ఒకప్పుడు భారత్‌లో హాలోవీన్ వేడుకల గురించి తెలిసేది కాదు. ముఖ్యంగా విదేశీ సంస్కృతికి సంబంధించిన పండుగగా మాత్రమే చూసేవారు. అయితే హాలీవుడ్ సినిమాలు, టెలివిజన్ షోలు, సోషల్ మీడియా పుణ్యమా అని ఇండియన్స్ కు ఆసక్తి పెరిగింది.
ఫ్రెండ్స్, బ్రూక్లిన్ నైన్-నైన్ వంటి విదేశీ టీవీ షోల్లో హాలోవీన్ వేడుకలు, వింత వేషధారణలు కనిపించేవి. వాటిని చూసిన యువత కూడా అలాంటి వేడుకల్లో పాల్గొనాలని ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. హాలీవుడు సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రభావంతో భారత్ కు విస్తరించింది.
ముఖ్యంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో హాలోవీన్ వేడుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెస్టారెంట్లు, కేఫ్‌లు ప్రత్యేక అలంకరణలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల హాలోవీన్ థీమ్‌తో ప్రత్యేక ఫుడ్ ఐటమ్స్, డెజర్ట్‌లు అందిస్తున్నారు. ఆఫీసులు, స్కూళ్లలో కాస్ట్యూమ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు.