Poison vs Venom : పాములను వెనమస్ అంటారు… పాాయిజనస్ కాదు. జంతువుల విషాన్ని వెనమ్ అని ఎందుకంటారు..? అసలు పాయిజన్, వెనమ్ మధ్య తేడా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Poison vs Venom : సాధారణంగా పాముల విషాన్ని వెనమ్ అంటారు... అదే మిగతా విషాన్ని పాయిజన్ అంటుంటారు. అయితే రెండూ ప్రమాదకరమైన విషమే అయినా వీటి మధ్య పెద్ద తేడా ఉంది... అందుకే ఒకదాన్ని పాయిజన్ అని ఇంకోదాన్ని విషం అని అంటారు. పాయిజన్, వెనమ్ మధ్య తేడా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
24
వెనమ్ (Venom) అంటే ఏమిటి..?
పాములు, తేళ్లు వంటి జంతువుల్లోని విషాన్ని వెనమ్ అంటారు. విషపూరిత జంతువుల కాటు లేదా కొన్నిరకాల ముళ్ళ ద్వారా వెనమ్ శరీరంలో చేరుతుంది. అంటే అది నేరుగా రక్తంలోకి లేదా కణజాలంలోకి ప్రవేశిస్తుంది. జంతువు దాడి చేసి శరీరంలోకి పంపే విషాన్ని వెనమ్ అంటారు.
వెనమ్ నేరుగా శరీరంలోకి చేరినా ప్రమాదకరం కాదు... ఇది రక్తం లేదా కణజాలంలో కలిస్తేనే ప్రమాదకరం. నాగుపాములు, తేళ్ళు, తేనెటీగలు, కొన్నిరకాల సలీళ్లు కుట్టినప్పుడు వెనమ్ నేరుగా రక్తంలో కలుస్తుంది. ఇది శరీరం మొత్తం వ్యాపించి మరణానికి దారితీయవచ్చు.
34
పాయిజన్ (Poison) అంటే ఏమిటి..?
పాయిజన్ అంటే మనిషి నేరుగా తీసుకునే విషం... అంటే ఇది జంతువుల ద్వారా కాదు ఇతర మార్గాల్లో శరీరంలోకి చేరుతుంది. ఇలా పాయిజన్ అనేది తిన్నా, తాగినా, పీల్చినా లేదా చర్మం ద్వారా శరీరంలోకి చేరి హాని చేసే విష పదార్థం. మన చర్యల ద్వారా పాయిజన్ శరీరంలోకి చేరుతుంది.
పురుగుమందులు, కొన్ని విష మొక్కలు, కలుషిత ఆహారం, రసాయనాలను పాయిజన్ అంటారు. కొన్ని రకాల చేపలు, కప్పలలో విషం ఉంటుంది... కానీ ఇవి వెనమస్ కాదు... వీటిని తిన్నా, తాకినా విషం శరీరంలోకి చేరుతుంది.
పాయిజన్, వెనమ్ కు తేడా ఏంటో ఒక్కమాటలో చెప్పాలంటే... ‘’మనిషి దేన్నయినా కరిచి (తింటే) అందులోని విషం మీ శరీరంలోకి చేరితే అది పాయిజన్'' ‘’మనిషికి ఏదైనా కరిచి విషం శరీరంలో చేరితే అది వెనమ్''. ఈ రెండు సందర్భాల్లో ప్రమాదం జరిగేది మనిషికే. పాయిజన్ శరీరంలోకి చేరితే ప్రాణాలకే ప్రమాదం... కానీ వెనమ్ నేరుగా శరీరంలోకి చేరినా ప్రమాదకరం కాదు... ఇది రక్తంలో కలిస్తేనే ప్రాణాలకు ముప్పు ఉంటుంది.
మన జీర్ణ వ్యవస్థ వెనమ్ ను న్యూట్రలైజ్ చేస్తుంది... కానీ పాయిజన్ ను చేయలేదు. కొన్ని జంతువులు వెనమస్, పాయిజనస్... కానీ ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. ఇవి కుట్టినా, వీటిని తిన్నా మనిషి ప్రాణాలకు ముప్పు ఉంటుంది.