Become Rich: ధనవంతులు కావాలనుకునే వారు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి

Published : Jan 08, 2026, 10:39 AM IST

Become Rich: ధనవంతులు కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. విలాసవంతమైన జీవితం గడపాలని ఆశిస్తారు. కానీ ధనవంతులు కావడం అంత సులుభం. ధనం సంపాదించాలంటే కొన్ని లక్షణాలు మీలో ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న పనిలో విజయం సాధించి ధనవంతులు అవుతారు. 

PREV
15
ధనవంతులు కావాలంటే ఏం చేయాలి?

ధనవంతులు కావాలన్నది అందరి కల. ఎవరికీ మధ్యతరగతి వారిగా లేదా పేదవారిగా జీవించాలని ఉండదు. మన సమాజంలోని ప్రజలను మూడు ఆర్థిక వర్గాలుగా విభజించారు. ధనవంతులు, మధ్యతరగతి, పేదవారు. పేద, మధ్యతరగతి వారి లక్ష్యం ఒక్కటే ఎప్పటికైనా తాము ధనవంతులు కావాలని. కానీ అది ఎలాగో వారికి తెలియదు. ఎంత కష్టపడినా తాము ఏదీ సాధించలేమని  అనుకుంటూ ఉంటారు. ఇప్పటి కోటీశ్వరుల్లో ఎంతో మంది ఒకప్పుడు పేదిరకంలో మగ్గిన వారే. కానీ వారి ఆలోచనలు, అలవాట్లు వారిని  ధనవంతులుగా ఎదిగేలా చేశాయి. కోటీశ్వరులకు కొన్ని ప్రత్యేక అలవాట్లు ఉంటాయి. అలాగే వారి ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. మీరు కూడా ధనవంతులు కావాలనుకుంటే ఆ అలవాట్లను, ఆలోచనలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. 

25
డబ్బుకు విలువివ్వండి

డబ్బు సంపాదించేదే ఖర్చు చేయడానికి కదా అనుకుంటారు చాలా మంది. నెల జీతం పడగానే ఖర్చు చేయడం మొదలుపెడతారు. ఇలా చేస్తే మీరు డబ్బుకు విలువ ఇవ్వనట్టే. ఆ డబ్బు మీ దగ్గర ఉండేందుకు ఎందుకు ఇష్టపడుతుంది. కాబట్టి చేతికి డబ్బు రాగానే ఖర్చు చేయొద్దు. మీకొచ్చిన జీతాన్ని అవసరాలు, పెట్టుబడులు, వినోదం, అత్యవసర నిధిగా ఇలా విభజించుకుని ఉపయోగించండి. వినోదంపై ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.  6 నెలల జీతానికి సమానమైన డబ్బును మీరు ఎల్లప్పుడు పొదుపు ఖాతాలో ఉంచుకోవాలి. లేకుంటే హఠాత్తుగా వచ్చే సమస్యలకు డబ్బు అవసరం పడితే ఇతరులను అడగాల్సి వస్తుంది.

35
పుస్తకాలు చదవండి

పుస్తకాలు చదివే అలవాటు ఉందా? లేకుంటే ఇప్పుడే అలవాటు చేసుకోండి.  పుస్తకాలు మనిషికి మంచి స్నేహితులు. ఎంత చదివితే జ్ఞానం పెరుగుతుంది. ధనవంతులు కావడానికి ఆర్థిక సంబంధమైన అంశాలపై రాసిన పుస్తకాలను చదవాలి. అలాగే జీవితంలో ఆనందంగా గడిపేందుకు జీవితానికి సంబంధించిన పుస్తకాలు చదవండి. రోజూ నిద్రపోయే ముందు ఒక పేజీ చదవండి.  అలాగే  ఆ రోజు మీరు తెలుసుకున్న కొత్త విషయాలు, ఆలోచనలు డైరీలో రాయండి.

45
నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి

మీరు ఒకే పని చేస్తూ ధనవంతులు కాలేరు. ఎప్పుడూ కొత్త పని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కువ ఆదాయ మార్గాలు క్రియేట్ చేసుకోవాలి. ఉద్యోగంతో పాటూ సైడ్ బిజినెస్ చేయాలి. ఫ్రీలాన్సింగ్ పనులు చేయాలి. మీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. ఖాళీగా కూర్చోవడానికి సమయాన్ని కేటాయించకండి. ఆ సమయంలో చిన్న చిన్న బిజినెస్ లు ఏం చేయవచ్చో తెలుసుకునేందుకు టైమ్ ను కేటాయించండాి. 

55
డబ్బుతో డబ్బు సంపాదించండి

డబ్బు సంపాదించాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి వాటిపైన సమయం కేటాయించండి. రోజూ ఉదయం 5 గంటలకు లేచి వ్యాయామం, వాకింగ్, యోగా, ధ్యానం చేయండి. ఇది మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించి, ఉత్పాదకతను, సృజనాత్మకతను పెంచుతుంది. మీరు చేసే పనిలో ఏకాగ్రత్త ఓపిక పెరుగుతుంది.

మీ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతోనే డబ్బు సంపాదించడానికి ప్రయత్నించండి.  ధనవంతులు డబ్బు సంపాదించడానికి డబ్బునే తిరిగి వాడతారు.  చాలా స్మార్ట్ గా పెట్టుబడులను పెట్టండి. డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో ఉంచడం వల్ల ఉపయోగం లేదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతారు. అవి మీకు డబ్బును రెట్టింపు చేసి ఇస్తాయి. అలాగే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏదేమైనా డబ్బు సంపాదించాలంటే ఆర్ధిక క్రమశిక్షణ, స్మార్ట్ పెట్టుబడులు చాలా అవససరం.

Read more Photos on
click me!

Recommended Stories