Motivational Story: క‌ష్టంలో ఉన్న‌ప్పుడు స‌ల‌హా కాదు, స‌హాయం చేయండి.. మ‌న‌సును క‌దిలించే క‌థ

Published : Aug 05, 2026, 05:02 PM IST

Motivational Story: జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనకు కావాల్సింది సలహాలు కాదు... చేయూత. మన బాధను అర్థం చేసుకుని, "నేనున్నాను" అని ముందుకు వచ్చే ఒక మనిషి. అలాంటి గొప్ప సందేశాన్ని చెప్పే ఓ చిన్న కథ ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
అలల్లో కలిసిపోయిన మూడు ప్రాణాలు.. తల్లి పిచ్చుక ఆవేదన

ఒక అందమైన సముద్ర తీరంలో ఓ చిన్న పిచ్చుక తన గూడును కట్టుకుంది. ఎంతో ప్రేమగా మూడు పిల్లలను పెంచుకుంటూ ఆనందంగా జీవిస్తోంది. ఒకరోజు అకస్మాత్తుగా సముద్రం ఉప్పొంగింది. భారీ అలలు ఒక్కసారిగా ఎగిసిపడి తీరాన్ని ముంచెత్తాయి. ఆ అలల ధాటికి పిచ్చుక గూడు సముద్రంలో కొట్టుకుపోయింది. గూడుతో పాటు అందులో ఉన్న మూడు చిన్న పిల్లలు కూడా అలల్లో కలిసిపోయాయి.

ఆ దృశ్యం చూసిన తల్లి పిచ్చుక గుండె పగిలిపోయింది. తన పిల్లలను ఎలాగైనా తిరిగి తీసుకురావాలనే తపనతో సముద్రం ఒడ్డుకు వెళ్లింది. తన చిన్న ముక్కుతో సముద్రంలోని నీటిని కొద్దికొద్దిగా బయటకు తీసి వేయడం ప్రారంభించింది. అది అసాధ్యమైన పని అని తనకూ తెలుసు. కానీ తల్లి ప్రేమకు అసాధ్యం అనే మాట తెలియదు.

25
"సలహా కాదు... సహాయం చేయి"

ఆ సమయంలో అక్కడికి మరో పక్షి వచ్చింది. "ఏం చేస్తున్నావు?" అని ఆశ్చర్యంగా అడిగింది. తల్లి పిచ్చుక కన్నీళ్లతో... "నా పిల్లలు సముద్రంలో పడిపోయారు. అందుకే ఈ నీటిని బయటకు తీస్తున్నాను. నీరు తగ్గితే నా పిల్లలు కనిపిస్తారు" అంది. ఆ మాట విన్న పక్షి నవ్వుతూ... "నువ్వు పిచ్చిదానివి. ఈ సముద్రం నీటిని బయటకు తీయడం నీ వల్ల కాదు క‌దా.. దేవుడి వల్ల కూడా కాదు. అనవసరంగా సమయం వృథా చేసుకోకు" అని చెప్పింది.

తల్లి పిచ్చుక ఒక్కసారి దాని వైపు చూసి ఇలా అంది... "మిత్రమా... నాకు ఇప్పుడు సలహాలు అవసరం లేదు. వీలైతే సహాయం చేయి". ఆ ఒక్క మాట ఆ పక్షి హృదయాన్ని తాకింది. తాను కూడా తల్లి పిచ్చుకతో కలిసి నీటిని బయటకు తీయడం ప్రారంభించింది.

35
ఒక్కరి సహాయం... లక్షల మందికి స్ఫూర్తి

కొద్దిసేపటికి మరో పక్షి అక్కడికి వచ్చింది. "మీరు చేస్తున్న పని అసాధ్యం" అని అది కూడా చెప్పింది. అప్పుడు ఆ రెండు పక్షులు ఒకటే మాట చెప్పాయి. "సలహా కాదు... సహాయం చేయి". ఆ మాట విన్న మూడో పక్షి కూడా వారితో చేరింది. అలా ఒక్కటి... రెండు... పది... వందలు... వేలుగా మారాయి. చివరకు లక్షలాది పక్షులు సముద్రం నుంచి నీటిని బయటకు తీయడం ప్రారంభించాయి. వారికి సముద్రాన్ని ఖాళీ చేయడం సాధ్యమో కాదో తెలియదు. కానీ ఒక తల్లి బాధను ఒంటరిగా వదిలేయకూడదనే భావన మాత్రం అందరిలో ఉంది. ఒక చిన్న సహాయం ఎంత పెద్ద ఉద్యమంగా మారుతుందో ఆ దృశ్యం ప్రపంచానికి చూపించింది.

45
గరుడుడు చెప్పిన మాటతో రంగంలోకి మహావిష్ణువు

లక్షలాది పక్షులు సముద్రం నుంచి నీటిని తీస్తున్న విషయం చివరకు మహావిష్ణువు వాహనమైన గరుడుడి చెవిన పడింది. గరుడుడు వెంటనే మహావిష్ణువు దగ్గరకు వెళ్లి... "స్వామీ... నేను కూడా ఆ పక్షులకు సహాయం చేయడానికి వెళ్తున్నాను" అన్నాడు. అప్పుడు మహావిష్ణువు చిరునవ్వుతో... "గరుడా... సముద్రంలోని నీటిని బయటకు తీయడం సాధ్యం కాదు" అని చెప్పారు. దానికి గరుడుడు వినయంగా..."స్వామీ... నాకు సలహా కాదు... మీ సహాయం కావాలి." అన్నాడు.

55
ఆ మాట మహావిష్ణువును కదిలించింది.

వెంటనే ఆయన సముద్రుడి వద్దకు వెళ్లి... "ఆ తల్లి పిచ్చుక పిల్లలను వెంటనే తిరిగి ఇవ్వు. లేదంటే ఈ సముద్రాన్ని పూర్తిగా ఖాళీ చేస్తాను" అని హెచ్చరించారు. మహావిష్ణువు ఆగ్రహాన్ని చూసిన సముద్రుడు భయపడి వెంటనే ఆ మూడు పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి తల్లి పిచ్చుకకు అప్పగించాడు. తన పిల్లలను చూసిన తల్లి పిచ్చుక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్కడున్న ప్రతి పక్షి సంతోషంతో రెక్కలు విప్పి ఎగిరింది.

ఈ కథ చెప్పే జీవిత సత్యం ఇదే

ఈ కథలో చాలా గొప్ప సందేశం దాగి ఉంది. మన చుట్టూ ఎంతో మంది కష్టాల్లో ఉంటారు. వారు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది పెద్ద పెద్ద సలహాలు ఇస్తారు. "అలా చేయాల్సింది... ఇలా చేయాల్సింది..." అని చెప్పడం చాలా సులభం. కానీ ఆ సమయంలో వారికి కావాల్సింది మాటలు కాదు... చేయూత. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న సహాయం, ఒక ఓదార్పు.. వంద సలహాల కంటే గొప్పది. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారిని విమర్శించకండి. సలహాలతో భారాన్ని పెంచకండి. మీ వల్ల ఎంత చిన్న సహాయం అయినా చేయండి. ఎందుకంటే సలహా పరిస్థితిని మార్చకపోవచ్చు... కానీ సహాయం ఒక జీవితాన్నే మార్చగలదు. గుర్తుంచుకోండి... కష్టాల్లో ఉన్నవారికి సలహా చెప్పే వారు చాలా మంది ఉంటారు. కానీ సహాయం చేసే వారే నిజమైన ఆత్మీయులు అవుతారు.

Read more Photos on
click me!

Recommended Stories