Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?

Published : Aug 28, 2026, 11:10 AM IST

Youtube: ప్రపంచంలోని అన్ని దేశాల్లో యూట్యూబ్ వస్తుంది. కానీ నాలుగు దేశాల్లో మాత్రం యూట్యూబ్ రాదు. ఆ దేశాలు యూట్యూబ్ ను పూర్తిగా నిషేధించాయి. దానికి కారణాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

PREV
13
యూట్యూబ్ పై నిషేధం

ఇప్పుడు యూట్యూబ్ నిత్యజీవితంలో భాగమైపోయింది. పాటలు, సినిమాలు, వార్తలు, వంటకాలు.. ఇలా ఏ సమాచారం కావాలన్నా కోట్ల మంది ప్రజలు యూట్యూబ్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే మనకు అందుబాటులో ఉన్న యూట్యూబ్ కొన్నిదేశాల్లో మాత్రం కనిపించదు. ఆ దేశాలు యూట్యూబ్ పై పూర్తిగా నిషేధించాయి. అలా ఎందుకు నిషేధించాయో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని దేశాల్లోని ప్రభుత్వం అమలు చేసే కఠినమైన సెన్సార్‌షిప్, సమాచార నియంత్రణ, భద్రతా కారణాలు, రాజకీయ ఆంక్షల వల్ల కొన్ని దేశాల ప్రజలకు యూట్యూబ్ చూసే అవకాశం లేదు. శాశ్వతంగా తమ దేశంలో యూట్యూబ్‌ను బ్యాన్ చేసిన ప్రధాన దేశాలు నాలుగు ఉన్నాయి. అవి చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, తుర్క్‌మెనిస్తాన్.

23
ఈ దేశాల్లో నో యూట్యూబ్

మన పొరుగు దేశమైన చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇంటర్నెట్ నియంత్రణ వ్యవస్థ అమల్లో ఉంది. అక్కడి ప్రభుత్వం 2009 నుంచే మెయిన్‌ల్యాండ్ చైనాలో యూట్యూబ్‌పై పూర్తి నిషేధం కొనసాగుతోంది. అయితే హాంకాంగ్, మకావు వంటి ప్రత్యేక పరిపాలనా ప్రాంతాల్లో మాత్రం యూట్యూబ్ పనిచేస్తుంది. అలాగే యుద్ధంతో దద్దరిల్లిపోతున్న ఇరాన్‌లో కూడా ప్రభుత్వం యూట్యూబ్ ను నిషేధించింది. ఇక్కడున్న ప్రత్యేక ఇంటర్నెట్ ఫిల్టరింగ్ వ్యవస్థ కారణంగా ఇరాన్‌లో యూట్యూబ్ యాక్సెస్ ఉండదు. తమ దేశ విధానాలకు అనుగుణంగా లేని కంటెంట్ ప్రజలకు చేరకుండా ఉండేందుకే అక్కడి అధికారులు యూట్యూబ్‌తో పాటు పలు అంతర్జాతీయ సోషల్ మీడియాలపై ఆంక్షలను అమలు చేస్తున్నారు.

33
ఉత్తర కొరియాలో

ఉత్తర కొరియా ఒక నియంత పాలనతో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ పరిస్థితి మరింత విభిన్నంగా, కఠినంగా ఉంటుంది. ఆ దేశంలో సాధారణ పౌరులకు గ్లోబల్ ఇంటర్నెట్ సదుపాయమే ఉండదు. సమాచార ప్రసార వ్యవస్థ అంతా అక్కడి నియంత పాలనలోనే సాగుతుంది. విదేశీ సమాచారం గానీ, సంస్కృతి గానీ దేశంలోకి రాకుండా నిరోధించడమే ఉత్తర కొరియా లక్ష్యం. యూట్యూబ్‌తో సహా అన్ని ప్రపంచ స్థాయి వెబ్‌సైట్లను పూర్తిగా బ్లాక్ చేసింది. అదేవిధంగా మధ్య ఆసియా దేశమైన తుర్క్‌మెనిస్తాన్‌లో కూడా యూట్యూబ్ రాదు. ఇక్కడ కూడా అత్యంత కఠినమైన ఇంటర్నెట్ చట్టాలు అమలవుతున్నాయి. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రధాన వేదికలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

Read more Photos on
click me!

Recommended Stories