పువార్ గ్రామంలోని ప్రత్యేకతలు...
ఇక్కడ నయ్యార్ నది, పూవార్ సరస్సు, అరేబియా సముద్రం ఒకేచోట కలుస్తాయి. బంగారు ఇసుక తిన్నెలు ఒకవైపు సముద్రాన్ని, మరోవైపు నదిని వేరు చేస్తూ అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. పూవార్ బీచ్‌కు నేరుగా రోడ్డు మార్గం ఉండదు. మడ అడవుల మధ్య సాగే సన్నని నీటి కాలువలలో బోటులో ప్రయాణిస్తూ బీచ్‌కు చేరుకోవడం ఒక మరపురాని అనుభూతి. నీటిపై తేలియాడే రిసార్టులు, హౌస్‌బోట్లు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు, పక్షుల కిలకిలరావాల మధ్య ప్రశాంతంగా గడపడానికి ఇది బెస్ట్ ప్లేస్. ప్రాచీన కాలంలో సుగంధ ద్రవ్యాలు, దంతాలు, కలప ఎగుమతులకు పూవార్ ఒక ప్రముఖ ఓడరేవుగా ఉండేది. గ్రీకు, రోమన్, అరబ్ వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారని చరిత్ర చెబుతోంది.
ఎప్పుడు వెళ్లాలి? ఎలా చేరుకోవాలి?
అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో (జూన్ - సెప్టెంబర్) ఇక్కడి మడ అడవులు మరింత పచ్చగా మారి కనువిందు చేస్తాయి.
ప్రయాణ మార్గం: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నుండి పూవార్ సుమారు 26-30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ధ కోవలం బీచ్ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
కోలాహలం లేకుండా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే పర్యాటకులకు కేరళలోని పూవార్ ఒక అద్భుతమైన గమ్యస్థానం.