ప్రపంచంలోనే అత్యధిక పోలీసులు పనిచేస్తున్న రాష్ట్రం మనదేశంలోనే ఉంది, ఆ రాష్ట్రమేది?

Published : Oct 28, 2026, 10:24 AM IST

మనదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అత్యధిక పోలీసులు పనిచేస్తున్న రాష్టం ఏదో తెలుసా? అక్కడ ఎన్ని లక్షల మంది పోలీసులు పనిచేస్తున్నారు? అక్కడ క్రైమ్ రేటు ఎంత ఉంది? ఈ అంశాలన్నీ తెలుసుకోండి.

PREV
13
ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పోలీసులు?

భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. అలాగే దేశంలోనే అతిపెద్ద పోలీస్ విభాగం కూడ ఉత్తరప్రదేశ్లోనే సేవలందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ పోలీస్ దళంగా గుర్తింపు పొందింది ఈ విభాగం. ఇక్కడ ఉన్న పోలీసులు రాష్ట్రంలోని 24 కోట్లకు పైగా ఉన్న ప్రజల భద్రతను చూస్తోంది. దాదాపు 3.10 లక్షల నుంచి 3.73 లక్షల మంది సిబ్బందితో ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ఇందులో 3.10 లక్షల మంది నాన్-గెజిటెడ్ అధికారులు, కానిస్టేబుళ్లు ఉన్నారు. ఐపీఎస్, పీపీఎస్ స్థాయి ఉన్నతాధికారులు వెయ్యికి పైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 జిల్లాలు, కమిషనరేట్లతో పాటు ప్రత్యేక విభాగాలు శాంతిభద్రతలను కాపాడటంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి.

23
క్రైమ్ రేట్ ఎలా ఉంది?

జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో దాదాపు 9.5 శాతం కేసులు ఉత్తరప్రదేశ్‌లోనే వెలుగు చూస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య పరంగా ఇది మొదటి స్థానం కాకపోవచ్చు. భారీ జనాభా ఉండటం వల్లే కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. క్రైమ్ రేటు పరంగా రాష్ట్రం చాలా మెరుగైన స్థితిలో ఉంది. జనాభా నిష్పత్తి ఆధారంగా లెక్కించే క్రైమ్ రేటును పరిశీలిస్తే, జాతీయ సగటు ప్రతి లక్ష మందికి 448.3 కేసులుగా ఉంది. అయితే యూపీలో ఈ రేటు కేవలం 335.5 మాత్రమే నమోదైంది. అంటే జాతీయ సగటు కంటే ఇక్కడ నేరాల రేటు దాదాపు 25 శాతం తక్కువగా ఉండటం విశేషం.

33
యూపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

వివిధ నేరాల విభాగాలను పరిశీలిస్తే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఉత్తరప్రదేశ్ 11 నుంచి 18 స్థానాల్లో నిలుస్తోంది. కేరళలో క్రైమ్ రేటు 1631.2, దేశ రాజధాని ఢిల్లీలో 1602 గా ఉండగా, వీటితో పోలిస్తే యూపీ పరిస్థితి చాలా మెరుగ్గా కనిపిస్తోంది. వీటికితోడు మహిళలపై జరిగే నేరాల్లో నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో ఈ రాష్ట్రం ముందంజలో నిలిచింది. దేశవ్యాప్తంగా మహిళా నేరాల్లో సగటు శిక్షల రేటు 26.6 శాతం మాత్రమే ఉంటే, ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 59.8 శాతం నిందితులకు శిక్షలు పడుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories