మీ జీతం పెరిగినప్పుడల్లా ప్రతీ ఏటా SIP మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు నెలకు రూ.2,000తో మొదలుపెట్టి, ప్రతీ సంవత్సరం SIPని 10% లేదా 15% పెంచితే, మీరు అనుకున్నదానికంటే తక్కువ సమయంలోనే కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలాగే ఏడాదికి ఒకసారి మీ పెట్టుబడులను సమీక్షించుకుని, అవసరమైతే పోర్ట్‌ఫోలియోను మార్చుకోవడం మంచి వ్యూహం.
ఇలా నెలకు కేవలం రూ.2,000 SIPతో కూడా కోటి రూపాయల సంపదను సృష్టించడం అసాధ్యమేమీ కాదు. కానీ ఓపిక, క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృష్టి చాలా ముఖ్యం. మధ్యలో ఆపకుండా పెట్టుబడి కొనసాగిస్తే, చిన్న మొత్తంతోనే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.
గమనిక
ఇక్కడ చెప్పిన 10%, 12%, 15% రాబడి అంచనాలు అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. గతంలో వచ్చిన రాబడి, భవిష్యత్తులోనూ వస్తుందని గ్యారెంటీ లేదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ డబ్బుకు ఏసియానెట్ న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు.