Motivational story: మనలో చాలా మంది సమస్య అనగానే పారిపోతుంటారు. సమస్యను పరిష్కరించడం కంటే దానిని పట్టించుకోవద్దనే ఆలోచనతో ఉంటారు. అయితే ఓ కథ చదివితే మాత్రం మీ ఆలోచన మారడం ఖాయం. ఇంతకీ ఆ కథ ఏంటంటే.?
కాసులాబాద్ అనే గ్రామంలో ఓ రాజు ఉండేవాడు. అతను ధనవంతుడు. కానీ అతనికి ప్రజల మనస్తత్వం తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. తన గ్రామంలో ప్రజలకు ఎంత వరకు బాధ్యత ఉందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ప్రజల్లో ఎవరు సమస్యను చూసి పారిపోతారు? ఎవరు ముందుకు వచ్చి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు? అన్నది తెలుసుకోవాలని నిర్ణయించాడు.
25
రహదారి మధ్యలో పెద్ద బండరాయి
ఇందులో భాగంగానే ఒక రోజు రాజు ఒక పెద్ద బండరాయిని రహదారి మధ్యలో పెట్టించాడు. తర్వాత దగ్గర్లో దాక్కొని ఎవరు ఏమి చేస్తారో గమనించసాగాడు. కొంతసేపటికి ధనిక వ్యాపారులు, రాజదర్బారు అధికారులు ఆ దారిలో వెళ్లారు. వాళ్లు బండరాయి చూసి తొలగించడానికి ప్రయత్నించలేదు. కొంతమంది “రాజు రోడ్లు సరిగ్గా చూసుకోవడం లేదు” అని విమర్శించారు. ఇంకొంతమంది రాయి పక్క నుంచి వెళ్లిపోయారు. కానీ సమస్యను తొలగించాలనే ఆలోచన మాత్రం ఎవరికీ రాలేదు.
35
రైతు చేసిన చిన్న ప్రయత్నం
కొంతసేపటికి ఒక రైతు కూరగాయల బరువుతో అక్కడికి చేరుకున్నాడు. బండరాయి చూసి ఆగిపోయాడు. “ఇది ఇక్కడ ఉంటే ఎంతో మంది ఇబ్బంది పడతారు” అని అనుకున్నాడు. తన బరువును కింద పెట్టి, బండరాయిని తోసేందుకు ప్రయత్నించాడు. మొదట కదల్లేదు, చెమటలు పట్టాయి, శక్తి తగ్గింది. కానీ కానీ అతను ఆపలేదు. చివరకు తీవ్రంగా శ్రమించి బండరాయిని పక్కకు జరిపాడు.
బండరాయి జరపగ్గానే అక్కడ ఒక సంచి కనిపించింది. ఆ సంచిలో బంగారు నాణేలు ఉన్నాయి. అందులో ఒక చిట్టీ కూడా ఉంది. ఆ చిట్టీలో “ఈ బండరాయిని తొలగించిన వ్యక్తికి ఇది బహుమతి.” అని రాసి ఉంది. దీంతో రైతు కళ్లలో ఆనందం మెరిసింది. అతను సమస్యను తప్పించుకోలేదు. దాన్ని అవకాశంగా మార్చుకున్నాడు.
55
గొప్ప సందేశం
మన జీవితంలో సమస్యలు తప్పవు. చాలామంది వాటిని చూసి పారిపోతారు. కొంతమంది విమర్శిస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే ముందుకు వచ్చి పరిష్కారం కోసం కృషి చేస్తారు. ప్రతి అడ్డంకి వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. మనం పడే కష్టం, ధైర్యం ఆ అవకాశాన్ని బయటకు తీస్తాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి బండరాయిని తోసేయండి. అందులో మీ భవిష్యత్తు దాగి ఉండవచ్చనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తోంది.