ఈ టూర్ ప్యాకేజీ ఎంచుకున్న ప్రయాణికులకు రైలు ప్రయాణం, రాత్రి బస, వాష్ అండ్ చేంజ్ కోసం వసతి, రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఎకానమీ క్లాస్‌లో నాన్-ఏసీ వసతి, నాన్-ఏసీ వాహనాలు ఇస్తారు. స్టాండర్డ్, కంఫర్ట్ క్లాస్‌లలో ఏసీ రూమ్‌లు, తగిన సదుపాయాలు అందిస్తారు.
ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ప్రెషెట్ మెనూ ప్రకారం అందిస్తారు. అంతేకాకుండా ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో భద్రత, టూర్ మేనేజర్ల సేవలు, అన్ని వర్తింపజేసే పన్నులు ఈ ప్యాకేజీ కింద లభిస్తాయని ఐఆర్సీటీసీ తెలిపింది. ఆలయాల దర్శన రుసుములు, బోటింగ్, వ్యక్తిగత ఖర్చులు ఇందులో ఉండవు.