
భారతదేశ ఆధ్యాత్మికంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శేషాచలం కొండల్లో కొలువైన ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీ మహావిష్ణువు స్వరూపమైన తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత, మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి (అంబాబాయి) అమ్మవారిని దర్శించుకుంటేనే యాత్ర పూర్తి అవుతుందని భక్తుల నమ్మకం. కొల్హాపూర్‌లో నల్లరాతిపై చెక్కిన 3 అడుగుల ఎత్తైన మహాలక్ష్మి విగ్రహం ప్రాచీన శిల్పకళతో అలరారుతోంది.
ఈ నేపథ్యంలో భక్తుల కోసం భారతీయ రైల్వేకి చెందిన ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక ప్రత్యేకమైన ప్రయాణ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. "తిరుపతి విత్ కొల్హాపూర్ మహాలక్ష్మి" (Tirupati with Kolhapur Mahalaxmi) పేరుతో ఈ టూర్ ప్యాకేజీని రూపొందించారు.
ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగుతుంది. ఇది ప్రతి వారం బుధవారం అందుబాటులో ఉంటుంది. 3AC ఎకానమీ విభాగంలో 8 సీట్లు, నాన్-ఏసీ స్లీపర్ (SL) విభాగంలో 8 సీట్లు కేటాయించారు. ఈ ప్యాకేజీ ముంబై నుంచి ప్రారంభమై తిరుపతి, పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి, కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాలను కవర్ చేస్తూ తిరిగి ముంబై చేరుకుంటుంది.
రైలు సమయాలు ఇవే
• రైలు నం. 12163 (LTT-MAS ఎక్స్‌ప్రెస్): లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (LTT) నుండి సాయంత్రం 18:30 గంటలకు బయలుదేరుతుంది. ఇది థానే (18:45), కల్యాణ్ (19:10) లలో ఆగుతూ, మరుసటి రోజు మధ్యాహ్నం 12:55 (రేణిగుంటకు 13:18) గంటలకు చేరుకుంటుంది.
• రైలు నం. 17415 (హరిప్రియ ఎక్స్‌ప్రెస్): తిరుపతి నుంచి రాత్రి 21:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 16:45 గంటలకు కొల్హాపూర్ (KOP) చేరుకుంటుంది.
• రైలు నం. 17412 (మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్): కొల్హాపూర్ నుంచి రాత్రి 20:50 గంటలకు బయలుదేరి, పూణే (03:30), కల్యాణ్ (06:07) మీదుగా ఉదయం 07:25 గంటలకు ముంబై CSMT చేరుకుంటుంది.
• డే 1: ఎల్‌టిటి (LTT) స్టేషన్ నుంచి రాత్రి 18:40 గంటలకు రైలు నం. 12163 లో బయలుదేరుతారు. రాత్రికి రైలు ప్రయాణం ఉంటుంది.
• డే 2: మధ్యాహ్నం 13:18 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి హోటల్‌కు వెళ్లి చెక్-ఇన్ అవుతారు. ఆ తర్వాత తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. రాత్రి తిరుపతిలోని హోటల్‌లో భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
• డే 3: ఉదయం టిఫిన్ చేసిన తర్వాత హోటల్ చెక్-ఔట్ అయి, రోడ్డు మార్గంలో శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్తారు. అనంతరం రాత్రి 21:30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి కొల్హాపూర్ వెళ్లే రైలు నం. 17415 ఎక్కుతారు.
• డే 4: సాయంత్రం 16:45 గంటలకు కొల్హాపూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి సొంత ఖర్చులతో 1 కిలోమీటరు దూరంలో ఉన్న హోటల్‌కు వెళ్తారు. ఫ్రెష్-అప్ అయిన తర్వాత హోటల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సొంతంగా దర్శించుకుంటారు. రాత్రికి హోటల్‌లో భోజనం, బస ఉంటాయి.
• డే 5: ఉదయం టిఫిన్ చేసిన తర్వాత హోటల్ చెక్-ఔట్ అవుతారు. ఆ తర్వాత కొల్హాపూర్ సైట్‌సీయింగ్‌లో భాగంగా జ్యోతిబా ఆలయం, న్యూ ప్యాలెస్ మ్యూజియం, కనేరి మఠం సందర్శిస్తారు. రాత్రి 20:50 గంటలకు ఛత్రపతి షాహు మహారాజ్ టెర్మినస్ (కొల్హాపూర్) లో రైలు నం. 17412 ఎక్కుతారు.
• డే 6: ఉదయం 07:25 గంటలకు ముంబై CSMT స్టేషన్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీ ధరలు ప్రయాణికులు ఎంచుకునే కేటగిరీ (3AC ఎకానమీ లేదా స్లీపర్), రూమ్‌లో ఉండే వ్యక్తుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి.
3AC ఎకానమీ కేటగిరీ: ఒక్కరే ప్రయాణిస్తే టికెట్ ధర ₹29,550గా నిర్ణయించారు. ఇద్దరు కలిసి ప్రయాణిస్తే (ట్విన్ షేరింగ్) ఒక్కొక్కరికి ₹18,350, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే (ట్రిపుల్ షేరింగ్) ఒక్కొక్కరికి ₹15,150 ఛార్జ్ చేస్తారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల పిల్లల విషయానికొస్తే.. ఎక్స్‌ట్రా బెడ్‌తో రూ. 13,650, బెడ్ లేకపోతే రూ. 12,950 చెల్లించాల్సి ఉంటుంది.
స్లీపర్ (స్టాండర్డ్) కేటగిరీ: ఒక్కరే ప్రయాణిస్తే ప్యాకేజీ ధర ₹26,300 కాగా, ఇద్దరు ప్రయాణికులకు ఒక్కొక్కరికి ₹15,100, ముగ్గురికి అయితే ఒక్కొక్కరికి ₹11,900 చొప్పున పడుతుంది. 5 నుండి 11 ఏళ్ల లోపు పిల్లలకు బెడ్ కావాలంటే రూ. 10,400, బెడ్ అవసరం లేకపోతే రూ. 9,700 ఛార్జీ ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్, బెడ్ ఉన్న పిల్లలకు ఎక్స్‌ట్రా మ్యాట్రెస్ అందిస్తారు.
ప్యాకేజీలో లభించే సేవలు
• అప్ అండ్ డౌన్ రైలు టికెట్లు (3AC ఎకానమీ లేదా స్లీపర్).
• షేరింగ్ ఏసీ వాహనంలో లోకల్ ట్రాన్స్‌ఫర్లు, సైట్‌సీయింగ్.
• తిరుపతిలో 1 రాత్రి, కొల్హాపూర్‌లో 1 రాత్రి డీలక్స్ హోటల్ వసతి.
• భోజనాలు: డే 2 రాత్రి భోజనం, డే 3 ఉదయం టిఫిన్, డే 4 రాత్రి భోజనం, డే 5 ఉదయం టిఫిన్.
• ట్రావెల్ ఇన్సూరెన్స్, జీఎస్టీ.
• క్యాన్సిలేషన్ ఛార్జీలు: ప్రయాణ తేదీకి 15 రోజుల కంటే ముందు రద్దు చేసుకుంటే ఒకరికి ₹250 మినహాయించుకుంటారు. 8-14 రోజుల మధ్య రద్దు చేసుకుంటే 25%, 4-7 రోజుల మధ్య రద్దు చేసుకుంటే 50% రుసుము పడుతుంది. ప్రయాణానికి 4 రోజుల కంటే తక్కువ సమయం ఉంటే పైసా రీఫండ్ కాదని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.
• పాస్‌పోర్ట్ / ఐడీ ప్రూఫ్: ప్రయాణ సమయంలో అసలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. క్యాష్ ద్వారా ₹25,000 కంటే ఎక్కువ చెల్లిస్తే పాన్ కార్డ్ కాపీ తప్పనిసరి.
• సీనియర్ సిటిజన్లు: 65 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా చిన్నవయస్సు ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించాలి. ప్రయాణానికి ముందు మెడికల్ చెకప్ చేయించుకోవాలి.
• బుకింగ్ విధానం: ఈ టూర్ ప్యాకేజీ బుకింగ్ లేదా రద్దు ప్రక్రియ అంతా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ [www.irctctourism.com](https://www.irctctourism.com) ద్వారా మాత్రమే చేసుకోవాలి. వివరాల కోసం ఐఆర్‌సీటీసీ ముంబై, పూణే, కొల్హాపూర్, నాగ్‌పూర్ ఆఫీసులను సంప్రదించవచ్చు లేదా 8287931886 నంబర్‌కు కాల్ / వాట్సాప్ చేయవచ్చు.