వేప పుల్ల ఎంతో మంచిదైనప్పటికీ, ప్రస్తుత కాలంలో దీని వాడకంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. పూర్వకాలంలో జొన్న రొట్టెలు, అంబలి, సద్దన్నం వంటి పీచు పదార్థాలు ఎక్కువగా తినేవారు. కానీ నేటి కాలంలో పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు, కేకులు, కూల్ డ్రింక్స్ వాడకం ఎక్కువైంది. ఈ ఆధునిక ఆహార వ్యర్థాలు పళ్ల సందుల్లో సులభంగా ఇరుక్కుపోతాయి. వేప పుల్ల డిజైన్ (ఎర్గోనామిక్స్) ముందు పళ్లకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. లోపలి, వెనక పళ్లు, పళ్ల సందులను శుభ్రం చేయడం దీనితో కుదరదు.
వేప పుల్ల పీచులు గట్టిగా ఉండి తోముతున్నప్పుడు చిగుళ్లలోకి గుచ్చుకుంటే గాయాలై ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. అంతేకాదు గట్టిగా రుద్దడం వల్ల పళ్లకు నష్టం కలుగుతుంది. టూత్ బ్రష్‌లను బ్రిజిల్స్ సైజ్, సాఫ్ట్‌నెస్, గ్రిప్ వంటి అనేక పరిశోధనల ఆధారంగా తయారు చేస్తారు. వేప పుల్లకు అలాంటి పరిమాణం లేదా ప్రామాణికత (స్టాండర్డైజేషన్) ఉండదు.