Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు మనకు అబద్ధం చెప్పే 5 సందర్భాలు ఇవే!

Published : Jul 10, 2026, 02:30 PM IST

Psychology: మనం ఆలోచించే ప్రతి విషయం నిజమేనా? మన మెదడు మనకు అన్నీ నిజాలే చెప్తుందా? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం దానికేంటి అనుకుంటున్నారా? అయితే పొరపాటు పడ్డట్లే. సైకాలజీ ప్రకారం మన మెదడు కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్తుందట. అదెప్పుడో చూద్దాం.

PREV
16
మెదడు అబద్ధం చెప్పే 5 సందర్భాలు

మన మెదడు మనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడని మనం అనుకుంటాం. మనం చూసేది, వినేది, అనుభవించేది అన్నింటినీ అది ప్రాసెస్ చేసి మనకు వాస్తవాన్ని చూపిస్తుందని అనుకుంటాం. కానీ సైకాలజీ ప్రకారం మన మెదడు ఎప్పుడూ వాస్తవాన్నే చూపించదు. కొన్నిసార్లు అది మనల్ని రక్షించడానికి, మరికొన్నిసార్లు త్వరగా నిర్ణయాలు తీసుకునేలా చేయడానికి అబద్ధాలు కూడా చెప్తుందట. అలాంటి 5 సందర్భాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

26
అందరూ నన్నే చూస్తున్నారనే భావన

సాధారణంగా మనం కొత్త బట్టలు వేసుకుని బయటకు వెళ్లినప్పుడు లేదా స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు, చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు అందరు మనల్నే చూస్తున్నారని అనిపిస్తుంది. వాస్తవానికి ప్రతి వ్యక్తి.. తన గురించి తానే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన మెదడు మాత్రం ఇతరులు మనల్నే గమనిస్తున్నారని, మన తప్పులు వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయని మనల్ని నమ్మిస్తుంది. అందుకే చిన్న తప్పు చేసినా మనం రోజుల తరబడి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. నిపుణుల ప్రకారం, ఇతరులు మనల్ని మనం అనుకున్నంతగా గమనించరనే విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది.

36
ఫెయిల్ అవుతాననే నమ్మకం

ఏదైనా పరీక్ష, ఇంటర్వ్యూ లేదా కొత్త పని మొదలుపెట్టే ముందు చాలామందికి చెడు ఫలితాలే ముందుగా గుర్తుకువస్తాయి. దీనికి కారణం మన మెదడు ప్రతికూల అవకాశాలను ఎక్కువగా గుర్తించడమే. అయితే ఇది చాలాసార్లు వాస్తవాన్ని అతిశయోక్తిగా చూపిస్తుంది. ఒక చిన్న సమస్యను పెద్ద ప్రమాదంగా ఊహించమని మనల్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి

46
మన జ్ఞాపకాలు పూర్తిగా నిజమనే అపోహ

చాలామంది గతంలో జరిగిన సంఘటనలు చాలా స్పష్టంగా గుర్తున్నాయని అనుకుంటారు. కానీ పరిశోధనల ప్రకారం జ్ఞాపకాలు మైండ్ లో అలాగే స్టోరై ఉండవు. మనం జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి అది కొంతమేర మారే అవకాశం ఉంటుంది. అందుకే ఒక సంఘటనను ఇద్దరు వ్యక్తులు పూర్తిగా భిన్నంగా గుర్తుంచుకోవచ్చు. 

56
అందరూ నాతో ఏకీభవిస్తున్నారనే భ్రమ

సాధారణంగా ఒక వ్యక్తి ఒక నమ్మకాన్ని కలిగి ఉంటే, దాన్ని సమర్థించే వార్తలను మాత్రమే చదవవచ్చు. అప్పుడు తన అభిప్రాయమే సరైందని, అందరూ అదే అనుకుంటున్నారని అతనికి అనిపిస్తుంది. కానీ వాస్తవం అలా ఉండకపోవచ్చు. నిపుణుల ప్రకారం మన అభిప్రాయాలకు విరుద్ధమైన వాదనలను కూడా చదవడం, వినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన ఆలోచనలు బ్యాలెన్స్ డ్ గా ఉంటాయి.

66
నేను మారలేను అనే నమ్మకం

చాలామంది.. నేను ధైర్యంగా మాట్లాడలేను, నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను, నేను మారలేను.. అనుకుంటారు. కానీ మన మెదడుకు మార్పు చెందే సామర్థ్యం ఉందని సైకాలజీ స్పష్టంగా చెబుతోంది. సరైన సాధన, నిరంతర ప్రయత్నం, కొత్త అనుభవాల ద్వారా మన స్కిల్స్, ఆలోచనా విధానం గణనీయంగా మారవచ్చు. సైకాలజీ నిపుణుల ప్రకారం మెదడు అబద్ధాలు చెప్పే ఈ సందర్భాలను గుర్తించడం ద్వారా మనం మరింత స్పష్టంగా ఆలోచించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories