ఈ ప్రయోగాన్ని ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్ సహకారంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేర్చనున్నారు. అక్కడి జపనీస్ పరిశోధనా కేంద్రం సాయంతో ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెడతారు. భూమి చుట్టూ తిరిగే ఈ ఉపగ్రహం ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి కంప్లీట్ గా ఒక రౌండ్ వేస్తుంది. ఈ క్రమంలో మద్యం తీవ్రమైన ఎండ వేడిని, వెంటనే గడ్డకట్టే అతి శీతల చలిని వెంటవెంటనే తట్టుకోవాల్సి వస్తుంది.
నిరంతరం మారే ఈ విపరీత ఉష్ణోగ్రతలు విస్కీ రసాయన చర్యలను వేగవంతం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా తక్కువ సమయంలోనే అద్భుతమైన, సరికొత్త ఘాటైన రుచి ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే కాలంలో అంతరిక్షంలో తయారయ్యే ప్రత్యేక మద్యాని మార్కెట్ లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
అంతరిక్షంలోనే మద్యం తయారి.. ?
ఐదు సంవత్సరాల పాటు ఈ ఉపగ్రహం అంతరిక్షంలోనే పరిభ్రమిస్తుంది. దీనిలోని ప్రత్యేక సెన్సార్లు మద్యం రంగు, చిక్కదనం, అణువులలో వచ్చే మార్పులను క్షణక్షణం రికార్డ్ చేస్తూ భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు పంపిస్తాయి. పరిశోధన ముగిసిన తర్వాత ఈ ఉపగ్రహాన్ని భూమికి తిరిగి తీసుకురారు. కేవలం అది పంపించే డిజిటల్ సమాచారాన్ని మాత్రమే శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు. అంతరిక్షంలో మద్యం నాణ్యత ఎలా మారుతుందో పూర్తి ఆధారాలు సేకరిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో అంతరిక్ష పరిస్థితులను ఉపయోగించి నేరుగా అంతరిక్షంలోనే విస్కీని తయారు చేసి భూమికి తెచ్చి విక్రయించే సరికొత్త వ్యాపార ఆలోచనలకు బలమైన పునాది పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం పరిశ్రమలో ఇది విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది.