IRCTC Tour: ఐఆర్సీసీటీసీ భక్తుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో హైదారబాద్ నుంచి తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను చూపించే యాత్రను ప్లాన్ చేసింది. దీనివల్ల అతి తక్కువ ఖర్చుతోనే ప్రధాన ఆలయాలను దర్శించుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి తెలుగు భక్తుల కోసం ఐఆర్సీటీసీ అద్భుతమైన యాత్ర ప్యాకేజీ తీసుకొచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం, అరుణాచలం, మధురై, చిదంబరం వంటి పుణ్య క్షేత్రాలను దర్శించేలా దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం చిదంబరం పేరుతో యాత్రను ప్లాన్ చేసింది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లపాటు సాగుతుంది. దారిలో వచ్చే ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం అవుతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా తక్కువ ఖర్చుతోనే ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ అద్భుతమైన బంఫర్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
23
ఏమేమి చూడొచ్చు?
హైదరాబాద్ నుంచే నేరుగా యాత్ర ప్రారంభం కావడం వల్ల తెలుగు భక్తులు ప్రయాణం సులభంగా మారనుంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ కింద రామేశ్వరం, మహాశివుని అగ్నిలింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న అరుణాచలేశ్వర ఆలయం, అలాగే మూడు సముద్రాల సంగమ ప్రాంతమైన కన్యాకుమారిని సందర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. అంతేకాదు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం, చిదంబరం నటరాజ ఆలయం వంటి దివ్యక్షేత్రాలను కూడా ఈ టూర్‌లో భాగంగా దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు ప్రయాణంలో ఫుడ్ ఏర్పాట్లను IRCTC చూసుకుంటుంది. సొంతంగా విడివిడిగా వెళితే అయ్యే ఖర్చుతో పోలిస్తే, ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణించడం వల్ల చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది.
33
వెబ్ సైట్లోనే వివరాలు
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ల బుకింగ్ ప్రక్రియ, ప్రయాణ తేదీలు, ధరల వివరాలను IRCTC అధికారిక వెబ్‌సైట్ లో పెట్టింది. కుటుంబ సమేతంగా యాత్ర చేయాలనుకునే వారు, వృద్ధులు హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలాంటి ప్రయణా టెన్షన్ లేకుండా, తక్కువ బడ్జెట్‌లో దక్షిణ భారతదేశంలోని మహా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం.