Most Poisonous Plants: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 విష మొక్కలు ఇవే

Published : Sep 24, 2026, 07:08 AM IST

Poisonous Plants: ప్రకృతిలో కనిపించే ప్రతీ మొక్క, పువ్వు కంటికి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. కానీ, మన చుట్టూ ఉండే కొన్ని మొక్కలు చూడటానికి ఎంతో అందంగా ఉన్నప్పటికీ, వాటిలోని తీవ్రమైన విష పదార్థాలు క్షణాల్లో మనుషులు, జంతువుల ప్రాణాలను తీయగలవు.

PREV
16
చూడటానికి అందంగా ఉంటాయి కానీ ఈ మొక్కలు క్షణాల్లో ప్రాణాలు తీస్తాయి

ప్రకృతి అంటే అందమైన పూలు, పచ్చని చెట్లే కాదు. కొన్ని అత్యంత ప్రమాదకరమైన విషాలతో కూడిన మొక్కలు కూడా ఉన్నాయి. శత్రువుల నుండి, జంతువుల నుండి తమను తాము కాపాడుకోవడానికి ప్రకృతిలోని కొన్ని మొక్కలు బలమైన టాక్సిన్లను విడుదల చేస్తాయి. మానవ చరిత్రలో ఈ మొక్కలు వైద్యంలో, పురాణాల్లో, నేరాల్లో, మనుగడ కథల్లో కీలక పాత్ర పోషించాయి. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన టాప్ 10 మొక్కల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

26
మాంక్స్‌హుడ్.. సూసైడ్ ట్రీ

చరిత్రలో మాంక్స్‌హుడ్ అనే మొక్కను వేటగాళ్లు ప్రాణాంతకమైన విషంగా మార్చి బాణాల చివర రాసేవారు. అలాగే సిర్బెరా ఒడోల్లమ్ అనే చెట్టును 'సూసైడ్ ట్రీ' అని పిలుస్తారు. దక్షిణ ఆసియాలో నమోదైన అనేక పాయిజనింగ్ కేసులతో ఈ చెట్టుకు ప్రత్యక్ష సంబంధం ఉంది. విచిత్రం ఏమిటంటే, తీవ్రమైన ప్రమాదాలు ఉన్నప్పటికీ, పూర్వకాలంలో అనేక విషపూరిత మొక్కలను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించేవారు.

36
నరాలను స్తంభింపజేసే ఒలియాండర్, ఉమ్మెత్త

ఒలియాండర్ (గన్నేరు) మొక్క ప్రతీ భాగంలోనూ దాగిన విషం మనుషులకు ప్రాణాంతకం. అయితే దీనికి ఉండే చేదు రుచి వల్ల ఎక్కువమంది దీని బారిన పడకుండా ఉన్నారు. ఇక దతురా ప్రజాతికి చెందిన థార్న్‌ఆపిల్ లేదా ఉమ్మెత్త మొక్కలు మరింత ప్రమాదకరం. ఇవి మనిషి మెదడుపై ప్రభావం చూపి ఊహల్లో తేలియాడేలా చేయడం, పక్షవాతం రావడం, చివరికి మరణానికి దారితీయడం లాంటి తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి.

46
చర్మాన్ని కాల్చేసే మంచినీల్, అబ్రిన్ విషం

మంచినీల్ ఎంత విషపూరితమైనదంటే, దాని రసం లేదా ఆ చెట్టుపై పడి కిందకు కురిసే వర్షపు నీరు తాకినా సరే మనుషుల చర్మం దారుణంగా కాలిపోతుంది. అలాగే రోసరీ పీ విత్తనాల్లో అబ్రిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ప్రకృతిలోనే దొరికే అత్యంత ప్రమాదకరమైన సహజ విషాలలో ఒకటిగా సైంటిస్టులు చెబుతారు.

56
నవ్వుతూ చనిపోయేలా చేసే హెమ్‌లాక్, గుండెను ఆపే గులాబీలు

హెమ్‌లాక్ వాటర్-డ్రాప్‌వోర్ట్ అనే మొక్క తింటే శరీరంలో భయంకరమైన నరాల తిమ్మిర్లు వస్తాయి. బాధితుడి ముఖంలో వికృతమైన నవ్వు వస్తూ ప్రాణాలు పోతాయి, దీనినే 'సర్డోనిక్ గ్రిన్' అంటారు. అలాగే, లిల్లీ-ఆఫ్-ది-వ్యాలీ మొక్క చూడటానికి తీపి సువాసనతో ఎంతో ముచ్చటగా ఉంటుంది. కానీ దీని లోపల గుండె పనితీరును దెబ్బతీసే ప్రమాదకరమైన విషపదార్థాలు దాగి ఉంటాయి.

66
కొన్ని పండ్లతోనే మరణం.. పొగాకు విషం

డెడ్లీ నైట్‌షేడ్ మొక్క చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కేవలం కొన్ని పండ్లు తింటే చాలు, మనిషి తక్షణమే మరణిస్తాడు. ఇక మనకు బాగా తెలిసిన పొగాకు మొక్కలో నికోటిన్ అనే విషపూరిత కాంపౌండ్లు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ మరణాలకు ఈ పొగాకులోని విషమే ప్రధాన కారణమని సైంటిఫిక్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ప్రకృతిలోని ఈ అందమైన రాక్షస మొక్కల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories