Hyderabad Metro: ట్రాఫిక్ ఆగకుండా హైదరాబాద్ లో మెట్రో ఎలా కట్టారు? 2600 పిల్లర్లు ఎలా వేశారు?

Published : Nov 14, 2026, 01:47 PM IST

Hyderabad Metro: హైదరాబాద్ రోడ్ల మీద ఒక్క నిమిషం కూడా ట్రాఫిక్ ఆగదు. ఎప్పుడూ బిజీగా ఉంటుంది. మరి ఆ రోడ్లను మూసేయకుండానే వాటిపైన దాదాపు 70 కిలోమీటర్ల మెట్రో ఎలా కట్టారు?

PREV
17
మెట్రో ఎలా కట్టారు?

హైదరాబాద్‌లో మెట్రో నిర్మాణం విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఇదే. అసలే సిటీలో ట్రాఫిక్ 24 గంటలూ ఉంటుంది. రాత్రి 12 అయినా, ఒంటిగంట అయినా...వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. అలాంటిది రద్దీగా ఉండే అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్బీనగర్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో రోడ్ల మధ్యలో పిల్లర్లు నిర్మించి, వాటిపై మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరి అంత పెద్ద మెట్రో కట్టేటప్పుడు రోడ్లను పూర్తిగా మూసేయకుండా ఎలా పని చేశారు?

27
సీక్రెట్ నంబర్ 1

మీకు తెలుసా? మెట్రోని రోడ్డు మీద కట్టలేదు. మెట్రో నిర్మాణంలో ఉపయోగించిన ప్రధానమైన టెక్నాలజీ ప్రీకాస్ట్ విధానం. అంటే రోడ్డు మీదే కాంక్రీట్ పనులన్నీ చేయకుండా, ముందుగానే ప్రత్యేక ఫ్యాక్టరీల్లో మెట్రోకు అవసరమైన కాంక్రీట్ భాగాలను తయారు చేస్తారు. అందుకోసం

ఉప్పల్, కుత్బుల్లాపూర్ లో..ఇండియాలోనే అతిపెద్ద ప్రీకాస్ట్ యార్డులను ఏర్పాటు చేసి అక్కడ బ్రిడ్జిని ముక్కలు ముక్కలుగా పోత పోశారు. అక్కడ మెట్రో పిల్లర్లపై అమర్చే కాంక్రీట్ సెగ్మెంట్లను తయారు చేశారు. ఈ భాగాలను ముందుగానే అవసరమైన కొలతల్లో సిద్ధం చేశారు. - దాదాపు 85 శాతం మెట్రో నిర్మాణ పనులను ప్రీకాస్ట్ విధానంలో చేపట్టారు. ఈ భాగాలను ముందుగానే అవసరమైన కొలతల్లో సిద్ధం చేశారు. దీంతో రోడ్డు మీద కాంక్రీట్ పనులు, సెంటరింగ్, షట్టరింగ్ వంటి పనులు తగ్గాయి.

37
రాత్రిపూట తరలించేవారు

ప్రతి కొత్త ముక్కని ముందు ముక్కకి ఆనించే పోస్తారు. సో అవి పజిల్ ముక్కల్లా సరిపోతాయి. కానీ ఒక్కో ముక్క కొన్ని ఏనుగుల బరువు ఉంటుంది. ఉదయం పూట తీసుకెళ్తే ట్రాఫిక్ జాం పక్కా. అందుకే రాత్రి పూట మాత్రమే..పెద్ద పెద్ద ట్రైలర్ల మీద తరలించేవారు.

47
సీక్రెట్ నంబర్ 2

రోడ్డు మధ్య ఉన్న డివైడర్లు. అక్కడ కొంచెం స్థలాన్ని మాత్రమే బారికేడ్లతో మూసి పిల్లర్ కట్టారు. రెండు ట్రాక్లని మోసేది ఆ ఒక్క పిల్లరే. ఇలా దాదాపు 2600 పిల్లర్లు. ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ టెక్నాలజీ కనిపిస్తుంది. పిల్లర్లు నిర్మించిన తర్వాత వాటి మధ్యలో భారీ ఇనుప నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు. దీనినే లాంచింగ్ గర్డర్ (Launching Girder) అంటారు.

57
రెక్కలు చాచిన పక్షిలా కనిపించే మెట్రో స్టేషన్

దీనిపై ప్రత్యేక యంత్రాల సాయంతో కాంక్రీట్ సెగ్మెంట్లను ఒక్కొక్కటిగా పైకి ఎత్తి, రెండు పిల్లర్ల మధ్య అమర్చుతారు. ఆ తర్వాత వాటిని ప్రత్యేకమైన ఎపాక్సీ పదార్థంతో కలిపి, హైటెన్షన్ స్టీల్ కేబుల్స్‌తో బిగిస్తారు. ఇలా అనేక సెగ్మెంట్లను కలిపి ఒక మెట్రో వంతెనలా తయారు చేస్తారు. ఈ మొత్తం పని రోడ్డుకి చాలా ఎత్తులోనే జరుగుతాయి కాబట్టి కింద వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఒక్క మెషీన్..నెలకి 15 స్పాన్లు. అప్పట్లో అది ఇండియా రికార్డ్.

ఇక్కడే అసలు ట్విస్ట్. భరత్ నగర్ దగ్గర కింద రైల్వే లైన్లు ఉన్నాయి. ట్రాక్ ల మీద పిల్లర్ కట్టలేరు కదా? అందుకే రెండు పిల్లర్ల నుంచి ముక్కల్ని రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తూ గాల్లోకి పెంచుకుంటూ వెళ్లారు. 65 మీటర్ల గ్యాప్ మధ్యలో రెండు చివర్లు కలిశాయి. మరి స్టేషన్లు? అవి కూడా మధ్యలో ఉన్న పిల్లర్ల మీదే కూర్చొంటాయి. పక్కన ఒక్క పిల్లర్ కూడా లేదు. రెక్కలు చాచిన పక్షిలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? అందుకే స్టేషన్ కింద కూడా రోడ్డు ఫుల్ గా ఓపెన్ గానే ఉంటుంది. 2012 ఏప్రిల్ లో మొదలైన ఈ పని..2017 నవంబర్ లో మొదటి ప్యాసింజర్ మెట్రో ప్రారంభమైంది.

67
కాంటిలీవర్ పద్ధతిలో నిర్మాణం

పంజాగుట్ట, అమీర్‌పేట్ వంటి రద్దీ ప్రాంతాల్లో సాధారణ పద్ధతిలో పిల్లర్ల మధ్య నిర్మాణం చేపట్టడం కష్టం. అందుకే ఎక్కువ దూరం స్పాన్ అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఇంజినీరింగ్ పద్ధతులను ఉపయోగించారు. కొన్ని చోట్ల తాత్కాలిక సపోర్టులు ఏర్పాటు చేసి, వాటి మధ్య వాహనాలు వెళ్లేందుకు తగినంత స్థలం వదిలారు. మరికొన్ని చోట్ల బ్యాలెన్స్‌డ్ కాంటిలీవర్ పద్ధతిలో నిర్మాణం చేపట్టారు. పంజాగుట్టలో ఉన్న ఫ్లైఓవర్‌పై నుంచి మెట్రో మార్గాన్ని తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

77
హైదరాబాద్ మెట్రో నిర్మాణంలో అసలైన ప్రత్యేకత ఏంటి?

హైదరాబాద్ మెట్రో నిర్మాణంలో ప్రతి పనిని రోడ్డు మీదే చేయాలనే సంప్రదాయ పద్ధతికి బదులుగా, ఎక్కువ పనిని ముందుగానే ఫ్యాక్టరీల్లో పూర్తి చేసి, నిర్మాణ ప్రాంతంలో వాటిని అమర్చే విధానాన్ని అనుసరించారు. రాత్రివేళల్లో భారీ భాగాల తరలింపు, ప్రత్యేక లాంచింగ్ గర్డర్లు, మధ్య పిల్లర్లపై ఆధారపడే స్టేషన్ డిజైన్లు.. ఇవన్నీ కలిసి ట్రాఫిక్‌కు అంతరాయం తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.

Read more Photos on
click me!

Recommended Stories