మొదటి రోజు సానుకూల స్పందన రావడంతో, లాంగ్ వీకెండ్ ,దీపావళి సెలవు దినాలు ఈ సినిమా కలెక్షన్లకు మరింత ఊతమిస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఆదివారం దీపావళి కావడంతో సాయంత్రం వేళల్లో కలెక్షన్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. సోమవారం నుంచి కొన్ని సెలవులు ఉండటం.. మంచి మౌత్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చరిత్ర సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, రెండవ భాగం 2028 దీపావళికి విడుదల కానుంది. రెండు భాగాల కలిపి ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ సుమారు రూ. 4,000 కోట్లుగా ఉంది. నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా , యశ్ మన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటించారు. అలాగే సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్, లారా దత్తా, శోభన, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ - హాన్స్ జిమ్మర్ సంగీతం అందించారు.