Lake: సముద్రం పైన తేలాడే అద్భుత సరస్సు.. కానీ, రెండూ ఎప్పటికీ కలవవు.. ఈ వింత ఎక్కడ ఉందో తెలుసా?

Published : Nov 18, 2026, 01:10 PM IST

Lake: కింద భీకరమైన సముద్రం... దానిపైన వందల అడుగుల ఎత్తులో గాల్లో వేలాడుతున్నట్లు కనిపించే మంచి నీటి సరస్సు. ఇలాంటి అద్భుతం ఒకటి ఉంది. నిజంగానే సముద్రంపై సరస్సు తేలుతుందా? సరస్సు నీళ్లు సముద్రంలో ఎందుకు కలవవు?

PREV
13
సముద్రంపై మంచినీటి సరస్సు..

ప్రకృతి సృష్టించే కొన్ని వింతలు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. అలాంటి అద్భుతమైన దృశ్యం ఒకటి చూడాలి అంటే.. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫారో దీవులకు వెళ్లాల్సిందే. అక్కడ ఉన్న సోర్వాగ్స్ వాట్స్ అనే సరస్సును చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కింద పెద్ద సముద్రం.. దానిపైన వందల అడుగుల ఎత్తులో గాల్లో తేలుతున్నట్లుగా మరో మంచి నీటి సరస్సు కనిపిస్తుంది. ఇంతకీ ఇదది నిజంగా సముద్రంపై తేలుతుందా? దీని వెనక మిస్టరీ ఏంటి?

23
గాలిలో తేలుతున్నట్లు ఎలా కనిపిస్తుంది..?

ఫోటోలలో ఈ సరస్సును చూసినప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం కంటే వందల మీటర్ల ఎత్తులో గాల్లో వేలాడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ, అసలు నిజం ఏంటంటే.. ఇది కేవలం ఒక ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే. అంటే మన కంటికి అలా కనిపిస్తుంది. ఈ సరస్సు సముద్ర మట్టానికి 30 నుంచి 40 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుంది.

సరస్సు అంచున ఉన్న ట్రెలినిఫా అనే నిటారైన కొండచరియలు సముద్ర మట్టం కంటే 142 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఆ కొండ ఎత్తు పైనుంచి చూసినప్పుడు..సరస్సు, సముద్రం మధ్య ఉన్న ఆ 30 మీటర్ల ఎత్తు తేడా కనిపించదు. సరస్సు ఏకంగా సముద్రంపైన తేలుతున్నట్లు అద్భుతంగా కనపడుతుంది.

33
సరస్సు లో నీళ్లు సముద్రంలోకి ఎందుకు కలిసిపోవు..?

సముద్రానికి ఇంత దగ్గరగా, పైగా ఎత్తులో ఉన్నా ఈ మంచినీటి సరస్సులోని నీరంతా సముద్రంలోకి ఎందుకు పడిపోవడం లేదు అనే సందేహం రావచ్చు. సరస్సుకు, సముద్రానికి మధ్య ఒక సహజమైన, పెద్ద రాయి అడ్డుగోడలా నిలిచి నీటిని ఆపుతోంది. అయితే, వర్షాలు ఎక్కువగా కురిసి సరస్సులో నీటి మట్టం పెరిగినప్పుడు, అదనపు నీరు సరస్సు చివర ఉండే బోస్డలాఫోస్సర్ అనే అందమైన జలపాతం రూపంలో 30 మీటర్ల ఎత్తు నుంచి నేరుగా అట్లాంటిక్ మహా సముద్రంలోకి దూకుతుంది.

ఈ సరస్సు గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు...

సుమారు 3.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఫారో దీవుల్లోనే ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం ఈ సరస్సు పక్కనే ఒక విమానాశ్రయాన్ని నిర్మించింది (ప్రస్తుతం అదే వాగర్ ఎయిర్‌పోర్ట్). అంతేకాదు, సీప్లేన్లు (నీటిపై దిగే విమానాలు) ల్యాండ్ అవ్వడానికి ఈ సరస్సును ఉపయోగించారు. స్థానిక కథల ప్రకారం, ఈ సరస్సులో నిక్స్ అనే మాయా గుర్రం నివసిస్తుందని, అది మనుషులను ఆకర్షించి నీటిలోకి లాక్కుపోతుందని ఇక్కడి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories