Flight Baggage rules : విమానం మ్యాగ్జిమమ్ టేకాఫ్ వెయిట్ అంటే ఏమిటి? లగేజీ రూల్స్ వెనక ఇంత సైన్స్ దాగుందా!

Published : Nov 02, 2026, 04:33 PM IST

ఎయిర్‌పోర్ట్‌లో మన లగేజ్ బరువుకు ఒక లిమిట్ ఉంటుంది… ఎక్కువుంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇదంతా ఎయిర్‌లైన్స్ డబ్బులు సంపాదించుకోవడానికే అని చాలామంది అనుకుంటారు. కానీ దీని వెనుక పెద్ద సైన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

PREV
15
విమానం గాల్లో ఎలా ఎగురుతుంది?

విమానం గాల్లో ఎగరడం అనేది కేవలం దాని ఇంజిన్ పవర్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. దీని వెనుక నాలుగు శక్తులు పనిచేస్తాయి… అవే పైకి లేపే శక్తి (లిఫ్ట్), ముందుకు నెట్టే శక్తి (థ్రస్ట్), గాలి నిరోధకత (డ్రాగ్), కిందకు లాగే బరువు (వెయిట్). విమానం రెక్కలు గాలిని చీల్చుకుంటూ వెళ్తున్నప్పుడు పైకి లేపే శక్తి పుడుతుంది… ఈ శక్తి విమానం బరువును తట్టుకునేలా ఉండాలి.

విమానం బరువు పెరిగితే, దాన్ని పైకి లేపడానికి మరింత శక్తి అవసరం అవుతుంది. దీనివల్ల రన్‌వే మీద విమానం ఎక్కువ దూరం పరుగెత్తాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్న రన్‌వేలు, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు బరువు పెరిగితే విమానం టేకాఫ్ అవ్వడం కష్టమవుతుంది. అందుకే ఫ్లైట్‌లో ఎక్కించే ప్రతి వస్తువు బరువును లెక్కలోకి తీసుకుంటారు.

25
మ్యాగ్జిమమ్ టేకాఫ్ వెయిట్ (MTOW) అంటే ఏంటి?

ప్రతి విమానానికి ఎంత బరువు మోయగలదో తయారీదారులు ఒక లిమిట్ పెడతారు. ఏవియేషన్ భాషలో దీన్ని 'మ్యాగ్జిమమ్ టేకాఫ్ వెయిట్' (MTOW) అంటారు. విమానం బరువు, ప్రయాణికులు, సిబ్బంది, ఇంధనం, కార్గో, లగేజ్.. ఇవన్నీ కలిపి ఈ బరువును లెక్కిస్తారు. ఈ లిమిట్ దాటితే విమానాన్ని టేకాఫ్ చేయనివ్వరు. అందుకే ఎయిర్‌లైన్స్ ప్రతి ప్రయాణానికి ముందు ప్రయాణికుల సంఖ్య, ఇంధనం, లగేజ్ బరువును పక్కాగా ప్లాన్ చేస్తాయి. లిమిట్ దాటితే కొన్ని వస్తువులను ఫ్లైట్ ఎక్కించరు.

విమానం పెద్దగా ఉంది కదా, రెండు మూడు కిలోలు ఎక్కువైతే ఏమవుతుందిలే అని మనం అనుకుంటాం. కానీ వేల కిలోల బరువున్న విమానంలో, అందరు ప్రయాణికుల అదనపు బరువు కలిస్తే అది పెద్ద సమస్యగా మారుతుంది.

35
బరువు పెరిగితే ఏమవుతుంది?

విమానం బరువు పెరిగినప్పుడు, దాన్ని గాల్లోకి లేపడానికి, అలాగే ఎగరడానికి ఎక్కువ శక్తి కావాలి. దీనివల్ల ఇంజిన్లపై భారం పడుతుంది. ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఎక్కువ వేగం, పైకి లేపే శక్తి అవసరం కాబట్టి బరువు అనేది ఇక్కడ చాలా కీలకం. బరువు పెరిగితే ఇంధనం (ఫ్యూయల్) కూడా ఎక్కువ ఖర్చవుతుంది. దీనివల్ల ఒక నిర్దిష్ట ఇంధనంతో విమానం ప్రయాణించే దూరం తగ్గిపోతుంది. లాంగ్ జర్నీల్లో ఈ లెక్కలు చాలా ముఖ్యం.

ప్రయాణానికి సరిపడా ఇంధనం, వాతావరణ మార్పులు, అత్యవసర పరిస్థితుల్లో వేరే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిన అవసరం.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎయిర్‌లైన్స్ ఇంధనాన్ని నింపుతాయి. అందుకే లగేజ్ బరువు అనేది కేవలం స్థలానికి సంబంధించిన విషయం కాదు, విమానం మొత్తం బరువు, ప్రయాణ ప్రణాళికతో ముడిపడి ఉంటుంది.

45
విమానంలో లగేజ్ ఎక్కడ పెడుతున్నారనేది కూడా ముఖ్యమే

విమాన భద్రతలో మొత్తం బరువు ఎంత ఉందనే దానితో పాటు, ఆ బరువును ఎక్కడ పెడుతున్నారనేది కూడా చాలా ముఖ్యం. దీన్నే 'వెయిట్ అండ్ బ్యాలెన్స్' అంటారు. ప్రతి విమానానికి ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. విమానం ముందు భాగం, వెనుక భాగం, రెక్కల దగ్గర బరువును ఎలా సర్దుబాటు చేశారనే దాన్ని బట్టి దాని కదలికలు ఉంటాయి. ఉదాహరణకు విమానం వెనుక భాగంలో బరువు ఎక్కువైతే బ్యాలెన్స్ తప్పుతుంది. అలాగే ముందు భాగంలో బరువు ఎక్కువైనా విమానాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అందుకే ప్రయాణికుల లగేజ్, కార్గోను ఒక పద్ధతి ప్రకారం సర్దుతారు. గ్రౌండ్ స్టాఫ్ ఈ వెయిట్ అండ్ బ్యాలెన్స్ లెక్కల ప్రకారమే వస్తువులను లోడ్ చేస్తారు. ఇది విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ తప్పకుండా చూసుకుంటుంది.

55
ప్రయాణికులు లగేజ్ లిమిట్‌ను ఎందుకు పాటించాలి?

విమానంలో లగేజ్ బరువుపై ఆంక్షలు పెట్టడం అనేది కేవలం ఫైన్లు వేయడానికి కాదు. విమానం డిజైన్, టేకాఫ్ సామర్థ్యం, ఇంధన వినియోగం, బరువు బ్యాలెన్స్, భద్రతా ప్రమాణాలతో దీనికి సంబంధం ఉంది. అలాగని ఒక ప్రయాణికుడు కిలో బరువు ఎక్కువ తెస్తే విమానం వెంటనే ప్రమాదంలో పడుతుందని కాదు. పైలట్లు, ఎయిర్‌లైన్స్ ప్రతి ప్రయాణానికి ముందు ఎన్నో భద్రతా లెక్కలు వేస్తారు. విమానం బరువు లిమిట్‌లో ఉందా, రన్‌వే పొడవు సరిపోతుందా, వాతావరణం ఎలా ఉంది, ఇంధనం సరిపోతుందా అని చెక్ చేస్తారు. కాబట్టి, ప్రయాణికులు ముందుగానే క్యాబిన్, చెక్-ఇన్ లగేజ్ లిమిట్స్ తెలుసుకుని ప్యాక్ చేసుకోవడం మంచిది. అనవసరమైన వస్తువులను వదిలేసి, ఇంట్లోనే బరువు చెక్ చేసుకుంటే ఎయిర్‌పోర్ట్‌లో ఫైన్లు కట్టే బాధ, టెన్షన్ తప్పుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories