Garlic Capital: వెల్లుల్లికి కేరాఫ్ అడ్రస్ ఇదే, ‘గార్లిక్ సిటీ ఆఫ్ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

Published : Oct 20, 2026, 08:05 AM IST

Garlic Capital: మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. మరి, మన దేశంలో వెల్లుల్లికి అంటూ స్పెషల్ గా సిటీ ఉందని తెలుసా? దేశ వ్యాప్తంగా వెల్లుల్లి అక్కడే పండుతుందా?

PREV
13
వెల్లుల్లికి రాజధాని ఏది?

మనం ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు వంట గదిలో రకరకాల పదార్థాలను ఉపయోగిస్తాం. వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. చాలా రకాల వంటలకు కమ్మని వాసన, రుచి అందించడంలో వెల్లుల్లి ముందు వరసలో ఉంటుంది. పచ్చళ్లు, తాలింపులు, కారాలు ఏమైనా సరే.. రెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తే చాలు... ఆ వంట రుచే మారిపోతుంది. ఆ కమ్మని వాసన నాలుగు ఇళ్ల వరకు వ్యాపిస్తుంది. మన దేశ వ్యాప్తంగా వెల్లుల్లి వాడుతూనే ఉంటాం. కానీ, వెల్లుల్లికి అంటూ.. ప్రత్యేకంగా ఒక సిటీ ఉందని తెలుసా?

మధ్యప్రదేశ్ లోని ఒక ప్రత్యేక ప్రాంతం వెల్లుల్లి పంటకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ పంట పండించడంలోనూ, వ్యాపారంలోనూ దేశంలోనే ఈ ప్రదేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి, ఆ ప్రాంతం ఏంటి? అక్కడి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం...

23
గార్లిక్ సిటీ ఆఫ్ ఇండియా..

మధ్యప్రదేశ్ లోని మందసౌర్ ప్రాంతాన్ని మన దేశంపు ‘ గార్లిక్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఇక్కడ వెల్లుల్లి కేవలం ఒక సాధారణ పంట కాదు, అక్కడి స్థానిక రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా, ఆ ప్రాంతానికే ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. మందసౌర్‌లో పండే వెల్లుల్లి బలమైన సువాసన, ఘాటైన రుచికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నేల, వాతావరణం వెల్లుల్లి సాగుకు సరిగ్గా సరిపోతుంది. అందుకే, ఇక్కడ మంచి వెల్లుల్లి పండుతుంది.

ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం: ఇక్కడి వెల్లుల్లి ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇతర ప్రాంతాల వాటి కంటే ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటుంది. అందుకే వ్యాపారులు, రైతులు దీనికి ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' (ODOP) పథకం కింద మందసౌర్ జిల్లాకు వెల్లుల్లి అధికారిక పంటగా ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా వెల్లుల్లిని ఉత్పత్తి చేసే ప్రముఖ జిల్లాల్లో ఇది కూడా ఒకటి.

33
వెల్లుల్లి మాత్రమే అమ్ముతారా?

ఇక్కడ కేవలం పచ్చి వెల్లుల్లిని విక్రయించడంతో సరిపెట్టరు. మందసౌర్ వెల్లుల్లితో అనేక రకాల విలువైన ఉత్పత్తులను తయారు చేస్తారు గార్లిక్ పౌడర్, వెల్లుల్లి నూనె, వెల్లుల్లి పేస్ట్, పచ్చళ్లు డీహైడ్రేటెడ్ ఫ్లాక్స్ ఈ రకరకాల ఉత్పత్తుల ద్వారా మందసౌర్ వెల్లుల్లికి దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

Read more Photos on
click me!

Recommended Stories