వర్షం పడుతున్నప్పుడు రోడ్డుపై నీరు నిలిచిపోయే అవకాశం ఎక్కువ. ముందున్న వాహనాలు కూడా సరిగా కనిపించవు. బ్రేకింగ్ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అందుకే వర్షం, తుఫాను లాంటి వాతావరణంలో వాహనాన్ని తక్కువ స్పీడ్‌తో నడపాలి. ముందు స్పష్టంగా కనిపించే దూరంలోనే వాహనాన్ని ఆపగలిగే స్పీడ్‌ను ఎంచుకోవాలని MoRTH రూల్స్ చెబుతున్నాయి. అలాగే, వాతావరణం బాలేనప్పుడు ముందు వెళ్లే వాహనానికి, మీకు మధ్య గ్యాప్ పెంచాలి.
హైవే టన్నెల్స్ (సొరంగ మార్గాలు)లో డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక రూల్స్ ఉంటాయి. టన్నెల్‌లోకి వెళ్లే ముందే డిప్పర్/హెడ్‌లైట్స్ ఆన్ చేయాలి. అలాగే టన్నెల్స్‌లో ఓవర్‌టేక్ అస్సలు చేయకూడదు. యూ-టర్న్ తీసుకోకూడదు. రివర్స్ తీయకూడదు. ఎమర్జెన్సీ అయితే తప్ప వాహనాన్ని ఆపడం లేదా పార్కింగ్ చేయడం చేయకూడదు. ఒకవేళ ఎమర్జెన్సీగా వాహనాన్ని ఆపాల్సి వస్తే హజార్డ్ వార్నింగ్ లైట్స్ వేయాలి. ః
రూల్స్ ప్రకారం రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్స్‌ను వాహనం ముందు, వెనుక పెట్టాలి. టన్నెల్ అంటే కేవలం చీకటిగా ఉండే రోడ్డు అనుకోకుండా, డ్రైవింగ్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రాంతం అని గుర్తుంచుకోవాలి.
హైవేపై పెద్ద స్పీడ్ లిమిట్ బోర్డు చూడగానే కచ్చితంగా ఆ స్పీడ్‌తోనే వెళ్లాలని కొందరు అనుకుంటారు. కానీ స్పీడ్‌ను డిసైడ్ చేసేటప్పుడు రోడ్డు కండిషన్ మాత్రమే కాదు.. ట్రాఫిక్, వాతావరణం, విజిబిలిటీ, వాహనం కండిషన్ లాంటివి కూడా డ్రైవర్ దృష్టిలో పెట్టుకోవాలి.
MoRTH రూల్స్ ప్రకారం, ఎప్పుడూ వాహనం మీ కంట్రోల్‌లో ఉండే స్పీడ్‌తోనే నడపాలి. అలాగని స్పీడ్ లిమిట్ దాటకూడదు. ఉదాహరణకు, స్పీడ్ లిమిట్ 100 km/h ఉన్నా, భారీ వర్షం వల్ల విజిబిలిటీ బాగా తగ్గితే, 100 km/h స్పీడ్‌తో వెళ్లడం ఏమాత్రం సేఫ్ కాదు. స్పీడ్ లిమిట్ అనేది చట్టపరమైన గరిష్ట పరిమితి మాత్రమే. ప్రతి పరిస్థితిలోనూ అదే స్పీడ్‌తో వెళ్లాలని రూల్ లేదు.