Saffron: మీరు తీసుకున్న కుంకుమపువ్వు అసలైనదా లేక నకిలీదా? ఎలా గుర్తించాలంటే?

Published : Nov 18, 2026, 02:47 PM IST

Saffron: మార్కెట్లో దొరికే కుంకుమపువ్వు అసలైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవడం ఎలా? గోరువెచ్చని నీటి పరీక్ష, రంగు, వాసన, రుచి, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ఆధారంగా స్వచ్ఛతను గుర్తించే సులభమైన చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
కుంకుమపువ్వు: మీరు కొన్నది అసలా నకిలీనా.. ఇలా చెక్ చేయండి

వంటలకు అద్భుతమైన సువాసనను, రుచిని అందించే కుంకుమపువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసుల్లో ఒకటి. కేవలం కొన్ని గ్రాముల కే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి రావడంతో దీనికి మార్కెట్లో భీభత్సమైన డిమాండ్ ఉంది.

అయితే, ఇదే అదునుగా భావించి కొందరు కేటుగాళ్లు నకిలీ కుంకుమపువ్వుతో వినియోగదారులను మోసం చేస్తున్నారు. చూడటానికి అచ్చం అసలైనదానిలాగే ఎర్రగా మెరిసే ఈ నకిలీ ఉత్పత్తులను గుర్తించడం సామాన్యులకు పెద్ద టాస్కే. మరి, మనం కొంటున్న కుంకుమపువ్వు అసలైనదేనా లేదా నకిలీనా అనేది ఇంట్లోనే ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

25
గోరువెచ్చని నీటితో సింపుల్ టెస్ట్

అసలైన కుంకుమపువ్వును గుర్తించడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి వాటర్ టెస్ట్. ఒక చిన్న గాజు గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో రెండు మూడు కుంకుమపువ్వు రేకులను వేయాలి. కొద్దిసేపు వాటిని కదపకుండా అలాగే ఉంచితే నీటి రంగు మారడం గమనించవచ్చు.

ఒకవేళ అది అసలైనదైతే, నీటిలో వేసిన వెంటనే రంగు మారకుండా నిదానంగా బంగారు పసుపు రంగులోకి మారుతుంది. అంతేకాదు, ఆ రేకులు తమ ఎరుపు రంగును చాలావరకు అలాగే నిలుపుకుంటాయి. ఒకవేళ నీటిలో వేసిన సెకన్లలోనే నీళ్లు గాఢమైన ఎరుపు లేదా ఆరెంజ్ రంగులోకి మారిపోతే మాత్రం అది కల్తీ రంగు అద్దిన నకిలీ కుంకుమపువ్వు అని అర్థం చేసుకోవాలి.

35
రేకుల ఆకారం, రంగు మారే తీరు గమనించారా?

కేవలం నీళ్ల రంగు మాత్రమే కాకుండా, నానిన తర్వాత ఆ కుంకుమపువ్వు పోగుల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడం కూడా చాలా ముఖ్యం. స్వచ్ఛమైన కుంకుమపువ్వు అనేది మొక్క నుంచి సేకరించిన సహజమైన ఎండిన స్టిగ్మాలు. ఇవి చూడటానికి ముదురు ఎరుపు రంగులో ఉండి, ఒక చివర కొద్దిగా వెడల్పుగా లేదా ట్రంపెట్ ఆకారంలో ఉంటాయి.

అన్ని పోగులు ఒకేలా, మిషన్తో కట్ చేసినట్లు ఉండవు. నీటిలో నానిన తర్వాత కూడా అసలైన రేకులు తమ ఎరుపు రంగును కోల్పోవు. అదే రంగులు అద్దిన నకిలీలైతే రంగును కోల్పోయి తెల్లగా లేదా తేలికపాటి పసుపు రంగులోకి మారిపోతాయి. అలాగే, మొక్కజొన్న పీచుకు రంగులు అద్దడం వంటి కల్తీలను ఈ విధంగా సులభంగా గుర్తించవచ్చు.

45
వాసన, రుచి చూసి పట్టేయొచ్చు

అసలైన కుంకుమపువ్వుకు ఒక ప్రత్యేకమైన, సహజమైన సువాసన ఉంటుంది. ఇందులో ఉండే సఫ్రానల్ అనే సహజ సమ్మేళనం వల్ల దీనికి తియ్యదనంతో కూడిన అద్భుతమైన పూల వాసన వస్తుంది. ఒకవేళ మీరు కొన్న దానికి ఎలాంటి వాసన రాకపోగా, బూజు వాసన లేదా కెమికల్ వాసన వస్తే వెంటనే పక్కన పెట్టేయడం మంచిది.

అలాగే, అసలైన కుంకుమపువ్వును కొద్దిగా నోట్లో వేసుకుంటే అది తియ్యగా ఉండదు, బదులుగా తేలికపాటి చేదు రుచిని కలిగి ఉంటుంది. ఇందులో ఉండే పిక్రోక్రోసిన్ అనే మూలకం దీనికి ఆ చేదు రుచిని ఇస్తుంది. అయితే, అనుమానాస్పదంగా ఉండే నకిలీ ఉత్పత్తులను రుచి చూడటం ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోవాలి.

55
FSSAI నిబంధనలు, ల్యాబ్ టెస్ట్ ప్రాముఖ్యత

భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) నిబంధనల ప్రకారం.. అసలైన కుంకుమపువ్వు ముదురు ఎరుపు రంగులో ఉండి, సహజమైన చేదు రుచిని, సువాసనను కలిగి ఉండాలి. ఎలాంటి కృత్రిమ రంగులు, పురుగులు లేదా కలుషితాలు ఉండకూడదు. అయితే, ఇంట్లో చేసే ఈ ప్రాథమిక పరీక్షలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

కొన్ని అధునాతన కల్తీలను సాధారణ నీటి పరీక్షతో గుర్తించడం కష్టం. కాబట్టి మీకు పూర్తి స్పష్టత కావాలంటే, గుర్తింపు పొందిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లో స్పెక్ట్రోఫోటోమెట్రీ పరీక్షలు చేయించడం ఉత్తమం. కొనేటప్పుడు ఎప్పుడైనా విడిపొడి రూపంలో కాకుండా నమ్మకమైన బ్రాండ్ల ప్యాకెట్లను ఎంచుకోవడం ఎప్పుడూ సురక్షితం.

Read more Photos on
click me!

Recommended Stories