా ఉన్న అరుదైన దేశం ఇది. తక్కువ జనాభా ఉండటం వల్ల పౌరులందరికీ వరల్డ్ క్లాస్ లైఫ్‌స్టైల్, ఆధునిక సదుపాయాలు చాలా సులువుగా అందుతాయి.

55
ఈ దేశాల్లో పేదరికం లేకపోవడానికి ప్రధాన కారణాలేంటి?

ఈ మూడు దేశాలు భౌగోళికంగా వేర్వేరు చోట్ల ఉన్నప్పటికీ, వీటి సక్సెస్ ఫార్ములా మాత్రం ఒకేలా ఉంటుంది.

• హై ప్రొడక్టివిటీ: కేవలం వ్యాపారాలు మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ సర్వీసెస్, మోడ్రన్ టెక్నాలజీ ద్వారా భారీ సంపదను క్రియేట్ చేయడం.

• స్కిల్డ్ పాపులేషన్: క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ స్కిల్స్, ట్రైనింగ్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రతీ ఒక్కరూ సులువుగా ఉపాధి పొందుతారు.

• స్ట్రాంగ్ గవర్నెన్స్: స్థిరమైన పరిపాలన, బిజినెస్ ఫ్రెండ్లీ రూల్స్, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం ప్రధాన కారణం.

• స్ట్రాంగ్ సోషల్ ప్రొటెక్షన్: ప్రజల ఆరోగ్యం, విద్య, కనీస అవసరాలను ప్రభుత్వమే బాధ్యతగా చూసుకోవడంతో జనాలు పేదరికంలోకి జారుకోరు.

మోనాకో, లక్సెంబర్గ్, లీచ్టెన్‌స్టెయిన్ ఆకారాకి చిన్నవే కావొచ్చు.. కానీ అవి సృష్టించిన సంపద, అందిస్తున్న లైఫ్‌స్టైల్, అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు గ్లోబల్ వైడ్‌గా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆదాయపు పన్ను తీసేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉచితం చేయడం, అత్యాధునిక ఇండస్ట్రీలను ప్రోత్సహించడం వంటి విధానాల ద్వారా ఇవి ప్రపంచ పటంలో ప్రత్యేకంగా మెరుస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories