ఇల్లు శుభ్రం చేస్తుండగా ఓ కుటుంబానికి 20 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్ దొరికింది. అందులో లక్ష రూపాయలకు పైగా బ్యాలెన్స్ ఉండటంతో వాళ్లు ఆశ్చర్యపోయారు. అయితే ఖాతాదారుడు చనిపోయి ఇన్నేళ్లయినా ఆ డబ్బులు తిరిగి పొందవచ్చా? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
చనిపోయిన వారి అకౌంట్లోంచి డబ్బులు విత్ డ్రా చేయవచ్చా?
ఇల్లు సర్దుతున్నప్పుడు పాత జ్ఞాపకాలు దొరకడం కామన్. కానీ కొన్నిసార్లు మన తలరాతనే మార్చే వస్తువులు కూడా బయటపడతాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇలాంటి ఓ స్టోరీ తెగ వైరల్ అవుతోంది. ఓ కుటుంబానికి ఇల్లు శుభ్రం చేస్తుండగా, వాళ్ల తాతగారికి చెందిన 20 ఏళ్ల నాటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పాస్‌బుక్ దొరికింది. అందులో బ్యాలెన్స్ చూసి ఆ కుటుంబం మొత్తం షాక్ అయింది. ఇంతకీ ఇన్నేళ్ల తర్వాత ఆ డబ్బులు వాళ్లకు వస్తాయా? లేదా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
24
20 ఏళ్ల పాత పాస్‌బుక్ చూసి ఫ్యామిలీ ఆశ్చర్యం
పూజ అనే మహిళ X (గతంలో ట్విట్టర్)లో ఈ పాత పాస్‌బుక్ ఫోటోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం, ఇంట్లో క్లీనింగ్ చేస్తుండగా వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ పాస్‌బుక్ కనిపించింది. వాళ్ల నాన్న ఆ పాస్‌బుక్‌ను చూడగానే అది చనిపోయిన తన తండ్రిదని గుర్తుపట్టారు. ఆ అకౌంట్ గురించి వాళ్లు ఎప్పుడో మర్చిపోయారట.
ఆ ఖాతాలో లక్ష రూపాయలకు పైగా డబ్బులు ఉన్నాయని ఆ కుటుంబం చెబుతోంది. రెండు దశాబ్దాల క్రితం లక్ష రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. అందుకే, ఈ పాస్‌బుక్ దొరకడం వాళ్లకు జాక్‌పాట్ తగిలినట్టు అయింది.
A guy found a 20-24 year old SBI passbook while cleaning his house.
and what he discovered left his entire family shocked.
When he showed the passbook to his father,
he learned that it belonged to his late grandfather.
ఖాతాదారుడు చనిపోవడం, చాలా ఏళ్లుగా అకౌంట్ వాడకపోవడంతో ఆ డబ్బులు వస్తాయో రావో అని కుటుంబ సభ్యులకు చాలా సందేహాలు వచ్చాయి. ఈ డబ్బును ఇప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చా లేక ఆ డబ్బు పోయినట్టేనా అని సోషల్ మీడియాలో అడిగారు. దీనిపై స్పందించిన చాలామంది బ్యాంకింగ్ నిపుణులు, అకౌంట్ చాలా కాలం వాడకపోయినా అందులోని డబ్బు పోదని చెప్పారు. ఒకవేళ ఏళ్ల తరబడి ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, ఆ డబ్బును నిబంధనల ప్రకారం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ (DEAF) ఫండ్‌కు బదిలీ చేస్తారు. అయినా కూడా, సరైన వారసులు సరైన పద్ధతిలో ఆ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.
చనిపోయిన వ్యక్తి ఖాతాలోని డబ్బును పొందాలంటే, సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించాలి. సాధారణంగా బ్యాంకులు డెత్ సర్టిఫికెట్, చట్టపరమైన వారసులమని నిరూపించే పత్రం, గుర్తింపు కార్డు వంటి డాక్యుమెంట్లు అడుగుతాయి.
ఒకవేళ అకౌంట్‌లో నామినీ పేరు ముందే రిజిస్టర్ చేసి ఉంటే పని మరింత సులువు అవుతుంది. నామినీ లేకపోతే బ్యాంకు వారసత్వ ధృవీకరణ పత్రం (Succession Certificate) లేదా ఇతర చట్టపరమైన పత్రాలను అడగవచ్చు. అందుకే ఇలాంటి సందర్భాల్లో నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. మీ ఇంట్లో కూడా ఇలాంటి పాత బ్యాంకు పాస్‌బుక్‌లు, ఎఫ్‌డీ రసీదులు లేదా ఇతర డాక్యుమెంట్లు దొరికితే, వాటిని నిర్లక్ష్యం చేయకండి. సరైన పత్రాలతో బ్యాంకు ప్రక్రియను పాటిస్తే ఏళ్ల నాటి డిపాజిట్లను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.