Vande Bharat Train cost: వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ మెల్ల మెల్లగా దేశమంతటా ప్రవేశపెడుతోంది. అలాగే మరోపక్క హైడ్రోజన్ రైలును కూడా అమల్లోకి తెచ్చింది. అసలు ఒక వందేభారత్ రైలు తయారీకి ఎంతో ఖర్చవుతుందో తెలుసా?
అతిపెద్ద రవణా వ్యవస్త భారతీయ రైల్వే. ఇది వేగవంతమైన ప్రయాణానికే కాదు.. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ట్రైన్లను నడుపుతోంది. అలాగే పర్యావరణహిత ఇంధనంతో నడిచే హైడ్రోజన్ రైలును కూడా తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇవి రెండూ రైళ్లే అయినప్పటికీ.. వీటి సాంకేతికత, వేగం వేరువేరుగా ఉంటాయి.ఈ రెండూ కూడా ఆధునిక రైళ్లే. వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకోండి. అలాగే అవి తయారు చేయడానికి ఎంత ఖర్చువుతోందో కూడా ఇక్కడ ఇచ్చాము.
23
వందే భారత్ ఎలా పనిచేస్తుంది?
ఈ రెండు టైన్ల మధ్య ముఖ్యమైన తేడా.. వందే భారత్ ఎలక్ట్రిక్ ఓవర్‌హెడ్ లైన్ల ద్వారా నేరుగా విద్యుత్ తీసుకుని గంటకు 160 నుండి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కానీ హైడ్రోజన్ రైలు తనలోని ఫ్యూయల్ సెల్ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో స్వయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని నడుస్తుంది. దీని వేగం గంటకు 75 నుండి 120 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. వందే భారత్ ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల మధ్య సుదూర ప్రయాణాల కోసం వినియోగిస్తారు. ఒక హైడ్రోజన్ రైలును విద్యుదీకరణ సరిగా లేని కొండ ప్రాంతాలు, హెరిటేజ్ మార్గాలు, చిన్న చిన్న విద్యుత్ లేని రూట్లలో ప్రయాణం కోసం వినియోగిస్తున్నారు.
33
రైళ్ల తయారీకి అయ్యే ఖర్చు
ఇక ప్రయాణికుల వసతులు, భద్రత, ఖర్చుల విషయానికి గురంచి చెప్పుకోవాలనుకుంటే.. వందే భారత్ పూర్తిగా ఏసీ సీటింగ్ తో వస్తుంది. కవచ్ రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుంది. ఈ ట్రైన్ తయారీకి సుమారు రూ. 97 కోట్లు ఖర్చవుతుంది. మరోవైపు హైడ్రోజన్ అత్యంత మండే స్వభావం గల గ్యాస్ కావడంతో, హైడ్రోజన్ రైలులో గ్యాస్ లీకేజ్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ షట్-ఆఫ్ వంటి సురక్షిత ఫీచర్లను అమర్చారు. ఈ రైలు తయారీకి ఏకంగా 111.83 కోట్లు ఖర్చువుతుంది. వందే భారత్ మన వేగానికి, విలాసవంతమైన ప్రయాణానికి అవసరం. హైడ్రోజన్ రైలు కేవలం నీటి ఆవిరిని మాత్రమే పొగగా వదులుతూ పర్యావరణ హితంగా పనిచేస్తుంది.