Snakes : బాత్రూమ్, టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకుండా ఎలా ఆపాలి?

Published : Sep 21, 2026, 07:45 PM IST

బాత్రూమ్ లేదా టాయిలెట్లలోకి పాములు ఎక్కువగా వస్తుంటాయి.. దీనికి కారణమేంటి? పాములు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ పాము కనిపిస్తే ఏం చేయాలి? అనేది ఇక్కడ తెలుసుకొండి.

PREV
14
ఇంట్లో పాము కనిపిస్తే ఏం చేయాలి?

Snakes : కొన్నిసార్లు పాములు మన ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి... ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువగా బాత్రూమ్ లేదా టాయిలెట్లలో నీళ్లు పోవడానికి ఉండే కన్నాల ద్వారా ఇవి లోపలికి వస్తాయి. వెస్ట్రన్ కమోడ్ల నుంచి కూడా పాములు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. అసలు టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి? అవి కనిపిస్తే మనం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

24
బాత్రూమ్, టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి?

టాయిలెట్‌లో పామును చూడగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఇంట్లోకి పాము ఎలా వచ్చిందనే అనుమానంతో పాటు భయం కూడా మొదలవుతుంది. వాతావరణంలో వేడి పెరిగినప్పుడు లేదా వర్షాలు పడుతున్నప్పుడు పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? విషపూరితమైన పాముల నుంచి మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బాత్రూమ్ లేదా టాయిలెట్ మురికిగా ఉండటం వల్లే పాములు వస్తాయనుకోవడం పొరపాటు. ఇల్లు, బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉంచుకున్నా పాములు వచ్చాయని చాలామంది చెబుతుంటారు. ఇంటికి ఉండే అండర్ గ్రౌండ్ పైపుల్లో ఎప్పుడూ తేమ ఉంటుంది. అక్కడ బొద్దింకలు, ఎలుకలు, ఇతర చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. వాటిని తినేందుకు పాములు ఆ పైపుల్లోకి దూరుతాయి.

కొన్నిసార్లు ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి పాములు చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశాలను వెతుక్కుంటాయి. అలా మెయిన్ డ్రైనేజీకి కలిపి ఉండే అండర్ గ్రౌండ్ పైపుల్లోకి అవి ప్రవేశిస్తాయి. ఆ పైపుల గుండా ప్రయాణించి నేరుగా మీ బాత్రూమ్ లేదా టాయిలెట్లలోకి వచ్చేస్తాయి.

34
ఇంట్లోకి పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

జాలీలు వాడటం : పాములు రాకుండా ఉండాలంటే, మెయిన్ డ్రైనేజీకి కలిసే మీ అండర్ గ్రౌండ్ పైపులకు గట్టి జాలీలను ఏర్పాటు చేయాలి. అలాగే బాత్రూమ్, టాయిలెట్లలో నీళ్లు బయటకు వెళ్లే దారుల దగ్గర కూడా జాలీలను ఫిక్స్ చేసుకోవాలి.

ఇంటి చుట్టుపక్కల వాతావరణం : మీ ఇంటి చుట్టూ పొదలు లేదా పనికిరాని వస్తువులు ఉంటే వెంటనే వాటిని శుభ్రం చేయండి. ఇలాంటి చోట్లే పాములు ఎక్కువగా దాక్కుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పెరిగే పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.

పైపులను మూసివేయడం : బాత్రూమ్, టాయిలెట్లలో ఏవైనా పైపులు ఓపెన్ చేసి ఉంటే వాటిని సరిగ్గా మూసివేయండి. సిమెంట్ లేదా సిలికాన్ సీలెంట్ వాడి ఆ ఖాళీలను పూడ్చేయండి.

ఎలుకల నివారణ : ఎలుకలు, బల్లులు ఉన్నచోటికి పాములు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇంట్లో ఎలుకల బెడద లేకుండా చూసుకోవాలి.

44
బాత్రూంలో పాము కనిపిస్తే ఏం చేయాలి?

మీ బాత్రూమ్ లేదా టాయిలెట్‌లోకి పాము వస్తే అస్సలు భయపడకండి. వెంటనే బయటకు వచ్చి తలుపు వేసేయండి. ఆ తర్వాత తలుపు కింద ఉండే ఖాళీ స్థలాన్ని ఏదైనా బట్ట లేదా టవల్‌తో మూసేయండి. వెంటనే స్నేక్ క్యాచర్లకు (పాములు పట్టేవారికి) ఫోన్ చేయండి. మీరే సొంతంగా పామును చంపడానికి లేదా తరిమేయడానికి ప్రయత్నించకండి. అది మీ ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories