Railway Stations: ఒకప్పుడు రైల్వే స్టేషన్‌కు వెళ్తే ప్రయాణికులకు కనిపించే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఇప్పుడు కనుమరుగయ్యాయి. మరి ఒకప్పుడు రైల్వే స్టేషన్లలో సందడి చేసిన ఆ ఐదు వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు రైల్వే స్టేషన్లలో పీసీవో ఫోన్ బూత్‌లు చాలా ముఖ్యమైనవి. ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలన్నా, రైలు ఆలస్యమైన విషయం చెప్పాలన్నా ఈ ఫోన్ బూత్‌లనే ఆశ్రయించేవారు. మొబైల్ ఫోన్లు అందుబాటులో లేని రోజుల్లో వీటి దగ్గర ప్రయాణికులు క్యూలో నిలబడి ఫోన్ మాట్లాడేవారు. నిమిషాల లెక్కన డబ్బులు చెల్లించి మాట్లాడటం అప్పట్లో సాధారణం. అయితే మొబైల్ ఫోన్ల వినియోగం పెరగడంతో పీసీవో బూత్‌ల అవసరం తగ్గిపోయింది. దీంతో రైల్వే స్టేషన్లలో ఇవి క్రమంగా కనుమరుగయ్యాయి.
25
నాణెం వేస్తే బరువు చెప్పే యంత్రాలు
రైల్వే స్టేషన్లలో ఒకప్పుడు నాణెం వేస్తే బరువు చూపించే యంత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ప్రయాణికులు అందులో నాణెం వేసి తమ బరువును తెలుసుకునేవారు. అంతేకాదు, బరువుతో పాటు అదృష్టం, భవిష్యత్తు లేదా ఆసక్తికరమైన సందేశంతో కూడిన చిన్న కాగితం కూడా బయటకు వచ్చేది. దీంతో పిల్లలు, పెద్దలు ఆసక్తిగా ఈ యంత్రాలను ఉపయోగించేవారు. కాలక్రమేణా డిజిటల్ బరువు కొలిచే పరికరాలు అందుబాటులోకి రావడంతో వీటి ప్రాధాన్యం తగ్గింది. కొన్ని చోట్ల ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ గతంలో ఉన్నంత ఆదరణ లేదు.
35
రిజర్వేషన్ చార్ట్‌లు
గతంలో రైలు ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకున్నవారు తమ బెర్త్ వివరాలు తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్‌లోని చార్ట్‌ల కోసం ఎదురుచూసేవారు. రిజర్వేషన్ వివరాలతో కూడిన కాగితపు జాబితాలను ప్లాట్‌ఫామ్‌లో, రైలు బోగీల బయట అంటించేవారు. ప్రయాణికులు తమ పేరు, పీఎన్ఆర్ నంబర్ లేదా సీటు నంబర్ కోసం ఆ చార్ట్‌ల దగ్గర వెతికేవారు. కొన్నిసార్లు తమ పేరు కనిపించకపోతే ఆందోళన కూడా చెందేవారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, రైల్వే వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా సీటు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో కాగితపు చార్ట్‌లపై ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది.
రైల్వే స్టేషన్‌కు వెళ్లగానే ప్లాట్‌ఫామ్‌పై కనిపించే పెద్ద గుండ్రటి గడియారాలు అప్పట్లో ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడేవి. రైలు ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎంత సమయం ఉంది? అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఈ గడియారాలనే చూసేవారు. ముఖ్యంగా చేతి గడియారాలు లేని రోజుల్లో ఇవే సమయాన్ని తెలుసుకునేందుకు ప్రధాన ఆధారం. అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్లలో డిజిటల్ డిస్‌ప్లేలు, ఎలక్ట్రానిక్ గడియారాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాత తరహా గుండ్రటి గడియారాలు క్రమంగా తగ్గిపోయాయి.
55
టెలిగ్రామ్ కౌంటర్లు, చేతి సిగ్నల్ ల్యాంపులు
ఒకప్పుడు అత్యవసర సమాచారాన్ని వేగంగా పంపించేందుకు టెలిగ్రామ్ సేవలు ఎంతో ఉపయోగపడేవి. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమాచారం పంపాలన్నా, ఇతర ముఖ్యమైన విషయాలు తెలియజేయాలన్నా రైల్వే స్టేషన్లలోని టెలిగ్రామ్ కౌంటర్లను ఆశ్రయించేవారు. అయితే 2013లో దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో ఈ కౌంటర్లు కూడా చరిత్రలో కలిసిపోయాయి.
అలాగే గతంలో రైళ్ల రాకపోకలకు సంకేతాలు ఇచ్చేందుకు రైల్వే సిబ్బంది చేతిలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల ల్యాంపులు పట్టుకునేవారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ ల్యాంపుల ద్వారా రైళ్లకు సంకేతాలు అందించేవారు. ప్రస్తుతం ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ సిగ్నళ్లు, ఆటోమేటిక్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో చేతి సిగ్నల్ ల్యాంపుల వినియోగం బాగా తగ్గిపోయింది.