Motivational story: పక్కవారి సలహాలు తీసుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరేం చెప్పినా వింటాం. అయితే ఇలా తొందరపడి పక్కవారి మాటలు వినడం ఎంతమాత్రం మంచిది కాదని చెప్పే ఒక మంచి కథ ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పెద్ద అడవిలో ఓ నక్క ఉండేది. అది చాలా తెలివిగా కనిపించినా, అంతర్గతంగా మాత్రం చాలా స్వార్థపరంగా ఉండేది. అడవిలోని ఇతర జంతువులకు సలహాలు ఇస్తూ తిరిగేది. అయితే అది ఇచ్చే సలహాలు ఎక్కువసార్లు సరైనవి కావు. కానీ ఆ విషయం తెలియని కొన్ని జంతువులు దాని మాటలు నమ్మి ఇబ్బందులు పడేవి. నక్కకు మాత్రం ఇతరులు కష్టపడితే పెద్దగా పట్టించుకునే స్వభావం ఉండేది కాదు. పైగా కష్టాల్లో ఉన్న వారిని చూసి సంతోషించేంది.
25
ఆకలితో అలమటించే కోతి
ఒక రోజు అడవిలో ఆకలితో అలమటిస్తూ ఓ కోతి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చింది. చాలా సేపు తిరిగిన తర్వాత ఒక చెట్టు మీద రెండు పండిన మామిడిపండ్లు కనిపించాయి. అవి చూసిన వెంటనే కోతి చాలా ఆనందించింది. "ఇవే నా ఆకలిని తీర్చేస్తాయి" అని అనుకుంది. వెంటనే చెట్టు ఎక్కి పండ్లు తీసుకోవాలని నిర్ణయించింది. అప్పుడే అక్కడే కూర్చున్న నక్క కోతిని గమనించింది.
35
ఉచిత సలహా ఇచ్చిన నక్క
కోతి చెట్టు ఎక్కబోతుండగా నక్క మాట్లాడుతూ.. “ఎందుకు అంత కష్టపడతావు? అక్కడ ఉన్న కర్ర తీసుకుని పండ్లను కొడితే అవే కింద పడిపోతాయి. నీకు శ్రమ కూడా తగ్గుతుంది” అని చెప్పింది. నక్క చెప్పిన మాటలు కోతికి సరైనవిగా అనిపించాయి. వెంటనే చెట్టు ఎక్కకుండా పక్కనే ఉన్న కర్ర తీసుకుంది. ఆ కర్రతో మామిడిపండ్లను కొట్టింది. దీంతో పండ్లు నేలపై పడి ఒక్కసారిగా జారుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న మురికి కాలువలో పడి
ఆశతో తిందామనుకున్న పండ్లు మురికి కాలువలో పడడంతో కోతి ఒక్కసారిగా నిరాశకు గురవుతుంది. ఆహారం చేతికి అందకుండా పోయిందని బాధపడింది. నక్క మాత్రం తన పని అయిపోయిందని అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. అది చూసిన దగ్గర్లోని చెట్టుపై ఉన్న ఒక చిలుక కోతితో మాట్లాడుతూ.. “నీకు చెట్టు ఎక్కడం బాగా వచ్చు. అయినా నువ్వు నీకు తెలిసిన పనిని వదిలి నక్క చెప్పిన మాట విన్నావు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది” అని అంది.
55
గొప్ప నీతి
చిలుక మాటలు విన్న కోతి తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట ఎవరి మాటలు విన్నా ముందుగా ఆలోచిస్తాను. నాకు తెలిసిన పని మీద నమ్మకం ఉంచుతాను” అని చెప్పింది. ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే.. ప్రతి ఒక్కరూ ఇచ్చే సలహా మనకు ఉపయోగపడుతుందని అనుకోవద్దు. కొన్నిసార్లు ఇతరుల మాటలు మనల్ని తప్పుదారిలోకి తీసుకెళ్లవచ్చు. కాబట్టి ఇతరుల సూచనలు వినడం మంచిదే అయినా, మనకంటూ ఒక ఆలోచన ఉండాలి. మనకు తెలిసిన విషయాలపై నమ్మకం ఉంచితేనే మన పని సరిగా పూర్తవుతుంది.