తేనెటీగలు తేనెను ఎందుకు తయారు చేస్తాయి? అది నిజంగా వాటి వాంతేనా?

Published : Oct 21, 2026, 08:16 PM IST

Honey: తేనె తీపిగా ఉండటమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే తేనెటీగలు తయారు చేసే తేనె వాటి వాంతి అని చాలామంది చెబుతుంటారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది? తేనెటీగలు అసలు తేనెను ఎందుకు తయారు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
తేనెటీగలు తేనెను ఎందుకు తయారు చేస్తాయి?

తేనెటీగలు తమ ఆహారం కోసం తేనెను తయారు చేస్తాయి. పువ్వుల నుంచి సేకరించే మకరందం వాటికి ప్రధాన ఆహార వనరు. అయితే అన్ని సమయాల్లో పువ్వులు అందుబాటులో ఉండవు. ముఖ్యంగా చలికాలంలో లేదా పువ్వులు తక్కువగా పూసే సమయంలో ఆహారం దొరకడం కష్టమవుతుంది. అలాంటి సమయాల్లో ఉపయోగపడటానికి తేనెటీగలు ముందుగానే మకరందాన్ని సేకరించి తేనెగా మారుస్తాయి. ఈ తేనెను తేనెపట్టులో నిల్వ చేసుకుంటాయి. తేనెలో చక్కెరలు ఎక్కువగా ఉండటంతో తేనెటీగలకు అవసరమైన శక్తి లభిస్తుంది. అలాగే నీటి శాతం తగ్గినందున ఇది త్వరగా పాడవకుండా ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.

25
తేనె తేనెటీగల వాంతేనా?

తేనెటీగలు తేనెను నోటి ద్వారా బయటకు తీసుకువస్తాయి. అందుకే చాలామంది దానిని వాటి వాంతి అని భావిస్తారు. అయితే ఇది స‌రైంది కాదు. తేనెటీగలు పువ్వుల నుంచి సేకరించిన మకరందాన్ని తమ శరీరంలోని ప్రత్యేక భాగంలో నిల్వ చేస్తాయి. ఈ భాగాన్ని హనీ స్టమక్ లేదా హనీ క్రాప్ అంటారు. ఇది ఆహారం జీర్ణమయ్యే సాధారణ కడుపుకు భిన్నంగా ఉంటుంది. తేనె తయారీ కోసం సేకరించిన మకరందం మొదట ఈ ప్రత్యేక భాగంలోనే నిల్వ ఉంటుంది. అక్కడి నుంచి తేనెపట్టులోని ఇతర తేనెటీగలకు అందుతుంది. కాబట్టి తేనెను సాధారణంగా జీర్ణమైన ఆహారం బయటకు రావడం వల్ల ఏర్పడే వాంతితో పోల్చడం సరికాదు. అయితే మకరందం నోటి ద్వారా తిరిగి బయటకు రావడం వల్ల కొంతమంది దీనిని వాంతిగా అభివర్ణిస్తారు.

35
తేనెటీగలకు రెండు కడుపులు ఉంటాయా?

తేనెటీగలకు రెండు వేర్వేరు కడుపులు ఉన్నాయని సాధారణంగా చెబుతుంటారు. నిజానికి వాటికి ఆహారాన్ని జీర్ణం చేసే సాధారణ జీర్ణవ్యవస్థతో పాటు, మకరందాన్ని మోసుకెళ్లడానికి ఉపయోగపడే ప్రత్యేక నిల్వ సంచి ఉంటుంది. పువ్వుల నుంచి సేకరించిన మకరందం ఈ నిల్వ సంచిలోకి వెళ్తుంది. తేనెటీగలు దానిని తమ గూటికి తీసుకెళ్లి ఇతర తేనెటీగలకు అందిస్తాయి. మరోవైపు, వాటి శరీరానికి అవసరమైన ఆహారం జీర్ణం కావడానికి సాధారణ జీర్ణవ్యవస్థ పనిచేస్తుంది. అంటే ఈ రెండు భాగాలు వేర్వేరు పనులు చేస్తాయి. ఒకటి మకరందాన్ని నిల్వ చేసి తరలించడానికి ఉపయోగపడితే, మరొకటి ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది.

45
పువ్వుల మకరందం తేనెగా ఎలా మారుతుంది?

తేనె తయారీ ప్రక్రియలో తేనెటీగలన్నీ కలిసి పనిచేస్తాయి. పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించిన పని తేనెటీగలు దానిని తేనెపట్టుకు తీసుకువస్తాయి. అక్కడ ఇతర తేనెటీగలకు మకరందాన్ని అందిస్తాయి. ఈ ప్రక్రియలో మకరందంలోకి ప్రత్యేక ఎంజైమ్‌లు చేరుతాయి. ఇవి మకరందంలోని చక్కెరల స్వభావాన్ని మార్చడంలో సహాయపడతాయి. దీంతో మకరందం క్రమంగా తేనెగా మారుతుంది. ఆ తర్వాత తేనెటీగలు తమ రెక్కలను వేగంగా ఆడిస్తూ తేనెపట్టులో గాలి ప్రసరణ కలిగిస్తాయి. దీనివల్ల మకరందంలోని అదనపు నీరు ఆవిరైపోతుంది. నీటి శాతం తగ్గేకొద్దీ మకరందం చిక్కగా మారి తేనె రూపాన్ని సంతరించుకుంటుంది. చివరగా, తేనెటీగలు ఈ తేనెను తేనెపట్టులోని గదుల్లో నిల్వ చేస్తాయి. అవసరమైనప్పుడు తమ ఆహారంగా ఉపయోగించుకుంటాయి.

55
తేనె తయారీలో తేనెటీగల సహకారం ఎంతో ముఖ్యం

తేనె తయారు చేయడం ఒక్క తేనెటీగ చేసే పని కాదు. పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించడం, దానిని తేనెపట్టుకు తీసుకురావడం, ఎంజైమ్‌లతో మార్పులు చేయడం, అదనపు నీటిని తొలగించడం, తేనెను నిల్వ చేయడం వంటి పనుల్లో అనేక తేనెటీగలు పాల్గొంటాయి. ప్రతి తేనెటీగ తనకు అప్పగించిన పనిని చేయడం వల్లే మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. పువ్వులు అందుబాటులో ఉన్నప్పుడు మకరందాన్ని సేకరించి, ఆహారం దొరకని సమయాల్లో ఉపయోగపడేలా తేనెగా నిల్వ చేసుకుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories