Fun Facts: ప్ర‌పంచంలో ఎక్కువ మంది ఉప‌యోగించే ప‌దం ఇదే.. ఈ ప‌దం జోక్ నుంచి పుట్టిందని తెలుసా.?

Published : May 03, 2026, 10:03 AM IST

Fun Facts: రోజూ మనం వేలాది పదాలు మాట్లాడుతుంటాం. కానీ అందులో ఒక చిన్న పదం మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినదిగా మారింది. అదే “OK”. ఇది ఏ పెద్ద గ్రంథం నుంచి వచ్చినది కాదు, ఒక చిన్న జోక్ నుంచి పుట్టి ప్రపంచాన్ని చుట్టేసిన పదం. 

PREV
15
ప్రపంచంలో ఎక్కువగా వినిపించే పదం

ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నా “OK” అన్న పదం మాత్రం అందరికీ అర్థమవుతుంది. ఇది అంగీకారం తెలిపేందుకు, “అంతా బాగానే ఉంది” అని చెప్పేందుకు ఉపయోగించే సులభమైన మార్గం. మనం రోజూ ఎన్నోసార్లు ఉపయోగించినా, అది ఎంత ప్రత్యేకమో మనకు తెలియదు.

25
ఒక సరదా తప్పిదం నుంచి పుట్టిన పదం

1839లో అమెరికాలో రచయితలు, జర్నలిస్టులు సరదాగా పదాలను తప్పుగా స్పెలింగ్‌తో రాయడం ఒక ట్రెండ్‌గా ఉండేది. అదే సమయంలో “All Correct” అనే పదాన్ని సరదాగా “Oll Korrect” అని రాశారు. అక్కడినుంచే “OK” అనే చిన్న పదం పుట్టింది.

35
వార్తాపత్రికలో మొదటి వినియోగం

ఈ పదం మొదటిసారి బోస్టన్ నగరంలోని ఒక పత్రికలో కనిపించింది. 1839 మార్చి 23న ప్రచురితమైన ఒక వార్తలో “OK” అనే పదాన్ని ఉపయోగించారు. అప్పట్లో ఇది ఒక చిన్న జోక్ మాత్రమే. కానీ అదే పదం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని ఎవరూ ఊహించలేదు.

45
రాజకీయ ప్రచారంతో విస్తరణ

1840లో అమెరికా ఎన్నికల సమయంలో “OK” పదానికి మరింత గుర్తింపు వచ్చింది. అభ్యర్థి మార్టిన్ వాన్ బ్యూయరెన్‌ను “Old Kinderhook” అని పిలిచేవారు. ఆయన అనుచరులు “OK” అనే నినాదంతో ప్రచారం చేశారు. దీంతో ఈ పదం దేశమంతా వేగంగా వ్యాపించింది.

55
టెక్నాలజీతో ప్రపంచవ్యాప్త గుర్తింపు

తర్వాత టెలిగ్రాఫ్, ఫోన్, ఇంటర్నెట్ వంటి కమ్యూనికేషన్ పద్ధతులు వచ్చాక “OK” మరింత ప్రాచుర్యం పొందింది. చిన్నదిగా ఉండటం, సులభంగా అర్థమవడం వల్ల ఇది అన్ని భాషల్లోనూ కలిసిపోయింది. ఇప్పుడు చాట్, మెసేజ్, ప్రోగ్రామింగ్ ఏ దైనా మాట్లాడినా “OK” లేకుండా సంభాషణ పూర్తి కాదు.

Read more Photos on
click me!

Recommended Stories