Monday blues : ఏమిటీ మండే బ్లూస్..? సోమవారం ఇంత ప్రమాదకరమా..?

Published : Apr 03, 2026, 10:37 AM IST

Monday blues : అసలు ఏమిటీ మండే బ్లూస్..? ఇది ఉద్యోగుల మానసిక పరిస్థితిని ఇంతలా దెబ్బతీస్తుందా..? దీన్నుండి బయటపడాలంటే ఉద్యోగులు ఏం చేయాలి…? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
15
సోమవారం ఎంతపని చేస్తోంది..?

Monday blues : వీకెండ్ వచ్చిందంటే చాలు ఉద్యోగుల ఆనందానికి అవధులుండవు... ఎలా ఎంజాయ్ చేయాలో ముందుగానే ప్లాన్స్ రెడీ చేసుకుంటారు. ఇక లాంగ్ వీకెండ్ వచ్చిందో వారిని ఇక పట్టలేం... పని ఒత్తిడి, పర్సనల్ లైఫ్ కష్టాలను మరిచి హాయిగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇలా శుక్ర, శని, ఆదివారం ఉద్యోగులు అత్యంత ఆనందంగా ఉండే రోజులు. మరి ఉద్యోగులు వారంతో అస్సలు ఇష్టపడని రోజేదో తెలుసా..?

25
'మండే బ్లూస్' అంటే ఏమిటి..?

వీకెండ్ లో స్నేహితులు, కుటుంబసభ్యులతో హాయిగా గడిపిన తర్వాత సోమవారం తిరిగి ఆఫీసుకు వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగులు సోమవారంను చాలా భారంగా భావిస్తుంటారు. చాలామంది ఆరోజు నీరసంగా ఉంటారు.. ఏళ్ళుగా చేసే పనినే ఒత్తిడిగా భావిస్తుంటారు. ఆదివారం రాత్రి నుండే ఒత్తిడి ప్రారంభం అవుతుంది... సోమవారానికి మరింత పెరుగుతుంది. దీన్నే 'మండే బ్లూస్' అంటారు.

కొందరిలో ఈ 'మండే బ్లూస్' తారాస్థాయికి చేరి తీవ్ర డిప్రెషన్ కు గురవుతుంటారు.. సోమవారం వచ్చిందంటే చాలు భయపడిపోతుంటారు. ఇది ముదిరి కొందరు వారమంతా భయంభయంగానే గడుపుతుంటారు. కాలక్రమేణ ఇది తీవ్రమైన ఆందోళన, కుంగుబాటుకు కారణమవుతుంది... మానసిక ఒత్తిడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇలా మండే బ్లూస్ తో బాధపడేవారికి మానసిక చికిత్స అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

35
సోమవారం ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చు..?

వీకెండ్ ఎంజాయ్ కు ముగింపుపలికే సోమవారంను కూడా ఎంజాయ్ చేయాలంటే ఉద్యోగుల ఆలోచనా విధానం మారాలి. ''అయ్యో... సోమవారం వచ్చేసిందే... తిరిగి ఆఫీసుకు వెళ్లాలే..'' అని ఫీల్ అయితే తప్పకుండా ఆరోజంతా భారంగానే ఉంటుంది. ఇలా కాకుండా ''రెండ్రోజులు బాగా రిఫ్రెష్ అయ్యాం... ఇక సోమవారం ప్రెష్ గా ప్రారంభిద్దాం.. మరింత ఉత్సాహంగా పనిచేద్దాం'' అనే మైండ్ సెట్ తో వారం ప్రారంభిస్తే ''మండే బ్లూస్'' అనేది ఉండదు.

ఆదివారం లేట్ నైట్ వరకు పడుకోకుండా పార్టీలు లేదంటే ఫోన్ చూస్తూ ఉంటే సోమవారం ఉదయం భారంగా ఉంటుంది. అలాకాకుండా రాత్రంతా బాగా నిద్రపోయి సోమవారం ఉదయమే లేచి ఆరోజు చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవాలి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఇలా సోమవారంను పాజిటివ్ గా ప్రారంభించే... హ్యాపీగా ఎండ్ చేస్తే ఆ వారమంతా జోష్ ఉంటుంది... వీకెండ్ వరకు హ్యాపీగా ఉండవచ్చు.

45
వారంలో హ్యాపియెస్ట్ డేస్ ఏవి..?

సాధారణంగా స్కూల్ విద్యార్థులు, ఉద్యోగులు బాగా ఇష్టపడేది వీకెండ్స్ నే.. శని, ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి హాయిగా గడుపుతారు. అందుకే వారంలో అత్యంత ఆనందంగా ఉండే రోజులు ఇవే. వారమంతా వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు... మిగతా ఐదురోజులు ఎంత భారంగా గడిచినా శని, ఆదివారం మాత్రం హ్యాపీగా ఉంటారు. అందుకే వారంలో హ్యాపియెస్ట్ డేస్ గా శని, ఆదివారాలను పేర్కొంటారు.

55
హ్యాపియెస్ట్ నెల ఏది..?

ఏడాదిలో హ్యాపియెస్ట్ నెల మే. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎక్కువ పగటి సమయం ఉండటంతో ప్రజలు ఈ నెలలో సంతోషంగా ఉల్లాసంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా మానసిక ఉల్లాసం కలుగుతుందట.

ఇక జనవరిని ఏడాదిలో అత్యంత నిరుత్సాహకరమైన రోజుగా పేర్కొంటారు. పాత సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టామన్న ఆనందం కంటే... గత సంవత్సరం ఏం సాధించలేకపోయామనే బాధ ఎక్కువగా ఉంటుందట. అందుకే ఈ నెలలో ఎక్కువమంది నిరుత్సాహంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories