Hyderabad Temple : అద్దంలో మాత్రమే దర్శనమిచ్చే దేవుడు.. హైదరాబాద్ లో వింత ఆలయం

Published : Nov 19, 2026, 01:30 PM IST

అద్దం ద్వారా మాత్రమే ప్రతిబింబ రూపంలో దేవుడు దర్శనమిచ్చే వింత ఆలయం ఒకటి హైదరాబాద్ ఉంది. ఈ ఆలయం ప్రత్యకతలు, ఆసక్తికర విషయాల గురించి ఇక్క డ తెలుసుకుందాం.

PREV
14
ఈ ఆలయం చాలా స్పెషల్

Hyderabad : భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి... ఒక్కో ఆలయంలో ఒక్కో రూపంలో దేవుళ్లు కొలువై ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి పట్టణం, గ్రామంలో పక్కా ఒక్క ఆలయమైనా ఉంటుంది. ఏ దేవాలయంలో అయినా గర్భగుడిలోని మూలవిరాట్ ను కనులారా చూస్తేనే దర్శనం జరిగినట్లు... భక్తులు ఇదే కోరుకుంటారు.

అయితే తమిళనాడులోని చిదంబరం వంటి కొన్ని ప్రత్యేకమైన ఆలయాలుంటాయి... మూలవిరాట్ లేకుండానే పూజలు జరుగుతాయి. ఇంకొన్ని ఆలయాలకు మరో రకమైన ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. కానీ గర్భగుడిలో మూలవిరాట్ ఉన్నా మనం నేరుగా దర్శనం చేసుకోలేని ప్రత్యేక ఆలయం ఒకటి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మరి ఆ ఆలయం ఏది, ఎక్కడుంది? దేవుడిని నేరుగా ఎందుకు దర్శించుకోలేం? స్వామిని చూడాలంటే ఏం చేయాలి?

24
హైదరాబాద్ లో అద్భుత ఆలయం

హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిధిలో ఓ ప్రత్యేక ఆలయం ఉంది. ప్రధాన రహదారి పక్కనే ఉండే రంగదాముని చెరువు ఒడ్డునే శ్రీ గోదా రంగనాయక స్వామి దేవస్థానం ఉంటుంది. ఐడిఎల్ లేక్ రోడ్డులో వెళుతుంటే ఈ ఆలయం కనిపిస్తుంది.

చూడడానికి చిన్న ఆలయమే అయినా చరిత్ర కలిగిన ఆలయం. ఈ ప్రాంతంలో రుషులు, మునులు ద్యానం చేసినట్లు చెబుతారు. గర్భగుడిలో స్వామివారు స్వయంభు వెలిశారు... ఓ రాయి అంచున రంగనాయక స్వామి మూటవిరాట్ ఉంటుంది. అయితే ఈ స్వామిని నేరుగా దర్శించుకోలేం... గర్భగుడిలో అమర్చిన అద్దంలో మాత్రమే స్వామి ప్రతిబింబం కనిపిస్తుంది. ఇలా అద్దం ద్వారా దైవదర్శనం చేసుకునే ఏకైక ఆలయం రంగనాయక స్వామి ఆలయం... అందుకే ఈ గుడి ప్రత్యేకంగా నిలిచింది.

34
సంకల్ప ముద్రలో స్వామి దర్శనం

అద్దంలో రంగనాయక స్వామి ప్రతిబింబాన్ని చూసి భక్తులు మైమరచిపోతుంటారు. స్వామివారు సంకల్ప ముద్రలో దర్శనమమిస్తారు. ఆయన పాదాలవద్ద లక్ష్మీదేవి, గరుడ ఆళ్వార్ దర్శనమిస్తారు. గర్భగుడిలో మూలవిరాట్ ను ప్రతిబింబించే అద్దంతో పాటు ఉత్సవ విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలు కూడా ఉంటాయి.

కూకట్ పల్లిలోని శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయం మరో ప్రత్యేకతను కలిగివుంది. తిరుమలతో పాటు చాలా దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ప్రతిరోజు ఉత్తరద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకోవచ్చు.

44
టెంపుల్ టైమింగ్స్..

సోమవారం నుండి గురువారం వరకు : తెల్లవారుజామున 5.30 గంటలకే రంగనాయక స్వామి ఆలయం తెరుస్తారు. ఉదయం 11 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం కొద్దిసేపు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల ఆలయాన్ని తెరిచి రాత్రి 8 గంటల తర్వాత మూసివేస్తారు.

ఇక వీకెండ్ లో భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి ఎక్కువసేపు ఆలయాన్ని తెరిచివుంచుతారు. ప్రతి శుక్ర, శనివారాలు తెల్లవారుజామున 5.30 గంటలకు తెరిచి మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం ఎప్పటిలాగే 5 గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories