Motivation: నీ జీవితం నీదే, నీ ప్ర‌యాణం నీదే.. జీవితంలో అస‌లైన విజ‌యం ఏంటో తెలుసా.?

Published : Jan 16, 2026, 05:15 PM IST

Motivation: ప‌క్క‌వారి జీవితం మ‌న‌కంటే బాగుంద‌ని బాధ‌ప‌డేవారు మ‌న‌లో చాలా మందే ఉంటారు. అయితే ఈ క‌థ చ‌దివితే జీవితాన్ని మీరు చూస్తున్న దృక్ప‌థం మార‌డం ఖాయం. 

PREV
15
ఎదుటివాళ్ల జీవితం బాగుంద‌నించ‌డం

రాము అనే ఓ యువ‌కుడికి ఒక అలవాటు ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి ప‌క్క‌ వాళ్ల గురించే ఆలోచిస్తుంటాడు. వాళ్ల ఇల్లు నా ఇల్లుకంటే బాగుంది, వారికి కారు ఉంది, వారు న‌చ్చిన‌ట్లు జీవితాన్ని అనుభ‌విస్తున్నారు. నా జీవితంలో ఏముంది, ఇదో బ‌తుకేనా అంటూ ఎప్పుడూ నిరుత్సాహంతో ఉంటాడు.

25
పోలికలే బాధకు మూలం

రాముకు తెలియని విషయం ఒక్కటే. తాను చూస్తున్నది వాళ్ల జీవితం బయట కనిపించే భాగం మాత్రమే. వాళ్ల అప్పులు, ఒత్తిళ్లు, భయాలు అతడికి కనిపించవు. ఎదుటివాళ్లతో పోల్చుకోవడం మొదలుపెట్టిన రోజు నుంచి తన దగ్గర ఉన్న మంచి విషయాల్ని రాము చూడటం మానేశాడు. అతనికి ఒక ఉద్యోగం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంది. కానీ పోలికల ముందు ఇవన్నీ చిన్నవిగా అనిపించాయి. ఇత‌రుల‌తో పోల్చుకునే క్ర‌మంలో మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను కోల్పోతున్నాడు, రాత్రుళ్లు స‌రిగ్గా నిద్ర‌ప‌ట్ట‌డం లేదు.

35
ఒక సాధారణ మాట, పెద్ద మార్పు

అయితే ఓ రోజు రాము ఒక ఆశ్ర‌మానికి వెళ్లాడు. అక్క‌డ ఒక గురువును క‌లిశాడు. ఆ గురువుకు తాను ప‌డుతోన్న బాధ‌ను వివ‌రించాడు. అతడి బాధంతా విన్న గురువు ఒక్క మాట అన్నాడు. నువ్వు ప‌క్క‌వారితో పోల్చుపోకుండా, నీతో నిన్ను పోల్చుకో.. నిన్నటి నువ్వు ఈరోజు నువ్వును పోల్చుకోవ‌డం ప్రారంభించు అని చెప్తాడు. ఆ మాట రామును లోపల్నుంచి కదిలించింది. ఎదుటివాడు ఎంత సంపాదిస్తున్నాడు అన్నది కాదు. నువ్వు రోజుకు ఎంత మెరుగుపడుతున్నావన్నదే ముఖ్యం అని అర్థమైంది.

45
దృష్టి మారితే జీవితం మారింది

ఆ రోజు నుంచి రాము తనపై దృష్టి పెట్టాడు. ఎదుటివాళ్ల విజయాల్ని చూసి బాధపడటం మానేశాడు. తనకు ఏమి కావాలి, తన లక్ష్యం ఏంటి, తన సామర్థ్యం ఎంత అన్న ప్ర‌శ్న‌లను వేసుకోవ‌డం మొద‌లుపెట్టాడు. నెలలు గడిచాయి. రాము మనసు తేలికైంది. పని మీద ఆసక్తి పెరిగింది. ఉద్యోగంలో మ‌రింత ఉన్న‌త స్థానికి చేరుకున్నాడు. ప్ర‌మోష‌న్ వ‌చ్చింది, జీవ‌తం పెరిగింది.

55
అసలు నిజమైన సంతోషం

కొన్ని రోజులకు రాముకు అస‌లు విష‌యం అర్థ‌మైంది. ఇతరుల్ని చూసి బాధపడటం తగ్గిన రోజు నుంచే తన జీవితం నెమ్మదిగా సరిదిద్దుకుంటోందని గుర్తించాడు. ఎదుటివాళ్ల సంతోషం మన బాధకు కారణం కాదు. మన పోలికలే మన శత్రువు. మన జీవితం మనదే, మన వేగం మనదే, మన ప్రయాణం మనదే. ఇతరుల్ని చూసి కాదు, మనలోని మెరుగుదల చూసి, సంతోషపడగలిగిన రోజే నిజమైన విజయం అనే విష‌యం రాముకు అర్థ‌మైంది.

Read more Photos on
click me!

Recommended Stories