IRCTC Divya Dakshin Yatra: ఒకే టిక్కెట్ తో అరుణాచలం, రామేశ్వరం సహా 7 దివ్యక్షేత్రాల దర్శనం

Published : Oct 03, 2026, 09:06 AM IST

IRCTC Divya Dakshin Yatra: ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ రైలు ద్వారా అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవచ్చు. అక్టోబర్ 6 నుంచి భారత్ గౌరవ్ రైలు సిద్ధంగా ఉంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.

PREV
15
అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి యాత్ర.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్

దక్షిణ భారతదేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. "దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం" పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించబోతోంది. (టూర్ కోడ్: SCZBG-66).

ఈ ప్యాకేజీ ద్వారా కేవలం 8 రాత్రులు, 9 రోజుల వ్యవధిలో దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 7 పుణ్యక్షేత్రాలను సులభంగా దర్శించుకోవచ్చు. ఈ యాత్ర అక్టోబర్ 6న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్ర ద్వారా దాదాపు 705 మంది భక్తులు ప్రయాణించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది.

25
ఈ యాత్రలో కవర్ అయ్యే దివ్యక్షేత్రాలు ఇవే

ఈ ప్రత్యేక రైలు యాత్రలో భాగంగా భక్తులు ఏడు ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించవచ్చు.

• తిరువణ్ణామలై (అరుణాచలం): ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయ దర్శనం.

• చిదంబరం: నటరాజ స్వామి దేవాలయం.

• తిరుచిరాపల్లి (శ్రీరంగం): శ్రీ రంగనాథస్వామి ఆలయం.

• తంజావూర్: బృహదీశ్వర ఆలయం.

• రామేశ్వరం: రామనాథస్వామి దేవాలయం, స్థానిక ఆలయాలు.

• మధురై: ప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయం.

• కన్యాకుమారి: వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్, కుమారి అమ్మన్ దేవాలయం.

35
ఎక్కడెక్కడ బోర్డింగ్, డి-బోర్డింగ్ సదుపాయం ఉంది?

తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్థం రెండు రాష్ట్రాల్లోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఎక్కడానికి, దిగడానికి ఐఆర్‌సీటీసీ అవకాశం కల్పించింది.

• బోర్డింగ్ స్టేషన్లు: సికింద్రాబాద్, చార్లపల్లి, జన్‌గాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట.

• డి-బోర్డింగ్ స్టేషన్లు: తిరుగు ప్రయాణంలో కూడా రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, చార్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లలో ప్రయాణికులు దిగవచ్చు.

45
ప్యాకేజీ ధరలు, లభించే సదుపాయాలు

భారత్ గౌరవ్ పథకం కింద కేంద్ర రైల్వే శాఖ దాదాపు 33% రాయితీ అందిస్తోంది, ఈ రాయితీతో కలుపుకుని ఐఆర్‌సీటీసీ మూడు కేటగిరీలలో ప్యాకేజీ ధరలను ఖరారు చేసింది. ఎకానమీ కేటగిరీ (స్లీపర్ క్లాస్ ప్రయాణం) లో పెద్దలకు రూ. 15,800, 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు రూ. 14,800 గా నిర్ణయించారు. స్టాండర్డ్ కేటగిరీ (3AC ప్రయాణం) లో పెద్దలకు రూ. 23,200, పిల్లలకు రూ. 22,000 అలాగే కంఫర్ట్ కేటగిరీ (2AC ప్రయాణం) లో పెద్దలకు రూ. 29,600, పిల్లలకు రూ. 28,100 ధరగా ఉంది.

టికెట్ ధరలోనే లభించే సదుపాయాలు ఇవే

• రైలు ప్రయాణం, బస సదుపాయం (ఎకానమీ వారికి నాన్-ఏసీ, స్టాండర్డ్/కంఫర్ట్ వారికి ఏసీ రూమ్‌లు).

• ప్రయాణ సమయాల్లో ఉదయం టీ, ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కేవలం శాకాహారం మాత్రమే అందిస్తారు.

• స్థానిక సందర్శనల కోసం ప్రయాణ రవాణా సౌకర్యం.

• ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో సెక్యూరిటీ.

• సహాయం చేయడానికి ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారు.

55
నియమ నిబంధనలు.. బుకింగ్ వివరాలు ఇవే

• ముఖ్య నిబంధనలు: ప్రయాణికులు తప్పనిసరిగా ఓటర్ ఐడీ లేదా గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలి. ఆలయ ప్రవేశ రుసుములు, బోటింగ్, గైడ్ ఛార్జీలు ప్యాకేజీలో కలవవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాత్రకు ఎల్‌టీసీ సదుపాయాన్ని పొందే వెసులుబాటు ఉంది.

• క్యాన్సిలేషన్ పాలసీ: యాత్ర ప్రారంభానికి 15 రోజుల ముందు రద్దు చేసుకుంటే ఒక్కరికి రూ. 250 మినహాయిస్తారు. 8 నుండి 14 రోజుల ముందు రద్దు చేస్తే 25%, 4 నుండి 7 రోజుల ముందు రద్దు చేస్తే 50% చొప్పున కోత విధిస్తారు. 4 రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రీఫండ్ లభించదు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ నంబర్లు: 040-27702407 / 9701360701, 8287932228, 8287932229. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా బుకింగ్స్ చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories