River: ఒకే నది.. కానీ ఒక్కో దేశంలో ఒక్కో పేరు. ప్రాంతానికో పేరు మార్చుకుని 3 దేశాల్లో ప్రవహిస్తోంది. దేశాలు దాటే క్రమంలో ఈ నది పేర్లు ఎలా మారుతున్నాయో తెలుసా?
హిమాలయ పర్వతాల్లో పుట్టి మూడు దేశాల మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసిపోయే నది బ్రహ్మపుత్ర. అయితే ఈ నది ప్రయాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఒకే నది అయినప్పటికీ.. అది ప్రవహించే ప్రాంతాన్ని బట్టి పేర్లు మారిపోతుంటాయి. టిబెట్‌లో ఒక పేరు, అరుణాచల్‌ప్రదేశ్‌లో మరో పేరు, అస్సాంలో ఇంకో పేరు, బంగ్లాదేశ్‌లో మరొక పేరుతో పిలుస్తారు. ఇలా మూడు దేశాలు దాటే క్రమంలో బ్రహ్మపుత్రకు ఎన్నో పేర్లు వచ్చాయి. అసలు ఈ నదికి ఏ ప్రాంతంలో ఏ పేరు ఉంది? దాని వెనుక ఉన్న విశేషాలేంటో తెలుసుకుందాం.
26
అస్సాంలో బ్రహ్మపుత్ర
అస్సాంలోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్ నదికి దిబాంగ్, లోహిత్ వంటి ఉపనదులు కలుస్తాయి. ఆ తర్వాత ఈ నదిని బ్రహ్మపుత్ర (Brahmaputra) అని పిలుస్తారు. అస్సాం రాష్ట్ర భౌగోళిక, వ్యవసాయ, ఆర్థిక జీవనంలో ఈ నదికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రాష్ట్రంలోని విస్తారమైన మైదానాల గుండా ప్రవహిస్తూ పంటలకు నీటిని అందిస్తుంది. అయితే వర్షాకాలంలో భారీ వరదలకు కూడా కారణమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటైన మజులి కూడా ఈ నదీ ప్రవాహ వ్యవస్థలోనే ఏర్పడింది.
36
అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్, దిహాంగ్
టిబెట్ నుంచి ప్రవహించే ఈ నది భారత్‌లోకి అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతం ద్వారా ప్రవేశిస్తుంది. ఇక్కడ దీనిని సియాంగ్ (Siang) లేదా దిహాంగ్ (Dihang) అని పిలుస్తారు. పర్వతాలు, లోయల మధ్య వేగంగా ప్రవహించే ఈ నది అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రకృతి అందాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో నది ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. కొండ ప్రాంతాల నుంచి మైదానాల వైపు ప్రయాణిస్తూ అస్సాంలోకి చేరుతుంది.
బ్రహ్మపుత్ర నది టిబెట్‌లోని హిమాలయ ప్రాంతంలో జన్మిస్తుంది. మానస సరోవరం సమీపంలోని అంగ్సీ హిమానీనదం (Angsi Glacier) పరిసరాల్లో ఈ నది పుట్టినట్లు గుర్తించారు. టిబెట్‌లో ప్రవహించే సమయంలో దీనిని యార్లంగ్ త్సాంగ్పో (Yarlung Tsangpo) అని పిలుస్తారు. టిబెట్‌లోని ఎత్తైన పీఠభూముల మీదుగా తూర్పు దిశగా ప్రవహిస్తూ సుదీర్ఘ ప్రయాణం సాగిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రవహించే ప్రధాన నదుల్లో ఇది ఒకటి.
56
బంగ్లాదేశ్‌లో జమునా
భారత్‌లోని అస్సాం నుంచి ముందుకు సాగిన బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని జమునా (Jamuna) అని పిలుస్తారు. బంగ్లాదేశ్‌లో ఈ నది అనేక పాయలుగా విడిపోతూ విస్తారమైన నదీ వ్యవస్థగా కనిపిస్తుంది. అనంతరం గంగా నది ప్రధాన ప్రవాహమైన పద్మతో కలిసి దిగువ ప్రాంతాల వైపు సాగుతుంది. ఆ తర్వాత మేఘన నదీ వ్యవస్థతో కలుస్తూ చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతుంది.
66
ఒకే నది.. పేర్లు మారడానికి కారణమేంటి?
ఒక నది వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలవడం వెనుక ప్రధాన కారణం స్థానిక భాషలు, సంస్కృతి, చరిత్ర. ఆయా ప్రాంతాల ప్రజలు తమ భాషలో నదికి ప్రత్యేక పేర్లు పెట్టుకున్నారు. అలా టిబెట్‌లో యార్లంగ్ త్సాంగ్పోగా, అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్ లేదా దిహాంగ్‌గా, అస్సాంలో బ్రహ్మపుత్రగా, బంగ్లాదేశ్‌లో జమునాగా పిలుస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. పేర్లు మారినా, దేశాల సరిహద్దులు దాటినా ఈ నది ప్రయాణం మాత్రం ఆగదు. హిమాలయాల్లో మొదలైన దాని ప్రవాహం మూడు దేశాల ప్రజల జీవనంతో ముడిపడి చివరకు బంగాళాఖాతంలో ముగుస్తుంది. అందుకే బ్రహ్మపుత్ర కేవలం ఒక నది మాత్రమే కాదు.. మూడు దేశాలను కలిపే సహజ జలమార్గం కూడా.