Snake Repellent: ఇంట్లోకి పాములు రాకుండా ఉండేందుకు కొన్ని సహజ సిద్ధమైన సుగంధ ద్రవ్యాలు, మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పాములను సులభంగా తరిమికొడతాయి. ఇవి వుంటే పాములు దగ్గరకు రావు.
వర్షాకాలంలో లేదా ఆ తర్వాత మన ఇళ్ల చుట్టూ పాముల సంచారం విపరీతంగా పెరుగుతుంది. ఇది చాలా కుటుంబాలలో తీవ్రమైన ఆందోళనకు గురిచేసే విషయం. రసాయనాలు లేదా విషపూరితమైన మందులను వాడటం వల్ల ఇంట్లోని చిన్నపిల్లలకు, పెంపుడు జంతువులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు.
కానీ ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా, పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతుల్లో పాములను ఇంటి పరిసరాల నుండి దూరంగా ఉంచవచ్చు. కొన్ని ప్రత్యేకమైన సుగంధాలు పాములకు అస్సలు నచ్చవు. యూఎస్డిఏ లాంటి అంతర్జాతీయ సంస్థలు, పలు శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఈ పద్ధతులు చాలా బాగా పనిచేస్తాయి.
25
దాల్చినచెక్క నూనె
పాములను తరిమి కొట్టే విధానాలలో దాల్చినచెక్క నూనె పద్దతికి మంచి పేరుంది. దీని ఘాటైన వాసన తగలగానే పాములు తీవ్రంగా అస్వస్థతకు గురై వెనక్కి తిరిగి వెళ్లిపోతాయి. అమెరికా వ్యవసాయ శాఖ పరిధిలోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ ఈ విధానాన్ని అధికారికంగా సిఫారసు చేసింది. పాములు ఇంట్లోకి వచ్చే దారుల్లో దీన్ని స్ప్రే చేయవచ్చు. సరిగ్గా ఇదే పద్ధతిలో దాల్చిన చెక్క నూనే, లవంగం కూడా పనిచేస్తుంది. ఈ రెండింటిని కలిపి ఉపయోగిస్తే ఫలితం మరింత వేగంగా కనిపిస్తుంది.
35
యూజినాల్, వెల్లుల్లి ప్రభావం
లవంగాలలో ఉండే ప్రధానమైన రసాయన పదార్థమే యూజినాల్. పాముల శరీరంలో గంధం గ్రహించే వ్యవస్థను ఇది పూర్తిగా దెబ్బతీస్తుంది. దీనివల్ల పాములకు తీవ్ర అసౌకర్యం కలిగి ఆ ప్రాంతం నుండి వెంటనే వెళ్లిపోతాయి. అలాగే సైనస్ డైరెక్ట్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం వెల్లుల్లి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ గంధం పాములకు ఉండే ప్రత్యేక అవయవాన్ని ఇబ్బంది పెడుతుంది. కొద్దిగా వెల్లుల్లిని నలిపి ఇంటి చుట్టూ చల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే వర్షం పడితే దీని ప్రభావం తగ్గుతుంది కాబట్టి మధ్యమధ్యలో మళ్లీ వేయాలి.
లెమన్‌గ్రాస్ నుంచి వచ్చే సిట్రోనెల్లా వాసనను పాములు అసలు భరించలేవు. దీన్ని ఇంట్లోని వాకిట్లో లేదా కిటికీల దగ్గర పెంచుకోవడం చాలా సులువైన మార్గం. దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. అలాగే, బంతిపూల వేర్ల నుంచి వచ్చే ద్రావణం, బంతిపూల వాసన పాములను ఆ దారికి రాకుండా అడ్డుకుంటుంది. పాములకు ఆహారమైన ఎలకలను కూడా ఇవి దూరంగా ఉంచుతాయి. కాబట్టి తోటల చుట్టూ వీటిని పెంచడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
55
పాటించాల్సిన ఇతర జాగ్రత్తలు ఇవే
సిన్నమాల్డిహైడ్ అనేది దాల్చినచెక్కకు దాని ప్రత్యేకమైన ఘాటైన వాసనను, రుచిని ఇచ్చే ప్రధాన సహజ రసాయన సమ్మేళనం. ఇది ఘాటుగా ఉండి పాములను తరిమేస్తుంది. దీనిని నేరుగా చల్లడానికి బదులుగా కొద్దిగా నీటిలో లేదా నూనెలో కలిపి స్ప్రే బాటిల్ ద్వారా వాడితే చాలా పెద్ద ప్రదేశాలలో సులభంగా ఉపయోగించవచ్చు. ఈ సుగంధాలతో పాటు మన ఇంటి చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాములు రాకుండా ఉంటాయి.