Saffron: కుంకుమపువ్వును ఎలా తయారుచేస్తారు? కేజీ ధర లక్షల్లో ఎందుకు ఉంటుంది?

Published : Nov 03, 2026, 02:58 PM IST

Saffron: మన దేశంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు ఒకటి. చూడటానికి చిన్న చిన్న ఎర్రటి పోగుల్లా కనిపించినా.. దీని ధర మాత్రం కిలోకు లక్షల రూపాయలు ఉంటుంది. అసలు ఈ కుంకుమపువ్వును ఎలా తయారుచేస్తారు? దీని ధర ఎందుకు అంత ఎక్కువో చూద్దాం.

PREV
15
కుంకుమపువ్వు గురించి ఆసక్తికరమైన విషయాలు

సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. కొద్దిగా కుంకుమపువ్వు వేస్తే చాలు.. పాలు, స్వీట్లు, బిర్యానీలకు మంచి రంగు, సువాసన వస్తాయి. అందుకే దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. కేజీ ధర దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఇంత చిన్న పదార్థం అంత ఖరీదుగా ఉండటానికి కారణమేంటి? దీన్ని ఎలా తయారు చేస్తారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

25
కుంకుమపువ్వును దేనితో తయారు చేస్తారు?

కుంకుమపువ్వును ఒక ప్రత్యేకమైన పువ్వు నుంచి తయారు చేస్తారు. ఈ పువ్వు పేరు క్రోకస్ సటైవస్. దీని పూలు ఊదా రంగులో చాలా అందంగా ఉంటాయి. ప్రతి పువ్వులో మూడు ఎర్రటి సన్నని భాగాలు ఉంటాయి. వీటినే సేకరించి ఎండబెడతారు. పూర్తిగా ఎండిన తర్వాత అవే కుంకుమపువ్వుగా మారతాయి. ఇలా తయారైన కుంకుమపువ్వును చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముతారు.

35
కుంకుమపువ్వు ఎక్కడ పండుతుంది?

మన దేశంలో కుంకుమపువ్వు సాగుకు జమ్మూకశ్మీర్ చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా అక్కడి పాంపోర్ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు. అందుకే కశ్మీరీ కుంకుమపువ్వుకు మంచి గుర్తింపు ఉంది. మన దేశంతో పాటు ఇరాన్, స్పెయిన్, గ్రీస్ వంటి దేశాల్లో కూడా ఈ పంటను పండిస్తారు. అయితే ఈ పంట అన్ని ప్రాంతాల్లో పండదు. చల్లని వాతావరణం, అనుకూలమైన నేల ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది.

45
ఒక్క కిలో కుంకుమ పువ్వు తయారీకి ఎన్ని పూలు కావాలి?

ఒక్క కిలో కుంకుమపువ్వు తయారు చేయడానికి సుమారు 1.5 లక్షల నుంచి 1.6 లక్షల పూలు అవసరమవుతాయి. అంతేకాదు.. పూల నుంచి తీసినప్పుడు వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎండబెట్టిన తర్వాత బరువు చాలా తగ్గిపోతుంది.

55
కుంకుమపువ్వు ధర ఎందుకంత ఎక్కువ?

కుంకుమపువ్వు ధర ఎక్కువగా ఉండటానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది ఈ పంటను అన్ని ప్రాంతాల్లో పండించలేరు. అలాగే పూలు పూసే సమయం కూడా చాలా తక్కువ. అంతేకాదు పూలను చేతులతో కోసి, వాటిలోని ఎర్రటి భాగాలను ఒక్కొక్కటిగా వేరు చేయాలి కాబట్టి ఈ పనికి చాలా మంది కూలీలు అవసరమవుతారు. లక్షల పూలను సేకరించినా చివరకు చాలా తక్కువ కుంకుమపువ్వు మాత్రమే లభిస్తుంది. అందుకే దీని ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో దీని ధర లక్షల్లో ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories