Snakes : మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా పాములు రాకూడదంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి

Published : Apr 27, 2026, 10:40 AM IST

సాధారణంగా వర్షాకాలంలోనే కాదు వేసవికాలంలోనూ పాములు ఇళ్లలోకి వస్తుంటాయి. అయితే కొన్ని ఈజీ టిప్స్ పాటిస్తే పాముల బెడద ఉండదు...  అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
ఇళ్లలోకి పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయట కనిపిస్తుంటాయి. బొరియల్లోకి నీరు చేరడంతో పాములు బయటకు వస్తాయి… ఇళ్లచుట్టూ గడ్డి దట్టంగా పెరగడంతో అక్కడ స్థావరాలను ఏర్పాటుచేసుకుంటాయి. అందుకే వర్షకాలంలో పాముకాటు కేసులు ఎక్కువ ఉంటాయి. 

అయితే కేవలం వర్షాకాలంలోనే కాదు వేసవిలోనూ పాములు ఇళ్లలోకి చొరబడతాయి. వేడిని తట్టుకోలేక బొరియల్లోంచి బయటకు వచ్చే పాములు జనావాసాల్లోని చల్లని ప్రాంతాల్లో దాాక్కుంటాయి. అందుకే ఇంటి చుట్టూ పాములకు అనువైన పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. కన్నాలు, బొరియలు ఉంటే వెంటనే మూసేయాలి. ఇలా ఇంట్లోకి పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

24
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొండి...

ఎండుటాకులు, కర్రలు, రాళ్లు, ప్లాస్టిక్ వస్తువులు గుట్టలుగా పడి ఉన్న ప్రదేశాలను పాములు స్థావరంగా మార్చుకుంటారు. కాబట్టి ఇంటి పరిసరాల్లో మరీ ముఖ్యంగా కిటికీల దగ్గర ఇలాంటివి లేకుండా చూసుకోవాలి.

ఇక వంటగది, నీళ్ల ట్యాంకుల వంటి చల్లని ప్రదేశాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.. ఈ ప్రాంతాల్లో పాములు తిష్ట వేయవచ్చు. ఇక ఇంట్లోకి వచ్చే మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, మూత పెట్టి ఉంచాలి. వీటిద్వారా పాములు ఇళ్లలోకి చేరవచ్చు. 

34
ఎలుకలు, కప్పలు లేకుండా చూసుకొండి.

ఇంటి బయట ఉండే నీటి గుంటలు, చెరువులు పాములను ఆకర్షిస్తాయి. వాటిలోని కప్పలు, ఇతర జీవులను తినడానికి పాములు అక్కడికి వస్తాయి. బల్లులు, ఎలుకల ఉనికిని కూడా పాములు పసిగడతాయి. అందుకే ఇంటి పరిసరాల్లోని గుంటల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకొండి.. ఇంట్లో బల్లులు, ఎలుకలు లేకుండా జాగ్రత్తపడండి.

ఇంటి పరిసరాల్లో కుక్కల షెడ్లు, కోళ్ల గూళ్లు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం మిగిలిపోతే, వాటిని తినడానికి ఎలుకలు వస్తాయి. ఆ ఎలుకలను వేటాడేందుకు పాములు వస్తాయి.

44
ఇలా చేశారో పాములు దరిచేరవు..

ఇంటికి, తోటకి కంచె వేయడం వల్ల కూడా పాముల నుంచి రక్షణ పొందవచ్చు. కొన్ని వాసనలు పాములకు చికాకు తెప్పిస్తాయి. వెల్లుల్లిని దంచి చల్లడం, సాంబ్రాణి పొగ వేయడం వల్ల పాములను తరిమికొట్టవచ్చు.

ఇంటి గుమ్మం ముందు వేసే డోర్‌మ్యాట్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. వాటి కింద పాములు నక్కి ఉన్న ఘటనలు మీరు వినే ఉంటారు. అందుకే రోజూ డోర్‌మ్యాట్‌ను దులిపి వేయడం అలవాటు చేసుకోవాలి.

ఇంటిని ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించాలి. తోటపని చేసేటప్పుడు కుండీలను జాగ్రత్తగా జరపాలి. ఇంటికి దగ్గరగా కట్టెలు, రాళ్లు వంటివి పేర్చడం మానుకోవాలి.

ఇలా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లోకి పాములురావు. దీంతో మీ కుటుంబం సేఫ్ గా ఉంటుంది… ఇంట్లో పాముల భయంతో బిక్కుబిక్కు మనే పరిస్థితి ఉండదు. 

Read more Photos on
click me!

Recommended Stories