Petrol Bunk: ఒక పెట్రోల్ బంక్ నెలకు ఎంత సంపాదిస్తుంది? కోట్లలో లాభాలు నిజమేనా?

Published : Nov 19, 2026, 02:00 PM IST

బయట నుంచి చూస్తే పెట్రోల్ బంక్ నడిపేవారికి ప్రతి నెలా భారీగా లాభాలు వస్తాయా? పెట్టుబడి, కమిషన్, నిర్మాణం, నిర్వహణ ఖర్చులు, బ్యాంకు ఈఎంఐ, కష్టమర్లు ఎదుర్కొనే మోసాల కోణంలో చూస్తే అసలు చిత్రం వేరేలా ఉంటుంది. ఒక పెట్రోల్ బంక్ నెలకు ఎంత సంపాదిస్తుంది?

PREV
13
పెట్రోల్ బంక్ తో కోట్లలో లాభం వస్తుందా?

పెట్రోల్ బంక్ అంటే చాలు కోట్లలో పెట్టుబడి.. అంతకు మించి లాభాలు వస్తుంటాయని అనుకుంటుంటారు. అందులో నిజం ఎంత? అసలు ఒక పెట్రోల్ బంక్ నెలకు ఎంత సంపాదిస్తుంది? అన్ని బంక్ లకు ఆదాయం ఒకేలా ఉంటాయా? అంటుంటారు. ప్రారంభించాలంటే కేవలం చేతిలో పెట్టుబడి ఉండటం మాత్రమే సరిపోదు; ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి సంస్థల ప్రకటనలకు దరఖాస్తు చేసి ఎంపిక కావాల్సి ఉంటుంది. స్థలం, సెక్యూరిటీ డిపాజిట్, లైసెన్సులు, భూగర్భ ట్యాంకులు, డిస్పెన్సింగ్ యూనిట్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు వంటి వాటికి కలిపి సుమారు ₹1 కోటి నుంచి ₹3 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది.

కమిషన్ విధానం, ధరల ప్రభావం

పెట్రోల్ బంక్ యజమాని స్వయంగా ఇంధన ధరలను నిర్ణయించలేరు. చమురు కంపెనీల నిర్ణయాలు, కేంద్ర-రాష్ట్ర పన్నుల ఆధారంగా ధరలు మారుతుంటాయి. డీలర్‌కు లీటర్‌కు నిర్ణీత కమిషన్ లభిస్తుంది (ఉదాహరణకు ₹1,000 ఇంధనం కొంటే సుమారు ₹40 కమిషన్ వచ్చే అవకాశం ఉంది). ధర పెరిగితే కమిషన్ అదే స్థాయిలో పెరగదు. లీటర్‌కు ₹7.50 పెరిగినా, డీలర్ కమిషన్ పెద్దగా పెరగదు.ట్యాంకర్ లోడ్ కోసం ముందుగానే పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, ఇంధన ధరలు పెరిగినప్పుడు ప్రతి ట్యాంకర్‌కు అదనపు పెట్టుబడి అవసరం అవుతుంది.

23
చేతికి మిగిలేది ఎంత?

తక్కువ మార్జిన్ ఉన్న ఈ రంగంలో నెలకు ఎన్ని లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారనేదే ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. ఒక సాధారణ పట్టణ బంక్ నెలకు 1,70,000 లీటర్ల ఇంధనం (ఉదాహరణకు 40% పెట్రోల్, 60% డీజిల్) అమ్మితే సుమారు ₹1.75 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచన. అయితే ఆ మొత్తం యజమాని ఆదాయం కాదు. ఇంధన కొనుగోలు, పన్నుల తర్వాత సుమారు ₹6,07,000 వరకు కమిషన్ వస్తుందని అంచనా.

సిబ్బంది జీతాలు (10 మందికి సుమారు ₹1,60,000), విద్యుత్-మెయింటెనెన్స్ (₹50,000), ఆయిల్ కంపెనీ సంబంధిత ఇతర చార్జీలు (₹30,000), ఆవిరి నష్టం / ఎవాపరేషన్ లాస్ (₹25,000), రుణాల వడ్డీ (₹17,000), పంపు మరమ్మతులు-ఆడిటర్ ఫీజులు-ఇతర ఖర్చులు (₹40,000) వంటివి తీసేస్తే మిగిలేది సుమారు ₹2,65,000. పెట్టుబడిలో రుణం తీసుకుని ( ఉదాహరణ ప్రకారం సుమారు ₹1.12 కోట్ల రుణానికి 10% వడ్డీతో 10 ఏళ్లకు దాదాపు ₹1.5 లక్షల ఈఎంఐ) చెల్లించాల్సి వస్తే, చేతికి మిగిలే నికర మొత్తం సుమారు ₹1,16,000 వద్దే నిలుస్తుంది.

రద్దీ తక్కువగా ఉండే చిన్న ప్రాంతాలతో పోలిస్తే, ఎక్కువ డీజిల్ లారీలు వచ్చే హైవే బంకులకు ఆదాయం ఎక్కువగా (సుమారు ₹3 లక్షల నుంచి ₹4 లక్షల వరకు) ఉండొచ్చు. అలాగే ఈవీ, సీఎన్‌జీ వాహనాల పెరుగుదల నేపథ్యంలో కన్వీనియన్స్ స్టోర్లు, కేఫ్‌లు, కార్ వాష్, ఈవీ ఛార్జింగ్ వంటి అనుబంధ సేవల వైపు బంకులు దృష్టి పెడుతున్నాయి. రుణం తీరిపోయిన తర్వాత ఈఎంఐ భారం తగ్గి దీర్ఘకాలంలో ఆదాయం మెరుగుపడుతుంది.

33
మోసాలు, ఇథనాల్ బ్లెండింగ్, కస్టమర్ హక్కులు

అయితే కొంత మంది మాత్రమే.. అక్రమార్కులు డిస్పెన్సింగ్ యూనిట్లలో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి లీటర్‌కు 970 మిల్లీలీటర్లు మాత్రమే వచ్చేలా మోసం చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే నాఫ్తా లేదా కిరోసిన్ వంటి వాటితో కల్తీ జరిగే ప్రమాదం ఉంటుందని సమాచారం. మరోవైపు, ముడిచమురు దిగుమతులు తగ్గించడం, రైతులకు ఆదాయం కల్పించడం లక్ష్యంగా భారత్‌లో పెట్రోల్‌తో 20% ఇథనాల్ కలిపే (E20) విధానం అమలవుతోంది; పాత వాహనాల విషయంలో కొందరు మైలేజ్ తగ్గుతుందని చెబుతుంటారు.

మోసపోకుండా ఉండటానికి జాగ్రత్తలు:

ఇంధనం పోయించే ముందు మీటర్ సున్నా (0) వద్ద ఉందో లేదో గమనించాలి. పరిమాణంపై అనుమానం ఉంటే సీల్ వేసిన 5 లీటర్ల కొలత క్యాన్‌లో పోసి చూపించమని అడగవచ్చు.

నాణ్యతపై సందేహం ఉంటే ఫిల్టర్ పేపర్ టెస్ట్, అలాగే డెన్సిటీ రిజిస్టర్ తనిఖీ చేయించుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది.

గమనిక:

ఈ లెక్కలు అన్ని పెట్రోల్ బంక్ లకు ఒకే విధంగా ఉండాలని లేదు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. పెట్రోల్ బంక్ ఉన్న ప్లేస్, రద్ది, ఇతర విషయాల ఆధారంగా.. బంక్ బంక్ కు ఆదాయం, వ్యయం మారుతుంటుంది. కొంత మందికి లోన్లు ఉండకపోవచ్చు.. ఖర్చులు తక్కువగా ఉండొచ్చు. కొంత మందికి ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. గమనించగలరు.

Read more Photos on
click me!

Recommended Stories