Gold: తులం బంగారం అంటే ఎన్ని గ్రాములు? పది గ్రాములా? లేక అంతకన్నా ఎక్కువ?

Published : Oct 20, 2026, 08:51 AM IST

Gold: బంగారాన్ని తులాల మీద లెక్కిస్తారు. కానీ ఒక తులం ఎన్ని గ్రాముల బంగారమో మాత్రం చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. అసలు తులం బంగారం అంటే ఎన్ని గ్రాములు? అనే విషయాన్ని తెలుసుకోండి.

PREV
13
తులం బంగారం ఎన్ని గ్రాములు?

బంగారం కొనేటప్పుడు తులం లెక్కపై చాలామందికి అనుమానాలు వస్తుంటాయి. తులం అంటే అసలు ఎంత? 10 గ్రాములా లేక అంత కన్నా ఎక్కువా? అనే సందేహం వస్తుంది. తులం బంగారం బరువు వెనుక చారిత్రక, వ్యాపార కారణాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొలవడానికి తులం అనే పదాన్ని వాడేవారు. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పులు ఈ రెండు వేర్వేరు కొలతలకు దారితీశాయి.

23
తులం బంగారమంటే...

చారిత్రక ప్రామాణికం ప్రకారం చూస్తే ఒక తులం బరువు కచ్చితంగా 11.6638 గ్రాములు ఉంటుంది. బ్రిటిష్ పాలన కాలంలో ప్రవేశపెట్టిన ఒక రూపాయి వెండి నాణెం బరువును ప్రామాణికంగా తీసుకుని ఒక తులం సమానం 11.66 గ్రాములుగా నిర్ధారించారు. మన తాతల కాలం నాటి పాత పద్ధతిలో అలాగే ఆయుర్వేద ఔషధాల తయారీలో ఇప్పటికీ 11.66 గ్రాములనే అసలైన తులం బరువుగా పరిగణిస్తారు. అంతర్జాతీయ ప్రామాణిక కొలతల్లో కూడా సంప్రదాయ తులం అంటే 11.66 గ్రాములుగానే నమోదై ఉంది.

33
మెట్రిక్ విధానం వచ్చాక...

భారతదేశం 1956లో మెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చిన తర్వాత లెక్కలు సులభతరం చేయడానికి మార్కెట్లో మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలకు, వ్యాపారులకు దశాంశ పద్ధతిలో లెక్కించడం సులువుగా ఉండాలనే ఉద్దేశంతో నగల దుకాణాల్లో ఒక తులం బరువును 10 గ్రాములుగా మార్చారు. ప్రస్తుతం వార్తల్లో చూసే పసిడి ధరలు, బులియన్ మార్కెట్ రేట్లు, నగల వ్యాపారాలు అన్నీ 10 గ్రాముల ప్రాతిపదికనే జరుగుతున్నాయి. ప్రాచీన లేదా శాస్త్రీయ పద్ధతిలో 11.66 గ్రాములు అసలైన తులం అయినప్పటికీ, నేటి ఆధునిక మార్కెట్ వ్యవహారాల్లో 10 గ్రాములనే తులం కింద లెక్కగడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories