సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరుల పెళ్లిళ్లపై కఠిన నిబంధనలు పెట్టింది. సౌదీ అబ్బాయిలు ఓ నాలుగు దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంపై నిషేధం ఉంది… ఆ దేశాలేవో తెలుసా?
"నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు" అన్నట్లుంది పాకిస్థాన్, సౌదీ అరేబియా ప్రెండ్షిప్. ఇటీవలే ఈ రెండు దేశాలు ''మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్'' పై సంతకం చేశాయి... దీనిప్రకారం ఈ దేశాలు రక్షణ విషయంలో ఒకదానికొకటి సహకరించుకోనున్నాయట. భారత్ ను టార్గెట్ గా చేసుకుని పాక్ ఇలాంటి ఒప్పందం చేసుకుందని స్పష్టంగా అర్థమవుతోంది.
అయితే రక్షణ మాట అటుంచితే పాకిస్థాన్ ప్రజలను కనీసం మనుషులుగా గుర్తించడంలేదు సౌదీ... ఇందుకు నిదర్శనమే పాక్ అమ్మాయిలను సౌదీ అబ్బాయిలు పెళ్లాడకూడదు అనే నిబంధన. ఇలా సౌదీ అరేబియా చీ కొడుతున్నా సరే పాక్ ఆ దేశం వెంటపడిమరీ ఒప్పందాలు చేసుకుంటోంది.
ప్రేమకు దేశాలతో, సరిహద్దులతో సంబంధం లేదు. కానీ సౌదీ అరేబియాలో మాత్రం తమ దేశ అబ్బాయిలు ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అంటోంది. అక్కడి ప్రభుత్వం పెళ్లిళ్లపై కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టింది. సౌదీ యువకులు ఈ రూల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిందే.
23
సౌదీ అరేబియా అబ్బాయిలు పాక్ అమ్మాయిలను పెళ్లిచేసుకోవద్దా?
సౌదీ అరేబియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం… ఆ దేశ పౌరులు ప్రపంచంలోని ఏ దేశం అమ్మాయిలనైనా కొన్ని షరతులతో పెళ్లాడవచ్చు… కానీ ఓ నాలుగు దేశాల అమ్మాయిలను పెళ్లిచేసుకోవాలంటే మాత్రం కష్టం. ఈ నిబంధన ఇప్పుడు కొత్తగా పెట్టినవి కావు… చాలా ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. సౌదీ నిషేధించిన దేశాల్లో మూడు మన పొరుగు దేశాలే కావడం గమనార్హం.
సౌదీ ప్రభుత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చాద్ దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంపై నిషేధం విధించింది. విదేశీ మహిళలతో పెళ్లిళ్లను ప్రోత్సహించకూడదని… తమ దేశ అబ్బాయిలు ఇక్కడి అమ్మాయిలనే పెళ్లాడాలనే ఉద్దేశంతో ఈ నిబంధన తెచ్చారు. ఒకవేళ ఈ నాలుగు దేశాలు కాకుండా ఇతర దేశాల వారిని పెళ్లి చేసుకోవాలన్నా కొన్ని రూల్స్ పాటించాల్సిందే.
33
విదేశీ మహిళల్ని పెళ్లాడాలంటే ఏం చేయాలి?
విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకునే సౌదీ యువకులు కొన్ని రూల్స్ పాటించాలి. సదరు విదేశీ యువతికి సంబంధించి ప్రభుత్వం సూచించిన కొన్ని డాక్యుమెంట్లను సమర్పించి పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వ అధికారిక శాఖల నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవు.
ఇప్పటికే పెళ్లైనవారు లేదా విడాకులు తీసుకున్నవారు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే మరిన్ని నిబంధనలు పాటించాలి. పెళ్లి అనుమతి కోసం దరఖాస్తు చేశాక ఆరు నెలలు ఆగాలి. అన్నీ పరిశీలించాకే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ నిబంధన ద్వారా తమ దేశంలోకి వచ్చేవారి సమాచారాన్ని సౌదీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. దేశ పౌరుల రక్షణ కోసమే ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం చెబుతోంది.