Ghost Town: ఒకప్పుడు తుపాను తుడిచిపెట్టిన పట్టణం...ఇప్పుడు మోస్ట్ బ్యూటీఫుల్ టూరిజం ప్లేస్

Published : Oct 21, 2026, 05:45 PM IST

Ghost Town: ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం.. మధ్యలో సముద్రపు అందాలు, 1964 తుపాను మిగిల్చిన శిథిలాలు. ఒకప్పుడు జనజీవనంతో కళకళలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు ఇండియా మోస్ట్ బ్యూటీఫుల్ టూరిజం ప్లేస్ గా మారింది. మరి ఆ నగరమేదో తెలుసా?

PREV
15
లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా

తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోడి (Dhanushkodi) ను ‘లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం.. మధ్యలో సముద్రపు అందాలు, 1964 తుపాను మిగిల్చిన శిథిలాలు. ఒకప్పుడు జనజీవనంతో కళకళలాడిన ఈ పట్టణం ఇప్పుడు పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేక ప్రాంతంగా మారింది.

25
ఒక రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోయిన పట్టణం

ధనుష్కోడి పేరు వినగానే చాలామందికి సముద్రం మధ్యలో కనిపించే రోడ్డు. నీలి సముద్రం, పాడుబడిన భవనాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ అందాల వెనుక గుండెల్ని పిండేసే చరిత్ర ఉంది.

1964 డిసెంబర్‌లో ఈ ప్రాంతాన్ని భీకర తుపాను వణికించింది. భారీ గాలులు, ఎగసిపడిన సముద్రపు అలలు పట్టణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇళ్లు, రైల్వే స్టేషన్, చర్చి సహా అనేక నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఈ విపత్తులో భారీగా ప్రాణనష్టం సంభవించింది. అప్పటివరకు రాకపోకలతో సందడిగా ఉన్న ధనుష్కోడి క్రమంగా జనావాసాలు తగ్గిపోయాయి. అందుకే దీనికి ‘ఘోస్ట్ టౌన్ ఆఫ్ ఇండియా’ అనే పేరూ వచ్చింది.

35
రెండు సముద్రాల మధ్య అద్భుతమైన ప్రయాణం

ధనుష్కోడిలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించేది సముద్రం మధ్యలో ఉండే రోడ్డు. రామేశ్వరం నుంచి ఈ ప్రాంతానికి ప్రయాణిస్తుంటే ఇరువైపులా నీలి సముద్రం కనిపిస్తుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ చుట్టూ భూమి తగ్గిపోతూ, సముద్రం విస్తరిస్తున్న అనుభూతి కలుగుతుంది.

ధనుష్కోడి చివరి అంచులోని అరిచల్ మునై (Arichal Munai) ప్రాంతం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతాన్ని చూడొచ్చు. రెండు సముద్రాల నీటి రంగు, అలల తీరు ఒకేలా కనిపించకపోవడం పర్యాటకుల్లో ఆసక్తి కలిగిస్తుంది.

45
రామసేతుతో ముడిపడిన విశ్వాసాలు

ధనుష్కోడికి చారిత్రక ప్రాధాన్యంతో పాటు ఆధ్యాత్మిక గుర్తింపూ ఉంది. శ్రీరాముడు లంకకు చేరుకోవడానికి వానర సేన సహాయంతో నిర్మించిన వారధిగా రామసేతును విశ్వసిస్తారు. భారతదేశంలోని పంబన్ ద్వీపం నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వైపు సున్నపురాయి నిర్మాణాలు, ఇసుక దిబ్బలు, పగడపు దిబ్బల వరుస విస్తరించి ఉంది. దీనినే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు.

55
ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి?

రామేశ్వరం నుంచి రోడ్డు మార్గంలో ధనుష్కోడికి వెళ్లొచ్చు. అరిచల్ మునై, ధనుష్కోడి బీచ్, పాత చర్చి శిథిలాలు, పూర్వపు పట్టణ ఆనవాళ్లు చూడొచ్చు. సాధారణంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణానికి ముందు వాతావరణం, రోడ్డు పరిస్థితులు, పర్యాటకుల ప్రవేశ సమయాలు తెలుసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories