Snakes : ఓ పాము ఇంకో పామును కరిస్తే ఏమవుతుంది?

Published : Jul 15, 2026, 03:47 PM IST

విషపూరితమైన పాము మనిషిని కరిస్తే ప్రాణాలకే ముప్పు. మరి ఒక పామును మరో పాము కాటేస్తే ఏమవుతుంది? ఆ పాము చనిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
ఓ పాము మరో పామును కాటేస్తే ఏమవుతుంది?

మన చుట్టూ కనిపించే పాముల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. అయితే విషపూరితమైన పాము మనిషిని కాటేస్తే, వెంటనే చికిత్స అందించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. పాములు ఇతర జంతువులను కాటేసినా ప్రాణాలకు ముప్పు ఉంటుంది… మరి ఒక విషపూరిత పాము మరో పామును కాటేస్తే ఏమవుతుందో తెలుసా?

24
ఒకే జాతి పాములు ఒకదాన్నొకటి కాటేసుకుంటే..

ఒకే జాతికి చెందిన రెండు పాములు ఒకదానితో ఒకటి తలపడటం చూస్తుంటాం. ఈ సమయంలో బుసలు కొడుతూ ఒకదాన్నొకటి కాటేసుకుంటాయి. ఇలా ఒకేజాతి పాములు ఒకదాన్ని ఇంకోటి కాటేసుకున్నా వాటి ప్రాణాలకు ప్రమాదం ఉండదని సైన్స్ చెబుతోంది. పాముల్లో ఉండే రోగనిరోధక శక్తే దీనికి కారణం… ప్రతి జాతి పాముకు తన విషాన్ని నిర్వీర్యం చేసే యాంటీబాడీస్ సొంతంగా ఉంటాయి. ఈ కారణంగానే ఒక కింగ్ కోబ్రా మరో కింగ్ కోబ్రాను కాటేస్తే దానికి నొప్పి మాత్రమే ఉంటుంది. ఆ పాము విషం దాన్ని చంపలేదు. ఒకే జాతికి చెందిన యాంటీబాడీస్ ఉండటం వల్ల వాటికి ఎలాంటి హాని జరగదు.

34
ఓ జాతి పాము మరో జాతి పామును కరిస్తే ఏమవుతుంది?

అయితే ఓ జాతి పాము మరో జాతి పామును కరిస్తే అప్పుడు విషం ప్రమాదకరంగా మారుతుంది. కాటుకు గురయిన పాము ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు ఒక కింగ్ కోబ్రా వేరే జాతి పామును కాటేస్తే, ఆ విషం మనుషులకు లాగే దానిపై కూడా ప్రభావం చూపుతుంది. ఆ పాము విష ప్రభావంతో  చనిపోవచ్చు. 

ఒక్కో జాతి పాము విషం ఒక్కోరకంగా ఉంటాయి… రసాయనికంగా వేరువేరుగా ఉండి వేరువేరు ప్రభావాలు చూపుతాయి. అయితే ఏ పాము అయినా తన జాతి విషాన్ని మాత్రమే గుర్తించి, నిర్వీర్యం చేయగలదు… ఇతర జాతుల పాముల విషాన్ని గుర్తించలేదు. అందుకే ప్రాణాలకు ముప్పు కలుగుతుంది.

44
పాము తనను తానే కాటేసుకుంటే ఏమవుతుంది?

ఒకవేళ పాము తనను తానే కాటు వేసుకున్నా ఎలాంటి ప్రమాదం ఉండదు. పాములు తమ సొంత విషానికి ఇమ్యూనిటీని కలిగి ఉంటాయి. అందుకే సొంత విషం ఆ పాముకు ఎలాంటి ప్రమాదం కలిగించదు.

పాములు సాధారణంగా ఒకదానినొకటి చంపుకునేందుకు కాటు వేసుకోవు. ఎందుకంటే విషాన్ని ఉత్పత్తి చేయడం వాటి శరీరానికి చాలా కష్టమైన పని. కేవలం వేట కోసం లేదా ప్రాణరక్షణ కోసం మాత్రమే పాములు విషాన్ని ఉపయోగిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories